Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఎక్కడైనా సరే ఒద్దికగా ఒదిగిపోయే ఫోల్డింగ్ ఫర్నీచర్...

చిన్న ఇంటికి ఫర్నీచర్ కొనాలనుకొన్నప్పుడు ముందుగానే ఆ ఇంట్లో మీరు ఎంత కాలం ఉండాలనుకుంటున్నారో ఆలోచించుకోవాలి. దాని ప్రకారమే మీరు ఖర్చు అంచనా వేసుకోవాలి. చిన్న ఇంటికి ఫోల్డింగ్ ఫర్నీచర్ అన్ని విధాలుగా సర్ధుబాటు అవుతుంది. ఎలా అంటే...? అవసరం ఉన్నప్పుడు వాటిని ఉపయోగించుకొని. అనవసరం అయినప్పుడు వాటిని ఫోల్డ్(మడిచి) పక్కన పెట్టుకోవచ్చు. అంతే కాదు ఫోల్డింగ్ చేయిర్స్ ను ఏగదిలోనైనా అలకరించుకోవచ్చు, డైనింగ్ రూం, చిల్డ్రన్ రూం, లివింగ్ రూం ఇలా ఒక్కటేంటి ఏగదిలోనైనా ఒద్దికగా ఒదిగిపోతాయి.
ఫోల్డింగ్ డైనింగ్ టేబుల్ తో భోజనానికే కాకుండా కూర్చొని మాట్లడుకునే టేబుల్ గా ఉపయోగపడే విధంగా ఉండే వాటిని కొనుగోలు చేస్తే మంచిది. డైనింగ్ రూంలో వినియోగించే డైనింగ్ ఫోల్డింగ్ చేర్స్ తోనే ఎన్నో రకాలుగా ఉపయోగపయోగించుకోవచ్చు. ఈ పోల్డింగ్ చేర్స్ ను గార్డెన్, బాల్కానీ, ఇంటి బయట లాన్లో ఉదయం..సాయంత్రంవేళల్లో ఎంజాయ్ చేయోచ్చు....
ఫోల్డింగ్ టేబుల్స్, ఫోల్డింగ్ చేయిర్స్ ఉన్నప్పుడు ఇంటి పరిశుభ్రత కూడా సులభం అవుతుంది. వాటిని మడిచి సులభంగా ఒక ప్లేస్ నుండి మరో ప్లేస్ లో ఉంచి ఆ గదిని శుభ్రపరిచిన తర్వాత తిరిగి అదే స్థానంలో సర్దుకోవచ్చు...ఫ్లోల్డింగ్ చెయిర్స్ వల్ల ఈ మోడ్రన్ జీవితంలో ఇంట్లో ఎక్కువ స్థలం సేవ్ చేసినట్లుఅవుతుంది. సాధారణంగా ఫోల్డింగ్ చేయిర్స్ స్టీల్ లేదా వుడ్ తో చేయబడినవికూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఫోల్డింగ్ చెయిర్స్ వివిధ ఆకారాల్లో, వివిధ స్టైల్స్ లో మార్కెట్లో లభ్యమవుతున్నాయి. మరి ఇన్ని ప్రయోజనాలు చేకూర్చే ఫోల్డింగ్ చేయిర్ స్థలం సమకూర్చడంలోనే కాదు..ఇంటి అందాన్ని రెట్టింపు చేయడంలోనూ వీటి ప్రత్యేకతను చాటుకొంటాయి....



Click it and Unblock the Notifications