Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
డైనింగ్ టేబుల్ అమరిక మీ హస్త కళా నైపుణ్యానికి ప్రతీక

మీ ఇంటికి వచ్చే అతిథుల్ని ఆకర్షించేలా డైనింగ్ టేబుల్ ని సర్దడం మీ చేతుల్లోనే ఉంది. మీ టేస్ట్ కు తగ్గట్టుగా డైనింగ్ టేబుల్ ని డిజైన్ చేసుకుంటే మీ వంటిల్లు ఎంతో బాగుంటుంది. మీ అభిరుచికి అద్దం పడుతుంది. ఇల్లు చిన్నదైనా డైనింగ్ టేబుల్ ని అమర్చుకునే విధానం, దాని శుభ్రత కిచెన్ ని అందంగా మార్చేస్తుంది. అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే ఈరోజే మీ డైనింగ్ టేబుల్ ని చక్కగా డిజైన్ చేసుకోండి. అందుకోసం మీరు కొన్ని చిట్కాలు పాటించడం ఎంతో అవసరం....
1. మీ డైనింగ్ టేబుల్ డిజైన్ కి తగ్గ క్లాత్ ని సెలక్ట్ చేసి దానిమీద వేస్తే డైనింగ్ టేబుల్ అందంగా కనిస్తుంది. కాబట్టి మంచి డిజైన్ ఉన్న క్లాత్ ని ఎంపికచేసుకోవాలి.
2. డైనింగ్ టేబుల్ పై అన్ని వస్తువులను తీసేసి సబ్బునీళ్ళలో తడిపిన బట్టతో లేదా స్పాంజ్ తో తుడిచి ఆరబెట్టాలి. ఆ తర్వాత పొడిబట్టతో తుడవాలి.
3. ఉదయం టిఫిన్ ఐటమ్స్ చట్నీ, హాట్ బాక్స్ లో ఇడ్లీలు, వేరేవి ఉంటే వాటిని నీట్ గా టేబుల్ పైన సర్దాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు తినే టైంలోనే, నీళ్లగ్లాసులు ఉంచాలి. తిన్న వెంటనే ఆ సామాన్లను శుభ్రం చేసేందుకు సింక్ లో వేసేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తిన్న తర్వాత ప్లేట్స్, కంచాలు, కూర గిన్నెలు వంటివి టేబుల్ పైన ఉంచరాదు.
4. వంటింట్లో వండిన పదార్థాలు టేబుల్ పైన పెట్టే ముందు చిన్న స్టీల్ స్టాండ్ ను టేబుల్ పైన ఉంచి వాటిపైన ఆ పదార్థాల పాత్రల్ని పెట్టాలి. ఇలా చేయడం వల్ల టేబుల్ పైన ఎలాంటి గీతలు పడటానికి అవకాశం ఉండదు.
5. వండిన పదార్థాలు తినే పదార్థాలు మినహా ఇతర ఏ వస్తువులూ టేబుల్ పైన పెట్టకూడదు. తినబోయే పదార్థాలు మినహా మిగిలినవి ఏవీ అంటే బొమ్మలు, పచారీ సామాన్లు వంటివి ఏవీ టేబుల్ పైన పెట్టకూడదు.
6. అరటిపండ్లు ఇంటికి తెచ్చిన వెంటనే మెష్ ఉన్న నెట్ లోనే ఉంచాలి. సాధ్యమైనంత త్వరగా వాటిని తినేయాలి. లేదంటే అవి పండి మాగిపోతాయి. కొంత మందికి ఇష్టం ఉండదు కాబట్టి. తెచ్చిన రెండు మూడు రోజుల్లో ఖాళీ చేయడం మంచిది.
7. మామిడిపండ్లు లేదా సీజనల్ పండ్లను టేబుల్ అంతా పరవకుండా, పెద్ద ప్లాస్టిక్ లేదా స్టీల్ గిన్నెలో ఉంచాలి. ద్రాక్ష పండ్లు తీసుకురాగానే శుభ్రంగా కడిగి ఫ్రిజ్ లో పెట్టాలి. ఆ తర్వాత తినడానికి కనీసం అర గంట ముందే ఫ్రిజ్ లోంచి తీసి టేబుల్ పైన ప్లేట్ లో సర్ది పైన మూత పెట్టాలి.
8. చాలా మంది మిగిలిపోయిన పులుసు, చారు, పెరుగు, వంటివి టేబుల్ పైనే పెట్టి అలాగే ఉంచేస్తారు. సాధ్యమైనంత వరకూ ఏరోజు వండిన పదార్థాల్ని ఆరోజే ఖాఖీచేసేయాలి.
స్వీట్స్ ఎప్పుడూ తినే గంటముందు మాత్రమే ఫ్రిజ్ నుంచి బయటికి తీయాలి. ఏమైనా మిగిలితే వెంటనే ఫ్రింజ్ లో పెట్టేయాలి.
9. అందరి భోజనాలు పూర్తయిన వెంటనే డైనింగ్ టేబుల్ ని తడిబట్టతో శుభ్రంగా తుడిచేయాలి. అవసరమైతే డెట్టాల్ వేసి తుడిచేయాలి. అలా చేయడం వల్ల బ్యాక్టీరియా టేవుల్ పైన చేరకుండా ఉంటుంది.
10. సాల్ట్, పెప్పర్ వంటివి చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో పోసి టేబుల్ పైన ఉంచాలి. పెరుగు, నెయ్యి, నూనె వంటివి టేవుల్ పైన ఉంచకూడదు.
11. ఈ రోజుల్లో డైనింగ్ టేబుల్ మీద మనీ ప్లాంట్ గానీ చిన్న గ్లాస్ లో నీరు పోసి పెంచే మొక్కల్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటున్నారు. మీకు అలాంటి టేస్ట్ ఉంటే అందంగా అలంకరించుకోండి. అయితే ఒక్క సంగతి మాత్రం మరువకండి ప్లాంట్ లో పోసిన నీటిని రోజు విడిచి రోజు మార్చాలి.
ఇలాంటి చిట్కాలు పాటించడం వల్ల మీ డైనింగ్ టేబుల్ ఎంతో అందంగా కనిపిస్తుంది. అంతే కాదు మీ ఆరోగ్యం పదికాలాలపాటు పదిలంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications
