For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్నానాలగది చిన్నదైతేనేం...సౌకర్యంగా ఉంచుకోండిలా

|

Make your Small Bathroom more comfortable
సాధారణంగా మహిళలలు ఇంట్లో అన్ని గదులపై శ్రద్ధ తీసుకొని ఒకేలా అలంకరించడం ఆనవాయితీ. కానీ స్నానాల గదిని మాత్రం పక్కన నెట్టేస్తారు. కొంచెం ఆ గదిపై కూడా శ్రద్ధ పెడితే మీ స్నానాల గది అందంగా..సౌకర్య వంతంగా ఉంటుంది.

1. కొందరు స్నానాల గదిని పెద్దగా ఏర్పాటు చేసుకుంటారు. మరికొంతమంది చిన్నగానే సౌకర్యవంతంగా ఉంటుందనుకుంటారు. అయితే చిన్నగా ఉంటే గదిలో తెల్లని లైట్లు పెట్టుకోవాలి.
2. గది చిన్నగా ఉన్నప్పుడు వాష్ బేసిన్లు, షెల్ఫ్‌ లు తక్కువగా ఏర్పాటు చేసుకోవాలి.
3. చిన్న స్నానాల గదిలో వస్తువులను ఎక్కడపడితే అక్కడ అలాగే వదిలివేయకూడదు. అలా వదిలివేస్తే గది ఇరుకుగా కనిపిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆయా వస్తువులను అక్కడి నుండి తీసివేయటమే గాకుండా.. అక్కడ తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువులను నీట్‌ గా సర్దుకుంటే, చిన్నదైనా సౌకర్యంగా ఉంటుంది..
4. స్నానాల గదిలో పెద్ద అద్దం అమర్చుకొన్నట్లైతే గది విశాలంగా కనిపిస్తుంది.
5. బాత్ రూంలో ఆక్రిలిక్ షీట్‌ లతో గది మూలాల్లో అరలు నిర్మించండి. ఇవి సబ్బులు, ఇతర సామాగ్రి పెట్టుకోవడానికి అనువుగా ఉంటాయి.
6. షవర్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఆక్రిలిక్ షీట్ లేదా అద్దంతో గదిని పార్టీషన్ చేయండి. దీనివల్ల స్థలం వృథా కాదు.
7. చిన్నగా ఉండేటటువంటి స్నానాల గదులకు ఎట్టిపరిస్థితుల్లోనూ ముదురు రంగులను వాడటం కంటే లేత రంగులను వేయించడం వల్ల కూడా గది విశాలంగా కనిపిస్తుంది.
8. స్నానాల గదిలో మంచి సినరీలు, ఆర్టిఫీషియల్ మొక్కలను పెడితే గది మరింత అందంగా ఆకుపచ్చని కాంతితో మెరుస్తుంది. ప్రకృతికి సంబంధించిన కర్టెన్లు వేస్తే స్నానాల గది మరింత అందంగా కనిపిస్తుంది.

English summary

Make your Small Bathroom more comfortable...! | స్నానాలగది చిన్నదైతేనేం...సౌకర్యంగా ఉంచుకోండిలా

The design of your bathroom dictates its overall mood and energy. Tiled walls give it a clean, modern look, while certain colors and stylish accents can make it more inviting.
Story first published:Thursday, January 26, 2012, 13:08 [IST]
Desktop Bottom Promotion