For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవి కాలంలో..ఇంట్లో కర్టెన్ల ప్రాధాన్యత...

|

Summer Curtains are light can give an airy feeling to your interiors
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడమే కాదు, కళాత్మకంగా కూడా ఉంచుకోవడంపై శ్రద్ధ పెరిగింది. దానివల్ల ఇంట్లోని వారికి ఆహ్లాదం, అతిథులనుండి ప్రశంసలు రెండూ దక్కుతున్నాయి. కనుక ఇంటిని ఉన్నంతలో చక్కగా అలంకరించుకోవడమనే అభిరుచి అభినందించదగ్గదే! ఇంటి అందాన్ని పెంచి... అందరి దృష్టినీ ఆకట్టుకోవడంలో కర్టెన్లదే పైచేయి...ఒకప్పుడు చాలా అవసరమనుకుంటే తప్ప ఇంటిలో కర్టెన్స్ వేలాడదీసేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పరదాలు ఇప్పుడు ఇంటి అందాన్ని పెంచడానికే తోడ్పడుతున్నాయి.

ఇంటీరియర్ డిజైన్ లో ఒక కొత్త ట్రెండుగా ఈ కర్టెన్స్ రకరకాల డిజైన్లలో దర్శనమిస్తున్నాయి. గదుల గోడల దగ్గర, కిటీకీల దగ్గర, పెద్ద ద్వారాల ముందు వాటి అందాన్ని పెంచడానికి ఈ పరదాలను వాడుతున్నారు. ఇల్లంతా కొత్తగా కనిపించాలని వారి తాపత్రయం. అయితే పరదాలు ఎలాపడి అలా..ఎక్కడపడితే అక్కడ ఉపయోగించకూడదు అందుకు తగిన సూచనలు మీకోసం...

1. స్ర్కీన్లు కొనుగోలు చేస్తున్నారా? మీరు మొదట మీ ఇంటి గోడల రంగును బాగా పరిశీలించండి. గోడల రంగు పరదాల రంగు రెండింటికీ మ్యాచ్ అయ్యేలా ఉండాలి.
2. కిటికీలకు కర్టెన్లు వేలాడదీయాలనుకుంటే అవి కార్పెట్ కలర్ కు మ్యాచ్ అవ్వాలి.
3. కొందురు కార్పెట్ కలర్ కు..కర్టెన్లు మ్యాచ్ అవ్వాలనుకొంటారు.మరికొందరేమో వేర్వేరుగా ఉండాలంనుకొంటారు. ప్రస్తుతం క్రీమ్, బాదం రంగులను ఎక్కువ వాడుతున్నారు.
4. గదిలో కర్టెన్లు అందంగా ఆకర్షనీయంగా కనిపించాలంటే వెలుతురు ఎక్కువగా రావాలంటే..కర్టెన్లు ట్రాన్స్ పరెంట్ గా ఉండాలి. నెట్ పరదాలను కూడా ఉపయోగించవచ్చు.
5. గది చిన్నగా ఉంటే ప్లెయిన్ గా, పెద్దగా ఉంటే పువ్వులున్న కర్టెన్స్ వేస్తే మంచిది. తేలికపాటి రంగులు కలిగిన పరదాలను ఉపయోగిస్తే వేడి కూడా కొద్దిగా తగ్గుతుంది.
6. సీజన్‌ ను దృష్టిలో పెట్టుకొని కర్టెన్స్ మార్చుకుంటుండాలి. వేసవిలో మందపాటి లైనింగ్‌ ఉన్న కర్టెన్స్ వాడాలి. వానాకాలం, శీతాకాలాల్లో పల్చని కర్టెన్లు నప్పుతాయి.
7. నెట్, కాటన్, సిల్క్, లినెన్ లాంటి ఫ్యాబ్రిక్ క్లాత్ లను ఎక్కువగా ఉపయోగించాలి.
8. పెద్ద ద్వారాలు, కిటీకీ నాలుగుపక్కలా రెండూ సమానంగా ఉన్నాయనుకుంటే వాటిని మార్చిమార్చి వాడితే కొత్తదనం వెల్లువిరుస్తుంది....

English summary

Summer Curtains are light can give an airy feeling to your interiors... | ఎండాకాలంలో ఎలాంటి కర్టెన్లు...

The curtains are one of the most effective home décor elements that are capable of bringing in a drastic change in the ambience of a house. There are many varied styles of summer curtain designs now available in the market. Online upholstery web stores have also introduced a new line of curtains for the summer season in cheerful color tones.
Story first published:Wednesday, February 22, 2012, 12:50 [IST]
Desktop Bottom Promotion