For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ్ళు జిగేల్ మనిపించే మోడ్రన్ రెడిమేడ్ కిచెన్...!

|

ఇల్లు చిన్నదా పెద్దదా అని కాదు... ఇంటిని సకల సదుపాయాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవచ్చునని నిరూపిస్తోంది ఈ జనరేషన ఫర్నీచర్. ఇల్లు ఎంత పెద్దగా ఉందన్నది సమస్య కాదు ఎంత జాగ్రత్తగా తీర్చిదిద్దుకున్నారన్నదే పాయింట్. అభిరుచి ఇల్లు అందంగా ఉంచుకోవాలనే అభిలాష, అందుకు తగినంత ఓపికలేని వారికి గోల్కొండ కోటంత ఇల్లు ఇచ్చినా ఉపయోగంలేదు. తక్కువ చోటులో ఇంద్రవైభవాన్ని ఆవిష్కరించి ఇంటిని దేవేంద్ర భవనంలా ఎలా రూపొందించుకోవచ్చో చూద్దాం.

Modular Kitchen Tips for Your Home...!

ముఖ్యంగా చాలా మంది ఇట్లో అన్ని గదులకంటే లివింగ్ రూం, బెడ్ రూం లను, చాలా అందంగా అలంకరిస్తారు. వంట గదిని కూడా కొంచెం మోడ్రన్ గా అలంకరించుకొంటే ఎలాఉంటుందో చూద్దాం...వంటగదిని అందంగా అమర్చుకోవాలనే కోరిక ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది. రంగు రంగుల డిజైన్లు ఉన్న క్యాబినెట్స్‌, గ్రానైట్‌ టాప్‌, గ్లాస్‌ హబ్‌, బాస్కెట్స్‌, గ్లాస్‌ చిమ్నీ.. ఇలా ప్రతీ వస్తువు ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటున్నారు. తక్కువ స్థలంలోనే కిచెన్‌ను అందంగా తీర్చిదిద్దుకోవాలనే తపన ఎక్కువైంది. ఆ క్రమంలో రెడీమేడ్ కిచెన్ లు ఆదరణ పొందుతున్నాయి.

ఇంట్లో అందరికీ ఇష్టమైన ప్రదేశం వంటగది. ముఖ్యం గా మహిళలు ఎక్కువ సమయం కిచెన్‌లోనే గడుపు తుంటారు. ఇప్పుడున్న బిజీ జీవనంలో కుటుంబ సభ్యులంద రూ కలిసేది కిచెన్‌ దగ్గరే అనడంలో సందేహం లేదు. అందుకే వంటగదిని ఆకర్షణీయంగా, సౌకర్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం అయ్యే ఖర్చు గురించి పెద్దగా ఆలోచించడం లేదు.సంప్రదాయ కిచెన్‌ల స్థానంలో మోడ్రన్‌ కిచెన్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. హై-ఎండ్‌ అపార్టుమెంటుల్లో నివసించే వారి దగ్గరి నుంచి మధ్యతరగతి ప్రజల వరకు అందరూ వీటి వైపు మొగ్గు చూపుతున్నారు.

మాడ్యులర్‌ కిచెన్: ఈ రెడిమేడ్‌ కిచెన్‌ అందుబాటులోకి వచ్చాక వంటగది రూప మే మారిపోయింది. ఇంటీరియర్‌ డెకరేషన్‌లో ఇది సరికొత్త మార్పులను తీసుకువచ్చింది. ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా సులభంగా వంట చేసుకునే వీలుండడం దీని ప్రత్యే కత. వంటగది విస్తీర్ణాన్నీ బట్టి కిచెన్‌ క్యాబినెట్‌లను డిజైన్‌ చే యించుకోవడం వల్ల వస్తువులను నీట్‌గా సర్దుకునే అవకాశం ఉంది. వంటపాత్రలు శుభ్రం చేసుకోవడానికి వీలుగా సింక్‌, కూరగాయలు తురుముకోవడానికి గ్రానైట్‌ టాప్‌ ఉంటుంది.హబ్స్‌లో కూడా బోలెడు వెరైటీలున్నాయి. గ్లాస్‌ హబ్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ మంది ఇప్పుడు గ్లాస్‌ హబ్‌ నే ఎంచుకుంటున్నారు. పొగ బయటకు వెళ్లడానికి వీలుగా చిమ్నీ ఉంటుంది. ఇందులో కూడా చాలా రకాలున్నాయి.

4 వేల నుంచి 40 వేల రూపాయల ధర ఉన్న చిమ్నీ కూడా ఉంది. గ్లాస్‌ చిమ్నీకి ఇప్పుడు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. వంట సామగ్రి, పాత్రలు పెట్టుకోవడానికి వీలుగా ఫుల్‌ అవుట్‌ డ్రాలు ఉంటాయి. వంటపాత్రలు భద్రపరుచుకోవడానికి అనువుగా షట్టర్స్‌ ఉంటాయి.మాడ్యులర్‌ కిచెన్‌ యాక్సెసరీస్‌లో చాలా రకాలున్నాయి. అనేక రకాల రంగుల్లోనూ, డిజైన్లలోనూ మాడ్యులర్‌ కిచెన్‌లు లభిస్తు న్నాయి.

ఇల్లు మారినా ఓకే: మాడ్యులర్‌ కిచెన్‌లో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే మా డ్యూల్స్‌ను సులువుగా విడదీసుకోవచ్చు. ఇల్లు మారాల్సి వచ్చి నప్పుడు ఏ మాత్రం డ్యామేజ్‌ కాకుండా సులువుగా విప్పుకోవ చ్చు. కొత్త ఇంటికి తరలించుకుని మళ్లీ బిగించుకోవచ్చు. కొన్ని రోజులు అయ్యాక మళ్లీ కొత్త లుక్‌ రావాలనుకున్న వారు షట్టర్స్మార్పించుకోవచ్చు. కొత్త డిజైన్లు ఉన్న షట్టర్స్ వేసుకోవడం వల్ల కొత్తదనం వస్తుంది. సంప్రదాయ కిచెన్‌ టాప్‌ ను నిర్మించుకున్న వారు కూడా మాడ్యులర్‌ షట్టర్స్ ను తెచ్చుకుని బిగించుకోవచ్చు. ఈ విధంగా ఎన్నో విధాలైన సౌలభ్యాలు ఇందులో ఉన్నాయి.

English summary

Modular Kitchen Tips for Your Home...! | మోడ్రన్ మాడ్యులర్ కిచెన్...!

A modular kitchen not only gives your home a classy look but also makes your cooking fun and interesting. If you’re planning for a modular kitchen at your apartment in India you can approach an interior designer and go ahead with your plan. An interior designer can choose the apt modular kitchen which will best suit your personality. A modular kitchen can have an array of elegant and stylish kitchen cabinets, shelves, chic basins, a dish washer and a wide variety of storage capacity areas.
Desktop Bottom Promotion