Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
వంటగది విసుగుపుట్టిస్తోందా...అయితే ఇలా చేసి చూడండి

కిచెన్‌లో మూడు ముఖ్యమైన ప్రాంతాలుంటాయి. అవి ఫ్రిజ్, కుకింగ్ టాప్, సింక్. వంట చేసే సమయంలో ఈ మూడింటి తోనే ఎక్కువగా పని ఉంటుంది. కిచెన్ ను డిజైన్ చేసుకునే ముందు ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. కాస్తంత ఓపిక, ఆసక్తి ఉన్నట్లయితే... వంటగదిని అందంగా సర్దుకోవచ్చు. వంటగదిలో ఉండే అనేకానేక వస్తువుల్లో 20 శాతం వస్తువుల్ని మాత్రమే ప్రతిరోజూ 80 శాతం వాడుతుంటాము. అయినా రోజూ పనికివచ్చేవి, ఎప్పుడైనా ఉపయోగించేవి, అన్నింటినీ అందుబాటులో ఉంచుకుని వంటగదినంతటినీ క్రిక్కిరిసిపోయేలా చేసేస్తుంటాం.
అలా కాకుండా... వాటిలో అవసరం మేరకే అందుబాటులో ఉంచుకుంటే వంటగది విసుగుపుట్టించకుండా ఉంటుంది. బేకింగ్, కుకింగ్, సర్వింగ్, స్టోరింగ్ అంటూ వస్తువుల్ని విభజించుకుని ఆ మేరకు సర్దుకోవడం మంచిది. వీటికి పెద్దగా స్థలం అవసరం కూడా ఉండదు. పెద్ద పెద్ద సర్వింగ్ డిష్‌లు, పాన్ లను బాగా కింది లేదా పై అరల్లో నీట్‌గా సర్దుకోవాలి.
ఎప్పుడైనా వాడే వస్తువుల్ని వంటగదిలోనే ఉంచుకోవాల్సిన అవసరం లేదు. వాటిని ఇంకెక్కడయినా సర్దుకోవచ్చు. చిన్న చిన్న వస్తువుల్ని ఉంచుకోవడానికి ప్లాస్టిక్ బుట్టల్ని అమర్చుకుంటే మంచిది. డోర్ హ్యాంగింగ్స్ వాడుతున్నట్లయితే... పాన్ లు, గరిటెలు, ప్లాస్టిక్ బుట్టలు, బ్యాగులు, కటింగ్ బోర్డులు లాంటివి తగిలించుకోవడానికి అనువుగా ఉంటుంది. పైన చెప్పిన చిన్నపాటి జాగ్రత్తలను పాటించి చూడండి.. మీ వంటిల్లు ఎంతలా మెరిసిపోతుందో మీకే అర్థమవుతుంది.
కిచెన్ రాత్రి సమయంలో చీకటిగా వుంచకుండా నైట్ బల్బ్‌ను వేసివుంచడం వల్ల పురుగులు బొద్దిం కలు ఎక్కువగా వ్యాపించవు. వంటింట్లో సామా న్లన్నీ సరిపడే అలమారలు లేకుండా గోడకు ఓవైపు గా స్టాండ్‌ను అమర్చుకోవాలి. దానిలో కంచాలు, పళ్లాలు, గరిటలు, చెంచాలు, గ్లాసులు, గిన్నెలు పెట్టుకోవాలి. స్విచ్‌బోర్డులను గ్యాస్‌స్టౌ పెట్టుకునే ప్రదేశానికి దూరంగా ఏర్పాటుచేసుకోవాలి.



Click it and Unblock the Notifications