Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
సెంటర్ టేబుల్ అందంగా...ఆకర్షణీయంగా...అలంకరించడం ఎలా..?

1. సెంటర్ టేబుల్ అమర్చడానికి, డ్రాయింగ్ రూం అలంకరణ, మీ అభిరుచి మీదే ఆధారపడి ఉంటుంది. ఎదేని శుభకార్యానికి సెంటర్ టేబుల్ గ్రాండ్ గా అలంకరించుకోవాలి. లేదంటే సాధారణంగా ఉన్నా సరిపోతుంది.
2. సెంటర్ టేబుల్ ను పువ్వులు, బోన్సాయ్ మొక్కలు, పండ్లు, కూరగాయలు, కొవ్వొత్తులు, శిల్పాలు, క్రిస్టల్స్ వంటి వాటితో అలంకరిస్తే చూడటానికి మరింత ఆకర్షణీయంగా కనబడుతాయి.
3. మరొక అద్భుతమైనటువంటి అలంకరణ ఏంటంటే టేబుల్ సెంటర్ లో ఒక చక్కటి ఆకృతి కలిగిన బౌల్(గ్లాస్, ఇత్తడితో తయారు చేసినటువంటి)లో గులాబీ పువ్వుల రేకులు మద్యలో తేలియాడే కొవ్వొత్తులు అమర్చినట్లైతే మరింత అద్భుతంగా సెంటర్ టేబుల్ ఆకర్షింపబడుతుంది.
4. అలాగే ఫ్లవర్ వాజ్ రకరకాల పూలతో కూడినటువంటి సహజమైన పువ్వులు(కాడలతో సహా)అలంకరించనట్లైతే ఆప్రదేశం ప్రకాశవంతంగా ఉంటుంది.
5. సెంట్ క్యాండిల్స్ అలంకరణకు మాత్రమే కాదు, సుగంధ పరిమళాలను వెదజల్లేవిగా ఉంటాయి. కొన్ని సెంట్ క్యాండిల్స్ ఒక కలర్ రిబ్బన్ తోటి టైట్ గా కట్టి ఉంచి టేబుల్ సెంటర్ లో పెట్టి సాయంత్రం వేళ వెలిగిస్తే ఇల్లు ప్రకాశవంతంగా మెరుస్తుంటుంది.
6. సెంటర్ టేబుల్ అలంకరించేందుకు క్యాడింల్ స్టాండ్ ను కూడా ఉపయోగించవచ్చు.
7. ఇంటికి వచ్చే అతిథుల కోసం సెంటర్ టేబుల్ క్రింది బాగంలో మ్యాగజైన్స్, బుక్స్, న్యూస్ పేపర్స్ ఉంచాలి.
8. సెంటర్ టేబుల్ మీద ఒక సాంప్రదాయబద్దంగా ఉండాలంటే వాటిపైన మంచి మాట్స్ వేసుకొంటే బాగుంటాయి. టేబుల్ మీద మరకకాకుండా ఉండేందుకు గ్లాస్ ను ఫిట్ చేసుకొంటే సరిపోతుంది.
9. సెంటర్ టేబుల్ ను సాంప్రదాయ బద్దంగానే కాదు స్టైలిష్ గాను అలంకరించుకోవాలి.
10.ఎప్పుడు కానీ సెంటర్ టేబుల్ మీద ఏవేవో పెట్టేసి టేబుల్ పూర్తిగా కవర్ చేయకూడదు. టేబుల్ మీద కొంత స్థలం ఉండేట్లు చూసుకోవాలి. అప్పుడే మరింత అందంగా ఆకర్షనీయంగా కనిపిస్తుంది.



Click it and Unblock the Notifications