Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మాస్టర్ బెడ్ రూం ఎలా ఉండాలి...?

ముందుగా బెడ్ రూంలో అనవసరంగా పేరుకు పోయిన పాత పుస్తకాలు, చెప్పులు, ఉపయోగపడని ఇతర సామాగ్రిని తొలగించాలి. పాతబట్టలు, మాసిన బట్టలు బెడ్ మీద బెడ్ క్రింద వేయకుండా, బెడ్ రూంను, స్టోర్ రూం చేయకూడదు. పడక గదిలో సాధ్యమైనంత వరకు తక్కువ వస్తువులతో, ఖాళీ స్థలం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ ఏవేని వస్తువులు ఉన్నా, వాటిని చిందరవందరగా పడవేయకుండా, గదికి శోభనిచ్చేలా సర్దుకుంటే సరిపోతుంది. రెండు మంచాల స్థానంలో ఒకే డబుల్‌కాట్ మంచంతో స్థలం కలసివస్తుంది. అదికూడా ఈ మంచాన్ని ఓ మూలకు విసిరేసినట్లుగా కాకుండా, గదిలో మధ్యలో ఉండేలా వేయాలి. మూడువైపుల నుంచీ.. అటూ, ఇటూ తిరిగేందుకు వీలుగా ఉండేలా చూసుకోవాలి.
బెడ్‌రూంలోకి అడుగుపెట్టగానే ప్రభావితం చేసేవి బెడ్‌షీట్లు. పిల్లో కవర్స్, వీటిని కాటన్‌లో ఎంపిక చేసుకుంటే అందంగా ఉండటంతో పాటు నిర్వహణ సులభం. చిన్న గదుల్లో డిజైన్ రూపంలో ఉన్న వాటిని ఎంపిక చేసుకోవచ్చు. సిల్క్ వస్త్రాలు కూడా బాగానే నప్పుతాయి. గదిలో ఎంత స్థలం ఉన్నా ఫర్నిచర్ ఆక్రమించేస్తుంది కాబట్టి, మరీ తప్పనిసరి అయితే ఫర్నీచర్‌ను బెడ్‌రూం ఉంచకపోవడం ఉత్తమం. ఒకవేళ తప్పనిసరి అనుకుంటే, గోడవారగా ఏర్పాటు చేయటం మంచిది.
సహజ సిద్ధమైన వెలుతురు గదిలో ప్రసరించేలా జాగ్రత్త పడితే... ఎంత చిన్న గదైనా విశాలంగా కనిపిస్తుంది. ఇలా కనిపించేలా చేసేవి కిటికీలు కాబట్టి, సాధ్యమైనంతవరకూ వీటిని తెరిచే ఉంచాలి, కర్టెన్లు కిటికీకంటే కిందగా ఉండేలా చూడాలి. అవి కూడా లేత రంగుల్లో ఉంటే, గది మరింత విశాలంగా కనిపిస్తుంది.
ఇక చివరగా... బెడ్‌రూమ్‌లో లైటింగ్ కూడా కీలకమైనదే. సాప్ట్ అండ్ జెంటిల్ లైట్లనే ఎంపిక చేసుకోవాలి. కీలకమైన ఒకటి రెండుచోట్ల డిమ్మర్లు ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది.



Click it and Unblock the Notifications