For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లివింగ్ రూం కి సౌకర్యవంతమైన ఫర్నీచర్ ఎంపిక

|

Furnishings for the Living Room
సాధారణంగా ఇంటికి వచ్చిన వాళ్లు ముందుగా చూసేది హాల్. దీన్నే లివింగ్‌రూం కూడా అంటాం. ఇక ఇంట్లో మనం ఎక్కువగా గడిపేది ఈ గదిలోనే. కాబట్టి ఈ హాల్ ఎంత ఆహ్లాదకరంగా ఉంటే మనస్సు అంత ప్రశాంతంగా ఉంటుంది. లివింగ్ రూమ్ లో గాలి వెలుతురు ధారళంగా ప్రసరించాలంటే ఎక్కువ కిటికీలు వెంటిలేటర్లు ఏర్పాటు చేసుకోవాలి. వాటి సంఖ్యను తగ్గించితే ఇంట్లో గాలి వెలుతురు లోపించి చీకటి గుహగా మారుతుంది. కాబట్టి స్థాయికి తగ్గట్టుగా ఈ హాల్‌ ను అమర్చుకోవాలి. మీకు ఉన్న మీ అలవాట్లు ఈ లివింగ్ రూంను చూస్తే అర్థమయైపోయేలా ఉండాలి.

సొంత ఇళ్లు ఉన్నవారయితే ఉన్న ఫ్లోర్‌ కు తగ్గట్టుగా సోఫాలు, కుర్చీలు తీసుకుంటే సరిపోతుంది. ఇక అద్దె ఇంట్లో ఉండేవాళ్లు ఇల్లు మారినప్పుడల్లా ఫర్నీచర్ మార్చలేం కదా.. అందుకే అద్దెం ఇంట్లో ఉండేవాళ్లు ఏ ఫ్లోర్‌ కైనా సరిపోయే సహజమైన రంగులతో ఉన్న ఫర్నీచర్ ఎంపిక చేసుకోవాలి. సోఫాలు, కుర్చీలు హాల్ మధ్యలో వేయకూడదు. దీనివల్ల నడవడానికి ఇబ్బంది. హాల్ అందం చెడిపోతుంది. వీటిని ఎప్పుడైనా గోడను ఆనుకుని ఉండేలా వేస్తే ఎక్కువగా స్థలం అక్రమించినట్లుగా ఉండదు.

ఎక్కువ రూమ్స్ ఉంటే హాల్ కేవలం ఆ రూమ్స్‌లోకి నడవడానికి మాత్రమే సరిపోతుంది. ఇట్లాంటప్పుడు తక్కువ స్థలం ఆక్రమించే ఫర్నీచర్ తీసుకోవాలి. ఇక ఇది సోఫా కంబెడ్ అయితే మరీ మంచిది. ఉమ్మడి కుటుంబాల్లో దీనిని బెడ్‌ గా కూడా వాడుకోవచ్చు. మంచి లుక్‌తోపాటు సింపుల్‌ గా ఉన్న సోఫాలు ఎంచుకుంటే బాగుంటుంది.

లివింగ్ రూమ్ శారీరకంగా, మానసికంగా విశ్రాంతి తీసుకునే గది కావడంతో రంగుల ఎంపికలో కాస్త జాగ్రత్త పడాలి. ఇంకా ఈ గదిని సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. ఈ గదికి నీలం, గులాబి, ఆకుపచ్చ వంటి పోస్టల్ రంగులు లేదా న్యాట్రల్ షేడ్లు వాడటం మంచిది. అలాగే రంగులకు తగినట్లు లైట్లను అమర్చుకుంటే లివింగ్ రూమ్, హాలు ప్రకాశవంతంగా ఉంటాయని ఇంటీరియర్ డెకరేటర్స్ సూచిస్తున్నారు.

English summary

Selecting Suitable Furnishings for the Living Room | లివింగ్ రూం కి సౌకర్యవంతమైన ఫర్నీచర్ ఎంపిక

As a homeowner, you want nothing more than to decorate your house's interiors with a flair. During the planning stage, it is easy to get carried away and dream of using huge and comfortable couches, tables, and the like. However, you need to be practical with your choices, too. So, if you do not want to regret what you have bought, keep the following tips in mind.
Story first published:Wednesday, February 1, 2012, 17:15 [IST]
Desktop Bottom Promotion