For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోదా...హుందాతనం పెంచే అలంకరణ....

|

Interior Decoration will give more Values
ప్రస్తుతం ఇంటీరియర్ డెకరేషన్ అనే మాట బాగా ఫేమస్ అయింది. గతంలో ఇంటీరియర్ గురించి పెద్దగా శ్రద్ద పెట్టని వారు కూడా ఇప్పు వాటిపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఇంటిని సాంకేతికపరంగా అన్ని వసతులతో నిర్మించుకుంటున్నారు. దానికి తోడు ప్రస్తుతం మార్కెట్లో కొత్తకొత్త సాంకేతిక వస్తువులు... సకల సదుపాయాలు సమకూర్చే పరికరాలు ప్రత్యక్షమవుతున్నాయి. ఒక్కొక్కటి చూస్తుంటే అన్నీ ముఖ్యమైన అత్యవసరాలుగానే కనిపిస్తాయి.

ఇంటి అలంకరణ హోదాని పెంచేందుకు, హుందాగా జీవించేందుకు అవి తప్పనిసరే అనిపిస్తాయి. మరి అలా అని అక్కరకు లేని వస్తువులన్ని తెచ్చేసుకుంటే పరిమితమైన స్థలంలో వాటిని సర్ధుకోవటం పెద్ద సమస్యగా మారుతుంది. పట్టణాలు, నగరాల్లో తరచూ అద్దె ఇల్లు మారే వారికి ఇది పెద్ద సమస్యగా మారుతుంది. ఒక కుటుంబ సభ్యులందరూ కలసి మెలసి ఉంటే ఇంట్లో ఎంత ప్రశాంతత ఉంటుందో వస్తువులన్నీ ఆయా స్థలం కొలువుతీరితే ఇంటికి వచ్చే ఆ అందమే వేరు. ఆనందమే వేరు.

ఇంటిని పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దుకుంటే గౌరవం, మంచి హోదా లభిస్తుంది. వారివారి స్థాయిల్ని బట్టి ఇంటిని అలంకరించుకోవచ్చు. ఇంటిని చూసి, ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు. ఇంటిని ఎంత చక్కగా దిద్దుకుంటే అంతపేరు ప్రతిష్ఠలు వస్తాయి. అందుకే ఇంటిపై ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ఇంటిని శుభ్రంగా పెట్టుకోక పోతే చాలామందికి చిరాకు. సామాన్లతో ఇంట్లోని గదులన్నిటినీ నింపేస్తే చాలా చికాకుగా కనిపిస్తుంది. గదిలో ముప్పావు భాగం లేదా సగభాగమైనా ఖాళీగా వదిలేస్తే చూడటానికి విశాలంగా కనిపిస్తుంది. గదులన్నీ సామాన్లతో నింపేస్తే ఎంత విశాలమైన ఇల్లైనా చిన్నగానే కనిపిస్తుంది.

ఒక గదికి ద్వారాలు ఎక్కువగా ఉన్నప్పుడు వస్తువుల అమరిక కష్టం. ఉదా: లివింగ్ కం డైనింగ్ రూంకు ప్రధాన ద్వారం కాకుండా మరోనాలుగు ద్వారాలు అదనంగా ఉన్నప్పుడు అంటే బెడ్ రూంలు, టాయ్‌ లెట్, కిచెన్ ద్వారాలుంటే సోఫాలు, కుర్చీలు, డైనింగ్ టేబుల్ అమర్చడం కష్టంగానే ఉంటుంది. ఇవి తప్పనిసరిగా అమర్చవలసినవి కాబట్టి గదుల్లో స్థలం ఉన్నప్పటికీ అది ఒక గదిలో నుండి ఇంకో గదిలోకి వెళ్లడానికి దారిగా మాత్రమే ఉపయోగపడుతుంది. ఇలాంటి గదులు ఉన్నవారు స్థలం ఎక్కువగా ఆక్రమించే సోఫాలు గట్రా వాడకపోవడం మంచిది.

ఇంట్లో గదుల గురించే కాకుండా ఇంటి ముందు వుండే ప్రదేశంలో, ఇంటి వెనుక పెంచే మొక్కలు, ఊయలకు గురించి కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. ఇంటి వరండాలోనూ, ఇంటిముందువున్న ఖాళీ ప్రదేశంలోనూ పెంపుడు జంతువుల కొరకు కేజ్‌ లు ఏర్పాటుచేసుకోవాలి. వాటిలో రంగు రంగుల పక్షులు, చిలకలు, లవ్‌బర్డ్స్, మైనాలు వంటివి తెచ్చి పెట్టుకొంటే మరింత ఆకర్షణఅందం. కుక్కలు, కుందేలులాంటి జంతువులు కూడా ఇంటి అందాన్ని పెంచుతాయి. మీ ఇల్లు ప్రశాంత నిలయంగా ఉండేలా తీర్చిదిద్దడానికి ఇంట్లోని ప్రతి గది కొలతలు మీకు క్షుణ్ణంగా తెలిసివుండాలి. అప్పుడే ఇంటి అలంకరణ విషయంలో స్పష్టమయిన అవగాహన కలిగివుంటారు.

English summary

Interior Decoration will give more Values... | హోదా...హుందాతనం పెంచే అలంకరణ....

Creating more space and getting rid of clutter will immediately give your home a new look.
Story first published:Tuesday, March 20, 2012, 8:56 [IST]
Desktop Bottom Promotion