Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ప్రశాంతతకు పూజగది అలంకరణ

1. పూజ గది గోడలకు మీ ఎంపిక చేసుకునే రంగలు మాత్రం లైట్ కలర్ షెడ్ లు ఉండే విధంగా ఎంచుకోవాలి. గోడలకు వేసిన రంగుల వల్ల మనస్సు ప్రశాంతత చేకూర్చే విధంగా ఉండాలి. పూగ గదికి వేసే రంగులు ముఖ్యంగా తెలుపు రంగుతో పాటు టైలు ఎల్లో (పసుపు) పింక్ (లేత గులాబి) లైట్ బ్లూ కలర్స్‌గా బాగా ఉంటాయి.
2. పూజ గదికి ఏర్పాటు చేసే మండపాన్ని చక్కగా అలంకరించాలి. ఈమండపాన్ని సంప్రదాయబద్ధంగా ఉండే విధంగా చక్కటి కలపను వాడాలి. ప్రస్తుతం మార్కెట్ లో మార్బల్, ఇత్తడితో పాటు గ్రైనేట్ మండపాలు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ మండపాలకు పూలతో చక్కగా అలంకరించాలి.
3. మండాపాల ఎంపిక తర్వాత చేయాల్సిన పని దానికి తగ్గ విగ్రహాల ఎంపిక. విగ్రహాల ఎంపికకు తేలికపాటి విగ్రహాలను ఎంపిక చేసుకోవాలి. చక్కతో చేసిన విగ్రహాలైతే నయం. లేదా లోహంతో తయారు చేసినవ కూడా ఫర్వాలేదు. బంకమట్టితో చేసిన విగ్రహాలు కూడా వాడవచ్చు.
4. పూజ గదిలో వెండి, రాగి లేదా ఫ్రేమ్ తో తయారు చేసిన ఫోటోలను పూజ గది గోడలకు అందంగా అలంకరించవ్చు.
5. గోడలకు స్టయిల్‌గా ఉండే గాజుతో తయారు చేసిన షెల్ఫ్ ను ఏర్పాటు చేసుకుని దానిపై కూడా దేవుని విగ్రహాలతో పాటు, దేవుని ఫోటోలు ఉంచుకోవచ్చు.
6. పూజ గదిలో వెండి, లేదా ఇత్తడి దీపస్తంభాలు మార్కెట్లో వివిధ షేప్‌లలో లభిస్తాయి. వాటిని పూజ గదిలో ఏర్పాటు చేసుకుంటే పూజగదికి మరింత అందం చేకూరుతుంది.
7. వెండితో తయారు చేసిన పళ్లాలు వాడవచ్చు. వాటిలో కర్పూరం, చందనం, పూలు తదితర పూజసా మగ్రిని ఉంచుకోవచ్చు.
8. పూజ గదిలో పూలు లేవంటే చాలా కొరతగానే కాదు పూర్తిస్థాయిలో పూజలేనట్లే... కాబట్టి కాలాన్నిబట్టి మార్కెట్లో వివిధ రకాల పూలు దొరుకుతాయి. రోజుకోరకం పూలను వాడుకోవచ్చు.



Click it and Unblock the Notifications