Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఫ్రిజ్ కొంటేనే సరిపోదు వాటి విలువలూ తెలుసుకోండి

1. డీప్ ఫ్రిజ్ లో ఐస్ గడ్డలు పేరుకు పోయినట్లయితే ధర్మోస్టాట్ కంట్రోలర్ మధ్యలోని నాబ్ నొక్కితే.. కరిగి పోతుంది.
2. కరెంటు హెచ్చుతగ్గుల బారి నుండి ఫ్రిజ్ ని కాపాడుకోవాలంటే.. తప్పనిసరిగా 'స్టెబిలైజర్ 'ను వాడాలి.
3. వేడిగా వుండే పదార్ధాలను ప్రిజ్ లో వుంచరాదు. ఎక్కువ కాలం ఫ్రిజ్ లో పెరుగు వుంచడం మంచిది కాదు.
4. వీలయినంత వరకు ఫ్రిజ్ ని వంటగదిలో వుంచరాదు. సహజంగా వంట గదిలో ఎక్కువ ఉష్ణోగ్రత వుంటుంది కాబట్టి.. ఫ్రిజ్ లోని వస్తువులు త్వరగా చల్లబడవు.
5. స్టవ్ లకు , హీటర్ లకు దూరంగా వుంచాలి. లేకుంటే...వాటి వేడి ప్రభావము ఫ్రిజ్ పై పడుతుంది.
6. గరుగ్గా వుండే గుడ్డతో ఫ్రిజ్ ని తుడవరాదు. చారలు పడే అవకాశం వుంది.
7. వస్తువుల కోసం ఫ్రిజ్ ని ఎక్కువ సేపు తెరిసివుంచినట్లయితే... బయటి వాతావరణం వలన అందులోని చల్లదనం తగ్గిపోతుంది. విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ఫ్రిజ్ ని వాడుకోవటమే కాదు అందులో పదార్ధాలను కూడ ఎలా పడితే అలా వుంచుకుంటే.. అవి తినడానికి బాగుండవు.
8. కూరగాయలు, ఆకు కూరలను శుభ్రం చేసి పాలిథిన్ సంచుల్లో వుంచాలి.
9. సువాసనలు వెదజల్లే పూవులను ఫ్రిజ్ వుంచకూడదు. వాటి వాసనలు ఆహార పదార్ధాలకు సోకే వీలుంది.
10. బాగా మగ్గిన ఫ్రూట్స్ ని పెట్టినా వాటి వాసన మిగతా ఆహార పదర్ధాల పై పడుతుంది. వాటిని ముక్కలుగా కోసి గిన్నెల్లో పెట్టి మూసి వేస్తే మంచిది.



Click it and Unblock the Notifications