For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఖరీదైనవి కాదు.. చక్కటి అభిరుచి ముఖ్యం....!

|

Home Interior design ideas
మీ డ్రాయింగ్ రూం అందంగా ఉండాలంటే... అలంకరణలో ప్రత్యేకత ఉండాలి. ప్రతి ఇల్లలో డ్రాయింగ్ రూం అంటే అదేదో స్టోర్ రూం లా వాడేసుకొంటుంటారు కొందరు. ప్రతి ఇంటికి అలంకరణ అవసరం. అలంకరణ లేనిదే ఆ ఇల్లు చూడటానికి వీలుకాదు. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమైయ్యే రకరకాల ఆధునిక, సాంకేతిక వస్తువులతో ప్రతి ఒక్క గదిని అందంగా..ఆకర్షణీయంగా అలంకరించుకొంటున్నారు. ఇంటి అలంకరణలో ఒక్కో గదికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. ఏ గదిలో అమర్చాల్సిన వస్తువులు ఆగదిలో పెట్టుకొన్నప్పుడే ఆ గదులకు అందం చేకూరుతుంది.

ప్రతీ వస్తువు అత్యంత కళాత్మకంగా ఉండాలి. గదులు వేరైనప్పటికీ, వాటి అలంకరణలో తేడా ఉన్నప్పటికీ, వాటి మధ్య సారూప్యం ఉంటే ఇంకా బాగుంటుంది. వంటగది, లివింగ్ రూం, డైనింగ్, పూజగది, డ్రాయింగ్ రూం వేటి అవే సాటి. ఇంటీరియర్ డెకరేషన్ లో ముఖ్యంగా డ్రాయింగ్ రూం అందాన్ని మరింత పెంచుతుంది. డ్రాయింగ్ రూమ్ అంత అందాన్ని ఎలా పొందుతుందంటే..డ్రాయింగ్ రూమ్ లో ఇత్తడి ఫర్నిచర్, ఉడెన్ ఫర్నిచర్ అమర్చాలి. కళాత్మకమైన పెయింటింగ్స్, చక్కటి క్రోటన్ మొక్కలు, ఫ్లవర్‌ వేజ్‌లతో ఎలా అమరిస్తే ఇల్లు అందంగా ఉంటుందో ఒక్కసారి మీ సృతి పథంలో ఊహించుకోండి.

హాల్లో సిటింగ్ ఏర్పాటు ఎలా ఉంటే చూడడానికి బావుంటుందో, సౌకర్యంగా ఉంటుందో చూడండి. మ్యూజిక్ సిస్టం, టీవీ, వాల్‌ హ్యాంగింగ్స్, లైటింగ్ సిస్టమ్, సోఫాల దగ్గర తివాచీలు ఎలా ఏర్పాటు చేస్తే అందంగా ఉంటుందో రకరకాలుగా అమర్చి చూసుకోసుకోవాలి. ఒకటికి రెండు సార్లు అలా సరిచూసుకొన్నాకే ఫైనల్ గా అమర్చుకోవాలి.
మీ ఇంటికి వచ్చిన అతిథులు మీ గోడలకు ఉన్న పెయింటింగ్స్ చూసి వాటిని ఎక్కడ కొన్నారని అడిగి మాకు కూడా కొనిపెట్టండి అనేలా ఉండాలి. ఖరీదైనవి కాదు, చక్కటి అభిరుచి ముఖ్యం.

ఇంట్లో రూముల గురించి మాత్రమే కాక పోర్టికో, ఇంటి ముందు ఉండే ఖాళీ ప్రదేశంలో, ఇంటి వెనుక పెంచే మొక్కలు ఊయల గురించి కూడా కొంచెం శ్రద్ధ తీసుకోండి.
మీ ఇంటి వరండాలోనూ, ఇంటిముందు ఉన్న ఖాళీ ప్రదేశంలోనూ పెంపుడు జంతువుల కోసం కేజ్‌లు ఏర్పాటు చేయండి. వాటిలో రంగురంగుల పక్షులు, చిలకలు, లవ్‌బర్డ్స్, మైనాలు వంటివి పెట్టండి. వాటిని వన్యప్రాణి సంరక్షణ చట్టం పరిధిలో తప్పు కాని విధంగా పెంచాలని మర్చిపోవద్దు. తాబేళ్లు, కుక్కలు, కుందేలు లాంటి జంతువులు కూడా ఇంటి అందాన్ని పెంచుతూ ఇంట్లో వాళ్లకు ఆత్మీయతను పంచుతాయి.

ఇంటిని ప్రశాంతనిలయంలా తీర్చిదిద్దడానికి ఇంట్లోని ప్రతి గది కొలతలు మీకు క్షుణ్నంగా తెలిసి ఉండాలి. అప్పుడే అలంకరణ విషయంలో స్పష్టమైన అవగాహన వస్తుంది.
ప్రతి గదిలోనూ ఏదో ఒక ప్రాంతం ఫోకస్ పాయింట్‌లా ఉండాలి. అందుకు ప్రతి గదిలోనూ ఒక ప్రదేశంలో మీ అభిరుచికి తగినట్లు ప్రత్యేకమైన శిల్పాలు, చిన్నపిల్లల బొమ్మలు, లైటింగ్ టేబుల్స్, షాండ్లియర్, ఫ్లవర్ పాట్స్‌లాంటివి అమర్చుకోవాలి.

గదిలో అమర్చిన లైటింగ్ ఆ గది అందాన్ని మరింత ఇనుమడింపచేస్తుంది. మీ గది రంగును రిఫ్లెక్ట్ చేసే విధంగా బల్బులను అమర్చుకోవాలి. మీరు అమర్చిన లైటు కింద చక్కటి రౌండ్ టేబుల్ వేసి దానిమీద ఫ్లవర్‌ బేసిన్ పెట్టి చూడండి ఆ అందం ఎలా ఉంటుందో. రంగురంగుల డిజైన్లలో ఉండే బేసిన్‌ లో నీళ్లు పోసి దాని పై రంగురంగుల అందమైన పూలను అమర్చితే సహజ సిద్ధంగా ప్రకృతి తలపించినట్టు అవుతుంది.

English summary

Home Interior design ideas...! | గది.. గదికీ ఓ అలంకరణ...!

When it comes to home interior design many people think that repainting your home and changing furniture aree the only things that will make a big difference.Yes, they will but there aree a thousand other things, which can be done creatively aparet from simple repainting you home that can make a huge difference. If you aree planning to redesign your home then I you can save a lot of money by looking at the smaller things in your home, which will generate a perception of newly, designed home and that too in a small budget.
Story first published:Wednesday, June 13, 2012, 15:21 [IST]
Desktop Bottom Promotion