Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మూడును మార్చే మల్టీ క్యాండిల్ స్టాండ్ లైట్...!
ప్రస్తుతం బయట మార్కెట్ లో లభ్యమవుతున్న వివిధ రకాల బల్బులతో అలంకరించి ఇంటికి హుందాతనాన్ని తీసుకురావాలి. ఇంటి అందాన్ని అనుభూతిని పెంచడంలో లైటింగ్ లేక దీపాలంకరణ ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఇంటికి కొత్త కళను తేవడానికి మరింత చిక్కదనాన్ని సంతరించిపెడుతుంది. అందం మాత్రమేకాక, సమపాళ్ళలో లైటింగ్ అమర్చినట్లయితే ఒక అరుదైన వాతావరణం ఇంట్లో నెలకొంటుంది. గృహాలంకరణలో షాండిలేర్లు వాడినట్లయితే మీ ఇంటికి మరింత ఐశ్వర్యవంతమైన కళ వస్తుంది. నేటి స్టీలు, కంచు,ఇత్తడిలో వివిధ ఆకృత్లో లైట్లు ఆకర్షణీయంగా తయారవుతున్నాయి. మారుతున్న కాలాన్ని బట్టి లైటింగ్ పద్ధతులుకూడా కొత్తరూపం సంతరించుకుంటున్నాయి. నిజానికి లైట్లు సందర్భానుసారంగా మారుతున్నాయి. వివిధ తరహాల మూడు, సందర్భాలకు సరిపోయే లైట్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఒకే గదిలో రెండు లేక మూడు తరహాల లైట్లను అమర్చుకోవచ్చు. మూడును బట్టి లైటింగును సున్నితమైందిగా, మెరిసేదిగా మార్చుకోవచ్చు. వివిధ రంగుల ఎల్‌ఇడి లైట్లకు ఎక్కువ మంది ఆకర్షింపబడుతున్నారు. ఆధునిక లైట్ల ఫిక్చర్లు సాంకేతికపరమైన సులువును సౌకర్యాన్ని చేకూర్చాయి. ఇప్పుడు ఇవి అందరికీ అందుబాటులో ఉన్నాయి.

సాధారణంగా ఈ లైట్లకు వెలిగించే విద్యుత్తును పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఇలా, ఒకే గదిలో వివిధ స్థాయిల్లో కాంతిని ప్రసరింపజేయవచ్చు. ఒక స్థలం శుభప్రదంగా కనిపించడానికి మంచి లైటింగ్ వ్యవస్థ ఎంతో దోహదపడుతుంది. చిన్న గదిలో తక్కువ కాంతి లైట్లున్నట్లయితే ఆ గది మరింత చిన్నదిగా కనిపిస్తుంది. ఒక గది లేక స్థలం మరింత పెద్దదిగా కనిపించడంకోసం అక్కర్లేని నీడల్ని తొలగించండి. మసక కాంతి లేక ఇన్వెర్టెడ్ లైట్లు ఒక మూడును కలిగిస్తాయి. మనం ఎక్కువ కాలం గడిపే బెడ్‌రూం, డ్రాయింగ్ రూముల్లో సాధ్యమైనంత మేరకు డైరెక్టు కాంతిని తప్పించాలి. తక్కువ కాంతి లైట్లు తగినంత వెలుతురునివ్వడమేకాక గదిలో ఎక్కువ మిరుమిట్లుగొలిపే కాంతిని కానీ మసకవెలుతురు స్థలాలు లేకుండా ఉండడానికి కూడా తోడ్పడతాయి.
ఇక పెయింటింగులవంటి వాటిని అలంకరించడానికి అలంకారిక లైట్లు లేక హ్యాంగింగ్ ల్యాంపులు వాడవచ్చు. ఒక అలంకారప్రయమైన ల్యాంపు గోడకు వేలాడుతున్నా, బెడ్డుకు పక్కన అమర్చినా గది అందం ఇనుమడిస్తుంది. తెల్ల, పసుపు రంగు దీపాలను కలిపి వాడినట్లయితే మరింత అందంగా ఉంటుంది. పండగల సమయంలో కొవ్వొత్తులు, కాగితపు లాంతర్లు వాడి ఇంటికి మరింత కాంతిని మెరుపును తీసుకురావచ్చు. మల్టికాండిల్ స్టాండు తెచ్చి ఒక వరుసలో కొవ్వొత్తులు వెలిగించినట్లయితే మీ మూడు తక్షణమే రెట్టింపవుతుంది. వివిధరకాల పేపరు, ముఖ్యంగా చేత్తో చేసిన కాగితం లాంతర్లు వాడినట్లయితే గదిలో అలంకరణకు మృదుత్వాన్ని చేకూరుస్తుంది. ఇంటికి వచ్చే వివిధ తరహాల వారిని ప్రముఖంగా కనిపించేలా చేయడానికి లైటింగు ఒక గొప్ప మార్గం. ఇలాంటి లైట్లు వివిధ ఆకృతుల్లో సైజుల్లో లభ్యమవుతున్నాయి. వీటిని గోడకు వేలాడేయవచ్చు, అనేక అసాధారణ పద్ధతుల్లో అమర్చి గదికి ఓ కొత్త అందాన్ని కలిగించవచ్చు. మీవద్ద పాతకాలకు కళాఖండాలుంటే వాటిని కాంతిలోకి తీసుకువచ్చి వాటి వైభవాన్ని వెలిగించండి.



Click it and Unblock the Notifications