Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇంటి అలంకరణ..ఇంటీరియర్ డెకరేషన్ లోనే దాగుంది....!

ముందుగా ఇంటి అలంకరణలో ఇంటీరియర్ ను ఎలా ప్లాన్ చేసుకున్నా సరే ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా ప్రవేశించేలా చూసుకోవాలి. కిటికీలు, వెంటిలేటర్స్ ను కప్పేసేవిధంగా ఎలాంటి డిజైన్ చేసుకోకూడదు. ఇంటి అలకంరణలో తెచ్చుకొనే వస్తువుల ఎంపిక చేసుకునే డిజైన్లలో అవసరమైనవి వాటిని మాత్రమే నాణ్యతతోపాటు, మీకు తగిని బడ్జెట్ కు లోబడి తెచ్చుకుంటే సరిపోతుంది.
ఇంటీరియర్ డెకరేషన్ లో వెదురు కూడా అందంగా కనిపిస్తుంది. ఇదివరకు వెదురును కేవలం హస్తకళా రూపాల తయారీలో మాత్రమే ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం ఇంటీరియర్ డెకొరేషన్ కోసం, కిటికీలకు బ్లెండ్స్ సైతం వెదురుతో తయారైనవి ప్రస్తుతం మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. అయితే వెదురు ఇంటిరీయర్ ఉపయోగించడం జాగ్రత్తలు పాటించినట్లైతే చాలా రోజులు మన్నికగా వస్తాయి..
ధరలో కూడా మిగతావాటితో పోల్చిచే వెదరు ధర చాలా తక్కువే. వెదురు వాడకం వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. వెదురుతో తయారు చేసిన ఎటువంటి వస్తువునైనా వినియోగించడం చాలా తేలిక. తరచూ తడివస్త్రంతో తుడిచేస్తే చాలు, దుమ్ము, ధూళి పోతాయి. ఆర్నెల్లకోసారి వార్నిష్ వేస్తే ఎప్పుడూ కొత్తవాటిలా మెరుస్తుంటాయి. ఏ వస్తువైనా పాడైపోయినా అందులో బాగా ఉన్నభాగాన్ని తీసి మరో వస్తువుగా తయారు చేయించుకోవచ్చు.
వెదురుతో ప్లోరింగ్ చేయిస్తే మెత్తటి పాతవస్త్రాన్ని తడిపి గట్టిగా పిండి దాంతో తుడవాలి. మరి నీరు కారకుండా చూసుకుంటే చాలు. లామినేషన్ చేసి ఉంటుంది కాబట్టి త్వరగా గీతలు పడడం, పాడవడం జరగదు. వెదురుతో తయారైన బ్లెండ్స్ పొడి వస్త్రంతో దులపాలి. వ్యాక్యూమ్ క్లీనర్ తోనూ శుభ్రం చేయవచ్చు. మరీ దుమ్ముగా ఉన్నాయనిపితస్తే తీసి ఒకసారి నీళ్లపంపు కింద పెట్టి కడిగేసినా పర్వాలేదు.
వెదురు ఫర్నీచర్ విషయంలో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే..తరచుగా వాటి మేకులు బయటకు వస్తుంటాయి. వాటిని లోపలికి కొడుతుండాలి. వాడగా వాడగా ఫర్నీచర్ కాళ్ల దగ్గర వెదురు చీలిపోయి పాడైపోతుంది. దాన్ని ప్లాస్టిక్ టేపుతో గట్టిగా బిగిస్తే చూడడానికి నీట్ గా ఉంటాయి. ఎక్కువ కాలం మన్నుతాయి.



Click it and Unblock the Notifications