For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్న ఇల్లు పెద్దగా... విశాలంగా కనబడాలంటే...?

|

చిన్న ఇల్లును మన అభిరుచికి తగ్గట్టు అలంకరించుకోవడం అనేది చాలా కష్టమైన పనే. ముఖ్యంగా చిన్న ఇంట్లో మనకు కావాల్సినవి, అవసరమైనవన్నీ అలంకరించుకోవడానికి, జోడించడానికి, చిన్న ఇల్లును విశాలంగా చూపించడానికి కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ఎటువంటి ఇల్లైనా సరే చూడటానికి విశాలంగా ఉండాలంటే ఆ ఇంటిని పరిశుభ్రంగా క్లీన్ గా పెట్టుకోవడంతోనే ఆ ప్రదేశం విశాలంగా కనిపిస్తుంది. చిన్న ఇంట్లో స్థలం లేదా ప్రదేశాన్ని ఆదా(సేవ్) చేయడానికి మల్టీ యుటిలిటీ(బహు విధాలుగా )ఉపయోగపడేటటువంటి ఫర్నీచర్ ను ఉపయోగించవచ్చు. చిన్న ఇంటిని విశాలంగా.. పెద్దగా చూపించడానికి కొన్ని ట్రిక్స్ మీరు తెలుసుకోవాలి. అప్పుడే మీరు మీ చిన్న ఇల్లును అతి విశాలంగా కనిపించే విధంగా తీర్చి దిద్దుతారు. అదెలాగో చూద్దాం...

Make A Small Home Look Spacious...!

గోడ చివరగా ఫర్నిచర్ ను అమర్చుకోవడం: గోడకు దగ్గరగా లేదా గోడ చివరగా ఫర్నీచర్ ను అమర్చుకోవడం వల్ల ఆ గది విశాలంగా కనిపిస్తుంది. అలా చేయడం వల్ల మద్యలో ఎక్కువ ఖాళీ ప్రదేశం ఉన్నట్లు కనిపిస్తుంది. దాంతో మీరు నడవడానికి అటు ఇటు తిరగడానికి ఫ్రీగా ఉండటమే కాకుండా విశాలంగా కనిపిస్తుంది. కాబట్టి ఫర్నీచర్ ను ఒక ప్రక్కగా అమర్చుకోవడం గదిలో ఎక్కువ స్థలం సేవ్ చేసినట్లు అవుతుంది.

మీ ఇంటి గోడలకు వేసిన రంగు-ఫర్నీచర్ కలర్ సూట్ అయ్యే విధంగా ఉండాలి. కాబట్టి మీరు ఒక చిన్న ఇంటినిక అలంకరించడానికి ఒక టోన్ ఉపయోగిస్తే అప్పుడు ఆ ఇల్లు సహజంగా పెద్దగా కనబడేలా చేస్తుంది. అందుకోసం గోడకు ఉన్నటు వంటి రంగే ఖచ్చితంగా ఫర్నీచర్ కు ఉండాలనుకోకూడదు. కొంచెం ఇంచుమించు అదే షేడ్ లో కనిపించినా సరిపోతుంది. గోడలకు ముదురు రంగులు వేసుకొన్నప్పుడు, ఫర్నీచర్ కు లైట్ ముదురు రంగులు బాగా నప్పుతాయి. కాబట్టి మీ ఇంటి రంగు ను బట్టి ఫర్నీచర్ ను కూడా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

ఎక్కువ భాగం అద్దాలతో అలంకరించండి: ఇంట్లో ఒక చక్కటి భ్రాంతిని కలిగించడానికి ఒక సులభమైయినటు వంటి మార్గం అద్దాలు అలంకరించడం. అద్దాలను ఎక్కడ అమర్చుకొంటే బాగుంటుందో చూసుకొని మీర అమర్చుకోవాలి. గదిలో ఒక ప్రక్క అద్దంను అమర్చడం ద్వారా ఆ గది అంతా ప్రకాశవంతంగా కనబడేలా చేస్తుంది. గోడలకు రెండు అద్దాలను ఎదుబదురుగా ఉంచడం వల్ల ఆ గదిలోని అనే చిత్రాలను ప్రతిబింబిచేలా చేస్తుంది. ఇలా చేయడం వల్ల కొంత వింతగా కూడా అనిపించవచ్చు.

తక్కువ ఫర్నీచర్ ను ఉపయోగించుకోవాలి: పెద్ద పెద్ద ఫర్నీచర్ ను ఉపయోగించడం వల్ల అది గదిలోని మొత్తం ప్రదేశాన్ని ఆక్రమించి ఆ గదిని చాలా చిన్నదిగా చూపిస్తుంది. కాబట్టి సైజులోనూ, ఖర్చులోనూ తక్కువగా ఉన్నటువంటి ఫర్నీచర్ ను అమర్చుకోవడం ఉత్తమమైన పద్దతి. ముఖ్యంగా ఫర్నీచర్ ఆ ఇంటి అవసారినికి మించి ఉండకుండా చూసుకోవాలి. అప్పుడు అవి చక్కగా ఆ ఇంట్లో అమరుతాయి.

సాధ్యమైనంత వరకూ గ్లాస్ టాప్స్ ను ఉపయోగించడం మంచిది. ముఖ్యంగా ఇంట్లో వినియోగించే సెంట్రల్ టేబుల్ డైనిగ్ టేబుల్స్ కి గ్లాస్ టాప్స్ ను ఉపయోగించడం వల్ల శుభ్ర పరచడానికి సులభం. అదేవిధంగా గ్లాస్ టాప్ అమర్చుకోవడం వల్ల గ్లాస్ ప్రతి బింబం ఇంట్లో వెలుగులు నింపుతుంది. గ్లాస్ టాప్స్ ఉన్న ఫర్నీచర్ ను వినియోగిచడం వల్ల గదిలో ఎక్కువ స్థలంను ఆదా చేసుకోవచ్చు. ఎందుకంటే ఉడ్ లేదా ఐరెన్ తో తయారు చేసిన ఫర్నీచర్ ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తుంది.

ఫ్లోర్ లైటింగ్: ఇంట్లో ఎంత వెలుగులు నింపితే అంతే స్థలం ఆదా అయినట్లు కనబడుతుంది. కాబట్టి ఇంటి నిండా వెలుగులు నింపడానికి మార్గాలు చూసుకోండి. ఎక్కువగా లైట్స్ ను ఎత్తులో అమర్చుకోవడం కంటే గదిలో ఒక మూల క్రింద వివిధ డిజైన్లలో దొరికే లైట్లను అమర్చుకోవడం మంచిది. అందులో ల్యాంప్ లైట్స్ లేదా టేబుల్ ల్యాంప్స్ లేదా ప్లోర్ ఫిక్సింగ్ లైట్స్ బయట మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇలా అమర్చుకోవడం వల్ల ఆ గదంతా విశాలంగా కనబడేటట్లు చేస్తుంది. ఈ చిన్న సూచనలు తీసుకొన్నట్లైతే మీరున్న చిన్న ఇంటిని కూడా పెద్దగా, విశాలంగా కనబడేటట్లు చేయవచ్చు.

English summary

Make A Small Home Look Spacious...! | చిన్న ఇల్లు అయినా విశాలమే....!

It a huge challenge to decorate a small home tastefully. And adding to that, it is all the more difficult to make your small home appear spacious. One of the basic tip of making your home look bigger us by keeping it neat and tidy. To conserve space, you can also use multi-utillity furniture. However to make a bigger difference, you need to learn few tricks to decorate your small home that will make it appear larger.
Story first published: Wednesday, July 11, 2012, 13:17 [IST]
Desktop Bottom Promotion