Latest Updates
-
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి!
టీనేజర్స్ కి ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తే....!
ప్రస్తుతం మారుతున్న జీవన విధానానికి అనుగుణంగా పలువురు తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళకు ఉత్సాహాన్నిస్తుంది. స్వచ్ఛమైన గాలి, వెలుతురు ప్రసరించే దిశగా పిల్లలు గదుల్ని ఏర్పాటు చేస్తే వాళ్ళల్లో చురుకుదనం పెరుగుతుంది. ఆ గదికి లేత గదిలో రంగుకు తగ్గ కర్టెన్లు ఉంటే మరింత ఆకర్షణీ యంగా ఉంటుంది. టీనేజ్ పిల్లలు నిత్యం వాడే ప్రతి వస్తువుకు వాళ్ళకు కేటాయించిన గదిలో సరైన స్థానంలో అమర్చుకొనేలా చూడాలి.

ఈ కాలంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్ అని తేడా లేకుండా పిల్లలు చదువు పెరిగే కొద్దీ పుస్తకాలూ పెరుగుతాయి. వాటిని పెట్టుకునేందుకు అవసరమైనపుడు అందుబాటులో ఉండేందుకు పుస్తకాల రేక్ ఉంటే పిల్లలకు సౌకర్యంగా ఉంటుంది. గదిలో నిర్లక్ష్యంగా పుస్తకాలను గిరాటు చేసే అలవాటు మాన్పించవచ్చు. చదివే సబ్జెక్ట్స్ కి సంబంధించిన పుస్తకాలే కాక, రిలాక్స్ కోసం మంచి సాహిత్యం, మెదడుకు పదును పెట్టే పజిల్స్‌కు సంబంధించిన పుస్తకాలు కూడా ఉంచాలి.
టేబుల్ రాక్స్ - పెన్ స్టాండ్స్- టేబుల్ ల్యాంప్స్: వివిధ సైజుల్లో ఉన్న రేక్స్ కలిగిన స్టడీ టేబుల్ ఉండే పెన్స్, పెన్సిల్స్, స్కెచ్ పెన్స్, క్రెయాన్స్, స్కేల్, షార్పనర్, ఎరేజర్, జామెట్రిబాక్స్, క్యాలికులేటర్, అలారం చిన్న సైజు కత్తెర ఇలా అన్ని అందుబాటులో ఉండే విధంగా అమర్చుకోవవచ్చు. స్డడీ టేబుల్ పుట్‌రెస్ట్ తప్పనిసరిగా ఉండేట్లు చూసుకోవాలి. ఇక స్డడీ ల్యాంప్ ఉంటే పిల్లలకు చదువుకునేందుకు అనువుగా ఉంటుంది. తమ నీడ, చదివే పుస్తకాలకపూ పడని విధంగా రూమ్ లో లైటింగ్ ఏర్పాటు చేయాలి. స్కూల్ లేదా కాలేజీ టైం టేబుల్ స్పష్టంగా కన్పించేలా ఒక్కో సబ్జెక్ట్ కు ఒక్కో రంగును కేటాయించి తయారు చేసి స్టడీ టేబుల్ పైభాగంలో సెల్లో టేప్ తో అతికిస్తే ఆకర్షణీయంగా ఉండి కాలేజీకి తీసుకెళ్ళాల్సిన పుస్తకాలు మిస్ కాకుండా ఉంటాయి.
బుక్ రేక్స్ అందుకు కావలసిన ప్రదేశం: స్టడీ టేబుల్ కింద్ర ఓ వైపు డస్ట్ బిన్ తప్పనిసరిగా ఉంచాలి. కాలేజీకి వెళ్ళేటప్పుడు మెసుకేళ్ళే పుస్తకాలు బరువు వల్ల, చదవడానికి ఎక్కువసేపు కూర్చోవడటం వల్ల పిల్లకు నడుము నొప్పి రాచవ్చు. దీన్ని నివారించేందుకు బ్యాక్ రెస్ట్ కలిగివుండి, మంచినాణ్యత ఉన్న స్టడీ కుర్చీని ఎంపిక చేయాలి. టీనేజ్ పిల్లలు గదిలో విశ్రమించడానికి చక్కటి పరుపు అవసరం. పరుపు మొత్తగా కాక. కాయిర్‌తో తయారు చేసిన పరుపును అమరిస్తే మంచిది. దీనివల్ల పిల్లలకు నడుమునొప్పి రాకుండా జాగ్రత్త పడవచ్చు. పుస్తకాల బ్యాగ్ పాడవకుండా దాన్ని పెట్టుకునేందుకు సరైన చోటును సూచించాలి. వారానికి ఒకసారి తప్పని సరిగా పుస్తకాల బ్యాగ్ ను శుభ్రపరచాలి.
ఇక షూస్, స్పోర్ట్స్ షూస్, సాక్స్, సాండిల్స్, స్లిప్పర్స్ పెట్టుకునేందుకు మిని షూ రేక్ గదిలో ఓ వైపున ఉంచాలి. ఆధునిక జీవనశైలి పరంగా చూస్తే నేటి టీనేజ్ పిల్లలకు ఓ ప్రత్యేకమైన గది అందులో వీటి ఏర్పాట్లు అవసరాలే కానీ విలాసాలు కావు. ప్రత్యేక గదిని తమ హక్కుగా భావించి సొంతం చేసుకుంటున్న టీనేజ్ పిల్లలు దాన్నిశుభ్రంగా ఉంచుకోవడంపై కూడా శ్రద్ధ వహించాలి. అప్పుడు చదువుకునేందుకు అవసరమైన ప్రశాంత వాతావరణం ఆ గదిలో ఏర్పడుతుంది.
స్టడీ రూమ్‌లో ముఖాన్ని చూసే అద్దాలు, అక్వారియం వంటి వాటిని పెట్టకూడదు. దీని ద్వారా మనసు వాటిపైకి మళ్లి ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే ఈ గదిలో సూర్యకాంతి నేరుగా వచ్చి పడేలాగా ఉండకూడదు. ఎందుకంటే అధికంగా సూర్యకాంతి రావడం వల్ల కూడా మనసు ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం ఉంది. దీనితో పాటు మదిలో చికాకులు ఏర్పడతాయి. చదువుకోవడానికి సరిపడినంత కాంతి ఉండేలా చూసుకోవాలి.



Click it and Unblock the Notifications