Latest Updates
-
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా..
కళాఖండాలను మురిపించే గోడచిత్రాలు....!

వాల్ టాపెస్ట్రీ : గదికి అందాన్ని ఇవ్వడమే కాదు. ఎంతో మానసికానందాన్ని కూడా ఇస్తుంది. ఫొటో ఫ్రేమ్‌లు, పెయింటింగ్‌లు, గది గోడలకు పరిమితమైన అందాలనే ఇవ్వగలవు. అవి కంటికి నదురుగా కనిపించవచ్చు. అదే వాల్ టాపెస్ట్రీ అయితే ఇంటి లోపల సొగసుల అలంకరణలో అంతర్భా గమవుతుంది. మామూలుగా కాన్వాసు బదులు ఫ్యాబ్రిక్ వాడితే ఆ టాపెస్ట్రీపై చిత్రించిన ప్రతి రూపం కనువిందు చేస్తుంది. ఒక ప్రత్యేక అనుభూతినిస్తుంది. ఎనలేని అందాన్ని ఆవిష్కరిస్తుంది. ఇవి చాలా వరకు బంగారు, వెండి దారాలతో ఇటాలియన్ సిల్క్‌తో చేసినవే అయివుంటాయి.
ప్రకృతి దృశ్యాలు, వివిధ దేవతా మూర్తుల రూపాలు, ఉరికే లేడి కూనలు, ప్రకృతి అందాలు, ఎగసిపడే అలలు, జాలువారే జలపాతాలు... వీటి ప్రతిరూపాలు. ఎంతో అందంగా ఈ తెరలలో ఒదిగిపోతాయి. యూరోపియన్ ఆర్ట్ టాపెస్ట్రీలు కొనేప్పుడు వాటి అల్లికలు నేతల తీరు, సంప్రదాయ సొగసులు ఇలా ఎన్నో అంశాలు పరిగణలోనికి తీసుకోవలసి వుంటుంది.
జాగ్రత్తలు: ఇవి సుదీర్ఘకాలం చెక్కు చెదరకుండా వుండాలంటే వీటిని జాగ్రత్త చేయడంలో కొంత శ్రద్ధ అవసరం. ఈ టాపెస్ట్రీలు ఫ్యాబ్రిక్‌తో తయారవుతాయి కాబట్టి వీటిని జాగ్రత్త చేయడంలో కొన్ని మెళకువలు పాటించాలి. మరెంతో శ్రద్ధ వహించాలి. అవి మాసిపోయినట్లు దుమ్ము ధూళి చేరినట్లు వుంటే మధ్య మధ్య ఒకసారి వాటిని డ్రైక్లీనింగ్‌కు ఇవ్వడం మంచిది. అందువల్ల దాని మీద పేరుకుపోయిన దుమ్ము, ధూళికణాలన్నీ పోయి మళ్ళీ చూడచక్కని రూపాన్ని సంతరించుకుంటాయి.
మీరు కొనాలనుకున్న టాపెస్ట్రీ దాన్ని వుంచాలన్న గది గోడలకు తగ్గట్లు వుంటుందో లేదో ముందే ఒకసారి చూసుకోవడం మంచిది. సరైన టాపెస్ట్రీని ఎంచుకోకపోయినా, దాన్ని సరైన స్థానంలో వుంచకపోయినా, ఎంత అందమైన కళాఖండమైనా సాదాసీదాగా కనిపిస్తుంది. మీరు ఆశించినట్లుగా గది గోడకు తగ్గ అలంకారం కాలేదు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఎంచుకునే టాపెస్ట్రీ మీ వ్యక్తిత్వాన్ని అభివ్యక్తీకరించాలి.



Click it and Unblock the Notifications