For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓపన్ కిచెన్ తో ఇంటికి అందం... ఆకర్షణ

|

Styling Tips For An Open Kitchen...!
ఇంట్లో సాధారణంగా అన్ని గదులకంటే వంట గదిని మెయింటైన్ చేయడం కొంచెం కష్టమైన పని ఎందుకంటే ప్రతి రోజూ ఎక్కువగా గడిపేది వంటగదిలోనే కాబట్టి. వంట గది విశాలంగే ఉంటే పనులు చకచకగా జరిగిపోతాయి. పనులు చకచకగా జరిగానా అతి విశాలంగా ఉండే వంటగది మెయింటైన్ చేయాలంటే, అందంగా అలంకరించుకోవాలంటే కొన్ని చిట్కాలను తెలిసిఉండాలి. అవేంటో చూద్దాం...

1. మీ ఇంట్లో ఓపెన్ కిచెన్ ఉండాలంటే అందుకు పెద్ద గదిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ కిచెన్ కి డైనింగ్ రూమ్ ను కూడా కలుపుకొంటే ఇటు వంట గదికి, అటు డైనింగ్ రూమ్ కు సౌకర్యంగాను అతి విశాలంగాను ఉంటుంది. మెయింటైన్ చేయడం కూడా సులభం అవుతుంది. ఈ గదిని మీరు అలంకరించుకొనే విధానం మీదే ఆధారపడి ఉంటుంది.
2. మీ ఇంట్లో ఓపెన్ కిచెన్ ఉన్నట్లైతే లేదా మెయింటైన్ చేయాలనుకొంటున్నా ఆ గదిలో ఉన్న క్యాబినెట్స్ కు లేదా వార్డ్ రోబ్స్ కు తప్పనిసరిగా డోర్లు ఉండేట్లు చూసుకోవాలి. వాటిని ఎప్పుడూ మూసి ఉండే ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే వంటే చేసేటప్పుడు వెలువడే నూనెలు , పొగలు పోపుడబ్బాలమీదా ఇతర ఆహార వస్తువుల మీద పడకుండా ఉంటాయి. వాటిమీద జిడ్డు ఏర్పడకుండా జాగ్రత్త పడవచ్చు.
3. మీ ఇంట్లో ఓపెన్ కిచెన్ ఉంటే అందులో తప్పనిసరిగా పొగ గొట్టం లేదా ఎక్జ్సాస్ట్ ఫ్యాన్ ఉండేట్లు చూసుకోవాలి. ఎందుకంటే వంట చేసేప్పుడు వెలువడే పొగ ఇతర వాసనలు బయటకు సులువుగా వెళ్లగొట్టడానికి సువుగా ఉంటుంది. లేదంటే ఇల్లంగా పొగతో నిండుకొంటుంది.
4. ఓపెన్ చికెన్ క్యాబినెట్స్ కు గ్లాస్ డోర్స్ లేదా వుడెన్ డోర్స్ ను ఫిక్స్ చేసుకొంటే చూడటానికి అందంగా, శుభ్రం చేయడానికి సులభంగా ఉంటుంది. గ్లాస్ డోర్స్ అయితే అందులో నుండి ఐటమ్స్ ను సులభంగా గుర్తించవచ్చు. గ్లాస్ డోర్స్ లో లైట్ ఫోకస్ అయ్యే అందమైన డోర్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
5. మీ అందమైన ఓపెన్ కిచెన్ లో అందవిహీనమైన మట్టిపాత్రలు, కత్తిపీటలు లేదా స్టోరేజ్ టిన్స్ వంటివి ఉంచకూడదు. మీ మట్టిపాత్రలు కానీ లేదా ఇతర సామాగ్రికానీ, కత్తిపీటలు కానీ ఎవైనా సరే అందంగా ఆకర్షనీయంగా కనబడేలా ఉండాలి. అప్పుడే ఓపెన్ కిచెన్ కు మరింత అందం చేకూరుతుంది. మీ ఓపెన్ కిచెన్ ను అందంగా కనబడాలంటే గ్లాస్ వస్తువులను లేదా స్టైయిన్ లెస్ వస్తువులను ఉపయోగించడం మంచిది.
6. ఓపెన్ కిచెన్ లో కలర్ కోఆర్డినేషన్ ను మెయిన్ టేయిన్ చేయడం వల్ల మరింత ఆకర్షణ. పిల్లలు ఎక్కువగా ఇష్టపడే తినే వస్తువులు, బిస్కెట్స్, కూల్ డ్రిక్స్ వంటివి కలర్ ప్యాకెట్స్, పక్కపక్కన పెట్టడం వల్ల డిజైనింగ్ గా ఉంటుంది.
7. ఓపెన్ కిచెన్ అందంగా మెయిటైన్ చేయాలంటే షెల్స్ ఎక్కువగా ఉండాలి. ముఖ్యంగా ఒక షెల్ఫ్ అతి పెద్దగా ఉంటే అందులో ఎలక్ట్రానిక్ వస్తువులు గ్రైడర్, మిక్సర్, జ్యూసర్, వంటివి సర్ధుకోవచ్చు. గ్యాస్ పెట్టుకోవడానికి, ఓవెన్ పెట్టుకోవడానికి ఓపెన్ కిచెన్ స్లాబ్ విశాలంగా ఉండేట్లు అరేంజ్ చేసుకోవాలి.
8. అలాగే ఓపెన్ కిచెన్ లో వాటర్ కూలింగ్ సిస్టమ్, రిఫ్రిజరేటర్ వంటివి పెట్టుకోవడం వల్ల ఓపెన్ కిచెన్ మరింత అందంగా ఉంటుంది. అందుకు తగ్గ స్థలంను అరేంజ్ చేసుకోవాలి.
9. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులను ప్లగ్ పాయింట్స్ కి దగ్గరలో మెయిటైన్ చేయాలి. అందువల్ల మాటిమాటికి మార్చాల్సిన పనిలేకుండా పని సులభంగా, వేగంగా అవుతుంది.
10. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులన్నింటికి ఎప్పుడూ కవర్స్ ను వేసి ఉండాలి. అందువల్ల వాటిని ఎక్కువ కాలం మన్నికగా ఉంచుకోవచ్చు. గది ఉష్టోగ్రత వద్ద వాటిని పాడవకుండా జాగ్రతపడవచ్చు.

చిన్న ఇల్లు ఉన్నట్లైతే అందులోనే ఈ పద్దతులను పాటించవచ్చు. అయితే స్థలంను బట్టి ఓపెన్ కిచెన్ అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది.

English summary

Styling Tips For An Open Kitchen...! | ఓపెన్ కిచెన్ అందంగా ...!

An open kitchen can be a blessing in disguise or a curse you cannot handle. It really depends on how you style your kitchen. An open kitchen has both pros and cons. You have to work on minimising the cons and maximising.
Story first published:Thursday, August 9, 2012, 9:28 [IST]
Desktop Bottom Promotion