Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఫ్లవర్ వాజ్ లో పువ్వులు ఫ్రెష్ గా ఉండాలంటే...

1. రంగురంగుల పువ్వులను సిద్ధం చేశాక కాడల్ని అంగుళం మేర కత్తిరించాలి. ఆ తరవాతే అవి సగం మునిగేవరకూ నీళ్లు పోయాలి. ఈ పువ్వులు నాలుగైదు రోజులు తాజాగా ఉండాలంటే... అందులో ఆస్ప్రిన్ మాత్రను పొడిచేసివేస్తే చాలు. పువ్వులు, ఆకులు ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి. ఇలా రోజుకోసారి నీళ్లు మార్చుకొని పొడి వేయాలి.
2. వారానికోసారి ఫ్లవర్ వాజులను శుభ్రపరచుకోవాలి. వాటిని ముగ్గు పొడితో కానీ నిమ్మ తొక్కతో కానీ రుద్ది కడిగితే మురికి వదిలిపోతుంది. అలానే వాజులో నీళ్లు తీసుకుని ఒక రాగి నాణేన్ని వేసి చూడండి. పువ్వులుతాజాదనంతో వికసిస్తాయే తప్ప వాడిపోవు.
3. ఇంట్లో ఖాళీ అయిన హెయిర్ స్ప్రే బాటిల్ లో నీళ్లు నింపి అప్పుడప్పుడు ఆకులు, పూరేకలపై చల్లుతూ ఉంటే వాడిపోకుండాఉంటాయి.శీతలపానీయాలు కూడా పువ్వులు వాడిపోకుండా కాపాడతాయి. పానీయాలు, సోడా వంటివి అందుబాటులో ఉంటే వాజులో కొద్దిగా వేయండి. అందులో ఉండే చక్కెరలు పువ్వులను తాజాగా ఉంచుతాయి.
4. ప్లవర్ వాజ్ లో సాల్ట్ కల్పిన నీరు పోస్తే ప్లవర్స్ ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంటాయి. కప్పు గోరువెచ్చటి నీటిలో మూడు చెంచాల పంచదార, రెండు చెంచాల వెనిగర్ కలిపి.. వాజులో పోయాలి. వెనిగర్ పువ్వులకు బ్యాక్టీరియా వ్యాపించకుండా కాపాడుతుంది. వారం రోజుల పాటు పువ్వులను మార్చుకోనక్కర్లేదు.
5. పువ్వులు కొద్దిగా వడలినట్లు కనిపిస్తున్నాయా.. అయితే పువ్వుల్ని పూర్తిగా తొలగించాల్సిన అవసరంలేదు. అలా వడలిన రేకల్ని మాత్రమే కత్తిరించండి సరిపోతుంది.
6. ఫ్లవర్ వాజ్ లో పువ్వులు అమర్చేటప్పుడు ఒక్కోసారి వాటి కాడలు వంగిపోయి ఉంటాయి. అలాంటప్పుడు కాడల్ని సన్నగా చేసి స్ట్రాలో అమర్చి వాజ్ లో పెట్టుకుంటే సరి! రంగురంగుల స్ట్రాలైతే వాజ్ అందం మరింత ఇనుమడిస్తుంది.



Click it and Unblock the Notifications