Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
పువ్వులను అలంకరించడంలో మెలుకువులు

1. పుష్పాలంకరణలో భాగంగా పువ్వులు, ఆకుల్ని కొద్దిగా మెలితిప్పాల్సి వచ్చినా కూడా ఆ అలంకరణ మాత్రం పైకి చూస్తున్నట్లే ఉండాలి. ఫ్లవర్ వాజుల్లో ఉన్న నీటిని ప్రతిరోజూ మార్చినట్లయితే, పువ్వులు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. పూవుల అమరికలో భాగంగా పండ్లూ వాడుతున్నట్టయితే.. అవి కిందికి ఒంగి ఉండే కొమ్మల్నే ఎంచుకోవాలి.
2 పుష్పాలంకరణ అనగానే కేవలం కొన్ని పువ్వులు, ఆకులు, కొమ్మలను హడావుడిగా పిన్ హోల్డర్లకు గుచ్చేసి ఓ మూల అమర్చేయడం కానేకాదు. ఎంత సాధారణంగా చేసినప్పటికీ పూవుల అమరికకు ఓ ప్రత్యేకమైన డిజైనుండాలి. రంగు, సమతూకం.. రిథమ్, దిశ లాంటివన్నీ తప్పనిసరి. అప్పుడే అది అసలైన అలంకరణ అనిపించుకుంటుంది.
3. అలంకరణలో ఓ మొక్కకు సంబంధించిన జీవప్రక్రియ మొత్తం కనిపించాలి. అంటే.. కొమ్మలు, ఆకులు, పువ్వులు మాత్రమే కాదు, సంబంధిత మొక్కకు చెందిన మొగ్గల్ని కూడా అలంకరణలో వాడడం తప్పనిసరి. అలంకరణ చేస్తున్నప్పుడు హడావుడి పడకూడదు. నిదానంగా చేయాలి. లేదంటే మీరు పడిన శ్రమ మొత్తం వృథా అవుతుంది
4. ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేమిటంటే పుష్పాలంకరణ చేయగానే సరిపోదు. గదుల విస్తీర్ణం, ఏ స్థలంలో అలంకరణ చేయాలనుకుంటున్నారు, అది అందరికీ కనిపిస్తుందా, బ్యాక్ గ్రౌండ్ ఎలా ఉంది... లాంటి విషయాలన్నీ బాగా ఆలోచించి ఆ తర్వాతే ఓ నిర్ణయానికి రావాలి.



Click it and Unblock the Notifications