Latest Updates
-
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్‌గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
ప్రమాదాలకు చెక్ పెట్టె వంటగది పరిసరాలు ఎలా ఉండాలి..

కాబట్టీ డైనింగ్ టేబుల్ వంటగదిలో ఉండటం వలన త్వరగా ఊబకాయం బారినపడే ప్రమాదం నుంచి తప్పించుకోవడమేగాక అన్ని వస్తువులు అందుబాటులో ఉంటాయి. వంటగదిలో అల్మారాలను సాధ్యమైనంత ఎక్కు వగా ఏర్పాటు చేయడం కూడా అవసరమన్న విషయం గుర్తుంచుకోవాలి.వంటగదిలో తగినంత వెలుతురుతోపాటు వెంటిలేషన్ తప్పకుండా ఉండాలి. అలాగే ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా తప్పనిసరిగా అమర్చుకోవాలి. వంట చేసేటప్పుడు గదిలో వ్యాపించే వివిధ రకాల వాసనలు, వేడిగాలులను బయటికి పంపించి, తాజా గాలిని గదిలోకి తెచ్చేందుకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో గదిలో చల్లటి వాతావరణం నెలకొంటుంది.
కిచెన్‌లో వస్తువులను ఎంత తక్కువగా ఉంచుకుంటే అంత మంచిది. కిచెన్ లో అల్మారాలు పెట్టుకుంటే వంట సామాన్లన్నింటినీ అన్నింటినీ అందులో సర్దేయవచ్చు. దీనివల్ల దుమ్ము, ధూళి నుండి పాత్రలను రక్షించుకోవచ్చు. అలాగే కిచెన్‌కు బయట భోజనాల గదిలో ఫ్రిజ్ ను అమర్చుకుంటే సౌకర్యంగా ఉంటుంది. ఫ్రిజ్ లోని వస్తువులు అందుకునేందుకు వీలుగా వంటగదికి, భోజనాల గదికి మధ్యలో ఉండేలా ఏర్పాటు చేసుకోవడం మంచిది. హాలు సైజుకు సరిపోయే విధంగా డైనింగ్ టేబుల్ ను ఎంపిక చేసుకోవటం మర్చిపోకూడదు. దీనివల్ల హాలు అందం ద్విగుణీకృతం కూడా అవుతుంది.
ఫ్రిజ్ లు, గ్రైండర్, ఎలక్ట్రిక్ హీటర్లు లాంటివి వంటగదిలో గ్యాస్ సిలిండర్లకు దగ్గరగా పెట్టుకోకూడదు. స్విచ్ ఆఫ్, ఆన్ చేసే సందర్భాలలో వచ్చే స్పార్క్‌ల వల్ల వంటగ్యాస్ గాలిలో పొరపాటుగా వ్యాపించి ఉన్నప్పుడు అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త వహించాలి.



Click it and Unblock the Notifications
