Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
డైనింగ్ టేబుల్ అలంకరణతోనే కడుపు నిండు...!
ప్రతి రోజూ ఇంట్లో వాళ్లందరూ కలిసే చోటు డైనింగ్ టేబుల్ దగ్గరే. కాబట్టి అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేటట్లు చూసుకోవాలి. ముఖ్యంగా డైనింగ్ టేబుల్ ఎప్పుడూ కొత్తగా ఉండాలే చూసుకోవాలి. అప్పుడే మనస్సుకు ప్రశాంతత మరికొంత సమయం అక్కడ గడపాలనుకోనే భావన ఏర్పడుతుంది. అందుకోసం కొన్ని చిట్కాలు మీకోసం........
ప్రతి రోజూ డైనింగ్ టేబుల్ కొత్తగా కనిపించాలనుకుంటే అక్కడ తప్పనిసరిగా ఉండాల్సింది, టేబుల్ క్లాత్, చేతిరుమాళ్లు, సెంటర్ పీస్, టేబుల్ రన్నర్, రుచికరమైన వంటకాలు...టేబుల్ రన్నర్ తో ఆ టేబుల్ కి కొత్త అందం ఉట్టిపడేలా చేస్తుంది. ముఖ్యంగా సెంటర్ పీస్ అక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది. దాని మీద అమర్చిన ఫ్లవర్ వాజ్ ముచ్చటగొలుపుతూ సహజ వాతావరణంనీ తెలుపుతుంది.

డైనింగ్ టేబుల్ మీద స్టాండ్ లేకుండా, వేడి పదార్థాలను వుంచిన గిన్నెలను పెట్టకూడదు. డైనింగ్ ప్లేట్లను టేబుల్ మీద పెట్టేటప్పుడు, తప్పని సరిగా మేట్స్‌ను ప్లేట్ అడుగున ఉంచాలి. భోజనానికి ముందు టేబుల్ మీద దుమ్ములేకుండా మెత్తటి బట్టతో శుభ్రంగా తుడిచి ఆహార పదార్థాలను, ప్లేట్లను, గ్లాసులను అమర్చాలి. భోజనమైన వెంటనే టేబుల్ మీద ఉన్న ప్లేట్లను, గిన్నెలను, గ్లాసులని తీసేసి టేబుల్‌ని శుభ్రం చేసేయాలి. స్పాంజ్ కానీ, మెత్తటి బట్టను కాని సర్ఫ్ నీళ్ళల్లో తడిపి దానితో టేబుల్‌ను తుడిస్తే టేబుల్ మీద జిడ్డు లేకుండా శుభ్రంగా ఉంటుంది.
కరెంట్ పోయిన సమయంలో కొవ్వొత్తి వెలిగించి భోజనం చేస్తున్నప్పుడు ఆ కొవ్వొత్తిని స్టాండ్ లేకుండా టేబుల్ మీద పెట్టకూడదు. డైనింగ్ టేబుల్ మీద ఉపయోగించే స్టాండ్స్, మేట్స్ టేబుల్ మీదనే ఉంచేయకూడదు. వాటిని వేరు చోట భద్రంగా పెట్టాలి. డైనింగ్ టేబుల్ మీద చక్కగా అందమైన ఫ్లవర్ వాజ్‌ను వుంచితే ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఫ్లవర్ వాజ్ పెట్టే చోటు ప్రత్యేకంగా లైట్స్ పడేలాగా అమర్చుకోవాలి.
అలాగే టేబుల్ మీద వేసే క్లాత్ లు అందంగా ఫ్యాబ్రిక్స్ తో తయారు చేసినవి, ఎంపిక చేసుకొంటే మరింత అందంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా క్లాసిక్ టేబుల్ రన్నర్ కి కాటన్ ఫ్యాబ్రిక్ మెటిరియల్ తో తయారు చేసినవి రెగ్యులర్ గా ఉపయోగపడుతాయి. డార్క్ ఉడెన్ డైనింగ్ టేబుల్ కి ప్లైన్ లైట్ కలర్ టేబుల్ క్లాత్ సొగసుగా కనిపిస్తుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం, పార్టీ లాంటివి గనుక జరుగుతుంటే, అప్పుడు అందరూ ఒక్క చోట చేరుతారు కాబట్టి సిల్క్ టేబుల్ రన్నర్(డార్క్ అండ్ బ్రైట్ )కలర్స్ తో డెకరేట్ చేస్తే అతిథులను మరింతగా ఆకర్షింపచేస్తారు. దాంతో మీ అభిరుచి వారి నచ్చి ప్రశంలు కురిపిస్తారు.



Click it and Unblock the Notifications