Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ఇంటి అందం..హుందాతనం..సౌకర్యవంతాన్నిచ్చే సోఫాలు....

1. సోఫా సెట్ కొనే ముందు ఎంపిక చేసుకున్న సోఫాసెట్‌పైన కనీసం పది నిమిషాలపాటు కూర్చోవాలి. అలా చేయడంవల్ల అది సౌకర్యంగా ఉన్నదీ, లేనిదీ తెలుస్తుంది. చేతులు పెట్టుకునే చోట, కింద, వెనక వైపున అంతా సమంగా... మెత్తగా ఉందా లేక ఎక్కడైనా గట్టిగా ఫ్రేమ్ తగులుతోందా అన్న విషయాలను గమనించండి.
2. ఇక సోఫాపై ఊరికే కూర్చోక కాసేపు అటూ, ఇటూ కదలాలి. ఇలా చేయడంవల్ల మనం కదలినప్పుడు సోఫా కీచుమనే శబ్దం లాంటిదేదైనా చేస్తుందేమో తెలిసిపోతుంది. అప్పుడు మంచివాటిని ఎంపిక చేసుకోవచ్చు.
3. అలాగే సోఫా వెనుక వైపున ఉండే బ్యాక్‌రెస్ట్.. మీ నడుం కింది భాగానికి దన్నుగా, హాయినిచ్చేదిగా ఉండాలి. కాళ్ళు నేలమీద ఆని సౌకర్యంగా కూర్చున్నట్లు... కూర్చున్నవారికీ, చూస్తున్నవారికీ అనిపించాలి. కూర్చున్నప్పుడు సోఫా సీటు లోపలికి వెళ్తుంది కదా...! అలా వెళ్ళడం పది సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా ఉండకూడదన్న విషయాన్ని గమనించాలి.
4. అతుకుల్లాంటివి ఉన్నచోట కాస్త జాగ్రత్తగా గమనించాలి. కుట్లు పటిష్ఠంగా ఉందీ లేనిదీ చూసుకోవాలి. ఇకపోతే ముఖ్యంగా సోఫాసెట్ వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే బ్రోచర్‌ను తీసుకోవడం మాత్రం మరువవద్దు.
5. ఒక సోఫా సెలక్ట్ చేసే ముందు ఇంటి థీమ్ ముందే నిర్ణయించుకోవాలి. దాన్ని బట్టి ఎలాంటి ఫర్నీచర్ ఎంచుకోవాలో ఒక స్పష్టత వస్తుంది.
6. ఒకవేళ ఇంటి ఇంటీరియరంతా వుడెన్ ఎంచుకుంటుంటే ఫర్నీచర్ కూడా వుడెన్‌దే ఎంచుకోవాలి. అయితే వీటికి మంచి కుషన్లు వేస్తే బాగుంటుంది.
7. హాలు చిన్నగా ఉంటే.. తక్కువ ఎత్తులో ఉన్న సోఫాలను సెలక్ట్ చేసుకోవాలి. దానివల్ల గది చిన్నగా ఉన్నట్లు అనిపించదు. ఎత్తుగా ఉన్న వాటిని ఎంచుకుంటే గది నిండా సోఫానే ఉన్నట్లు కనిపిస్తుంది.
8. ఇంటి రంగును బట్టి, సోఫా రంగును ఎంచుకోవాలి. ఇంటి రంగు డార్క్ అయితే సోఫా లైట్ కలర్, ఒక వేళ ఇంటి రంగు లైట్ అయితే సోఫా డార్క్ కలర్ తీసుకుంటే బాగుంటుంది. గది రంగు ఉన్న సోఫాలను ఎంచుకుంటే రిచ్ లుక్ వస్తుంది.
9. మామూలుగా అయితే ఇద్దరు లేక ముగ్గురు కూర్చునేట్లుగా సోఫా ఉండి ఒక కుర్చీ సపరేట్‌గా వస్తుంది. అలా నచ్చకపోతే ‘ఎల్’షేప్‌తో ఇప్పుడు సరికొత్త సోఫాలు మార్కెట్‌లో ఉన్నాయి. వీటివల్ల న్యూలుక్ రావడమే కాదు, స్థలమూ వృథా అవదు.
10. సోఫాలు పాతగా అయిపోయనట్లుంటే.. అప్‌హోల్‌స్ట్రీ మారిస్తే సరిపోతుంది. దీనికి లెదర్, కాటన్, జెకార్డ్, సిల్క్, వెల్ షెనిల్ అనే మెటీరియల్‌లు దొరుకుతాయి. వాటితో కొత్త దాలను తేవచ్చు. అదే చెక్క సోఫాలకయితే కుషన్లు మార్చేస్తే సరిపోతుంది.



Click it and Unblock the Notifications