Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇంటికి అందం..ఆకర్షణ...రెండూ హాల్లోనే....

హాలులో ఏవిధమైన సిటింగ్ ఏర్పాట్లు ఉంటే బావుంటుందో చూపండి. ఏ మ్యూజిక్ సిస్టం, టివి., వాల్ హ్యాంగింగ్స్, లైటింగ్ సిస్టం, సోఫాల దగ్గర నేలమీద సుతిమెత్తని తివాచీలు ఎలా ఏర్పాటుచేస్తే అందంగా ఉంటుందో చూడండి. మీ సీటింగ్ కు కనీసం మూడు మీటర్ల దూరంలో టీవీ దాని పక్కనే ఓ చిన్న దానిపై తాజాపూలతో వాజ్ ఉంటే లుక్ బాగుంటుంది.
ఇంటికి వచ్చిన అతిధులకు మీరు గోడలకు అమర్చిన పెయింటింగ్స్ చూసి విస్మయపడేలా ఉండాలి. వాటిని ఎక్కడ కొన్నారు అని అడిగి, మాకు కూడా ఇటువంటివి కొనిపెట్టండి అనేలా ఉండాలి. ఓ గోడకు క్యాలెండర్, మరో పక్క వాల్ క్లాక్ తప్పనిసరిగా మన అవసరాన్ని బట్టి అమర్చుకుంటే వెతుక్కునే పనిఉండదు. పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారు బుక్స్ ర్యాక్ ను ఓ గోడవారగా ఉంచాలి. హాల్ మరింత అందంగా కనిపించాలంటే హాల్ వాల్స్ మొత్తానికి మీ స్థాయిని బట్టి డిజైన్స్ చేయించుకోవాలి.
హాలులోకి గాలి వెలుతురు బాగా సోకే విధంగా ఉండాలి. అలా లేని పక్షంలో వెలుతురుకై విద్యుత్తు దీపాలను అమర్చుకోవాలి. లైటింగ్ కూడా పెట్టించొచ్చు. హాల్ లో సీలింగ్ కూడా అందంగా ఉండేలా చూసుకోవాలి. హాలులో సీలింగ్ కు ఉండే బీమ్ ల కిందనే సోఫాలు, కుర్చీలు ఉంచరాదు. హాల్ గోడలకు ఉన్న రంగుకు నప్పే విధంగా సీలింగ్ రంగు ఉండేలా చూసుకోవాలి. అతిథులను కిటికీలు, తలుపుల దగ్గర కూర్చోకుండా చూసుకోవాలి. ఇంకా చెప్పాలంటే హాలు కాంతివంతంగా ప్రతిసమయం ప్రకాశిస్తూ ఉండేలా చర్యలు తీసుకోవాలి.



Click it and Unblock the Notifications