Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇంటి హుందాతనానికి అద్భుతమైన లైటింగ్...!

ఒకే విధమైన రంగు లైట్లతో మీకు బోర్ కొడుతుంది ఇంద్రధనస్సులోని రంగులను మీ ఇంట్లోనే చూసెయ్యూలని ఉందా? మీకు నచ్చే కలర్ ను మీ చేతిలోని రిమోట్‌తో వూర్చుకోవాలనుకుంటున్నారా? ఇలాంటివన్నీ ప్రస్తుత కాలం సాధ్యమౌతున్నాయి. మార్కెట్లో కావలసిన ఆకారాల్లో.. కావలసిన రంగుల్లో.. కావల్సిన సైజుల్లో.. పద్దత్తులో దొరుకుతున్నాయి. అందుకు తగ్గ విధంగానే ప్రాధాన్యం కూడా పెరుగుతోంది. ఇప్పుడు చాలామంది లైటింగ్ ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు. ఇంట్లో లైటింగ్ అందంగా ఉండటంతో పాటు ఇంటీరియర్స్‌కూ చక్కగా అమరిపోవాలనుకుంటున్నారు.
మెరుగైన లైటింగ్ కోసం వేల రూపాయలు వెచ్చించాల్సిన పనిలేదు. కావాల్సిందల్లా కాస్తంత సృజనాత్మకత. ఒకప్పుడు ఆధునిక లైటింగ్ వ్యవస్థను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడా అవసరం లేదు. అద్భుతమైన డిజైన్లలలో మనుకు మార్కెట్టో అందుబాటులో ఉన్నాయి. లైటింగ్ అన్నది వెలుతురు కోసమే అనే రోజులుపోయాయి. ఇది కూడా గృహాంకరణలోభాగమైపోయింది. ముఖ్యంగా షాండ్లియర్, ఫ్లోర్, వాల్, సీలింగ్ ల్యాంప్‌లు ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి. ఇంటి వాతావరణం... ఇంటీరియుర్స్... మన మనసుపై ప్రభావం చూపుతాయి. ఆహ్లాదకరమైన అనుభూతినందించే రంగులు కావాలంటే అనువైన లైటింగ్ తప్పనిసరి.
రూమ్‌ను బట్టి లైటింగ్: వేలల్లో... లక్షల్లో ఖర్చు చేసి నిర్మించుకున్న ఇంటికి లైటింగ్ సరిగా లేకుంటే.. అది కళావిహీనంగా ఉంటుంది. ఇంట్లోని ప్రతి గదికీ ఓప్రాధాన్యముంటుంది. దానికి తగ్గట్టే లైటింగ్ ఉండాలి. హాల్‌లో అయితే 175 - 190 లుమాక్స్ వెలుతురు సరిపోతుంది. బెడ్‌రూమ్‌లో 160 లుమాక్స్ కావాల్సి వస్తే... కిచెన్‌రూమ్‌కు 225 లుమాక్స్ వెలుతురు అవసరవువుతుంది. వయస్సును బట్టి కూడా వెలుతురు పరిణామం మారుతుంటుంది. 50-60 సంవత్సరాల వయసున్న వాళ్లు ఉండే గదిలో కనీసం 250 లుమాక్స్ వెలుతురుండాలి. పిల్లల గదికైతే 175-200 లుమాక్స్ ఉండాలి.
షాండ్లియర్స్ హోదాయే వేరు: నిజాంల కాలం నుంచీ షాండ్లియర్స్‌కు నగరంలో డిమాండ్ అధికంగా ఉంది. ఇప్పటికీ తమ ఇంట్లో అందమైన షాండ్లియర్ ఉండాలనుకునే వాళ్లు ఎంతోమంది ఉన్నారు. రూమ్ పరిధి, సీలింగ్ హైట్‌ను బట్టే షాండ్లియర్‌ను ఎంచుకోవాలి. షాండ్లియర్‌ను గది మధ్యలో పెట్టుకోవడం ఫెంగ్‌షుయి ప్రకారం ఎంతో మంచిది. ఇది వురింత పాజిటివ్ లైట్‌ను అందిస్తుంది. స్వరోస్కీ కంపెనీ డైమండ్స్‌తో రూపొందించిన షాండ్లియర్స్‌తో పాటు.. ప్లాస్టిక్, లెడ్ ఆక్సైడ్ క్రిస్టల్, పోర్సిలిన్, లెడ్ ఫ్రీ క్రిస్టల్‌తో తయారైనవి కూడా మార్కెట్లో లభిస్తున్నాయి.
వివిధ రంగుల విద్యుత్ దీపాలతో గది ఆకర్షణీయ గా తయారవుతుంది. బెడ్ రూం, స్టడీ రూంల లో కూడా డ్రాప్ లైట్‌లను వినియోగించుకోవచ్చు.చదువుకునేందుకు చాలా అనువుగా ఉంటుంది. కిచెన్‌లలో మనకు నచ్చిన విద్యుత్ బల్బులు వాడు కోవచ్చు. అయితే లైటింగ్ సిస్టమ్ లో రంగులు ప్ర ముఖ పాత్ర వహిస్తాయి. ముదురురంగు ఫర్నిచర్ తేలి కపాటి రంగులు గల గోడలపై లైటింగ్ ప్రస రిస్తే ఆ గదిదేదిప్యమానంగా వెలిగిపోతుంది. గదిలో ఉన్న గోడల రంగు ప్రముఖ పాత్ర వహిస్తాయి. గోడపై వాల్‌పేప ర్ లేదా మెటాలిక్ పెయింట్ వాడినా ఆ ప్రాంతంలో డెకోరెటివ్ వాల్ లైట్‌ను వాడితే ఆ గదికి మరింత శోభనిస్తుంది.



Click it and Unblock the Notifications