Latest Updates
-
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
డ్రెస్సింగ్ రూం అందంగా..ఆకర్షణీయంగా కనబడాలంటే......!?

ముఖ్యంగా డ్రెస్సింగ్ రూం అలంకరణ మీ వ్యక్తిత్వాన్ని, అందాన్ని తెలియజేస్తుంది. మీకు కావాల్సిన రీతిలో రూపొందించుకోవడానికి ఇంటీరియర్ డిజైనర్ చేత తయారు చేయించుకోవచ్చు. డ్రెస్సింగ్ రూం కు ముఖ్యంగా కావాల్సిన కొన్ని ఉపకారణాలు మీకోసం...
1. పర్ ఫెక్ట్ లైటింగ్: డ్రెస్పింగ్ రూం లో ముఖ్యంగా ఉండాల్సింది కరెక్ట్ లైటింగ్ డిజైన్. డ్రెస్సింగ్ రూంలో లైటింగ్ బ్రైట్ గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అలంకరించుకొన్నప్పుడు అందంగా అలంకరించుకొన్నారా లేదా అన్నవిషయం తెలుస్తుంది. వైట్ సీలింగ్ లైట్స్, మిర్రర్ లైట్స్, చిన్న లెడ్ లైట్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
2. ఫర్నీచర్: మాడ్రెన్ డిజైన్ రూం అందంగా కనిపించాలంటే ఆకర్షించే ఫర్నీచర్ కూడా ఉండాలి. దాంతో ఆహ్లాదకరమైన వాతవరణం ఏర్పడుతుంది. డ్రెస్సింగ్ చేసుకోవడానికి ఇష్టపడుతారు. ఎలా అంటే ముఖ్యంగా డ్రెస్సింగ్ రూంలో అమర్చే పొడవాటి అద్దాలు వివిధ, డిజైన్లు, ఆకారాల్లో ఉంటే ఆకర్షణగా ఉంటాయి. డ్రెస్పింగ్ రూంలో అలంకరణకు ఉపయోగపడే చైయిర్స్ . కూర్చొని అలంకరించుకొనే చెయిర్స్ కూడా మాడ్రెన్ గా ఉండేలా చూసుకోవాలి. ఇంకా డ్రెస్సింగ్ రూంలో కలర్ ఫుల్ పిల్లోస్, కుషన్లు కూడా పెట్టి అలంకరించుకోవచ్చు.
3. వార్డ్ రోబ్ : డ్రెస్పింగ్ రూంలో ఉండాల్సిన మరొక ముఖ్యమైనటువంటి అలంకరణ వస్తువు వార్డ్ రోబ్. అలంకరించుకొనే వస్తువులు, దుస్తులు దాచుకోవడానికి వార్డ్ రోబ్ అవసరం. దీనివల్ల వాటివాటి ప్లేస్ లో సర్దుకోవడం వల్ల చూడటానికి చక్కగా కనిపిస్తుంది.
4. ఫ్లోరింగ్ అండ్ డ్రెస్పింగ్ కలర్: డ్రెస్పింగ్ రూం మరింత అందంగా కనిపించాలంటే ఫ్లోరింగ్ అదిరిపోవాల్సిందే. సిరామిక్స్ టైల్స్, లామినేటెడ్ ప్లోరింగ్ కాంక్రీట్ ప్లోరింగ్ తో ఆగదికి మరింత ఆకర్షణ చోటు చేసుకుంటుంది. అంతే కాదు ఇవి అమర్చుకోవడం వల్ల శుభ్రం చేయడానికి సులభమైతుంది.
5. వాల్ కలర్స్: డ్రెస్పింగ్ రూం కి వాల్ కలర్స్ నేచర్ కలర్స్ బాగు నప్పుతాయి. నేచ్యురల్ కలర్ వాల్ పేపర్స్ ను అమర్చుకొంటే చాలా అందంగా..ఆకర్షణీయంగా ఉంటుంది...
6. ఇంట్లో హెయిర్ పిన్నులు, కాటన్ బాల్స్, మానిక్యూర్ సామాగ్రి... తదితర వస్తువులను చక్కటి గాజు పాత్రల్లో వేసి ఉంచితే చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటాయి. గాజు పాత్రల్లో ఉంచటం వల్ల అవి స్పష్టంగా కనిపిస్తాయి. వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. వీటిని డ్రెస్సింగ్ రూం పక్కగానో, లేదా కప్‌బోర్డ్‌లోనూ సర్దుకోవచ్చు, షాంపూలు, సబ్బులు లాంటివి కూడా బాత్రూంలో ఇలాగే గాజు పాత్రలో పెట్టుకుంటే మంచిది. ఇకపోతే పరిమళాలను వెదజల్లే క్రొవ్వొత్తులు, ఎయిర్ స్ప్రేలు మీ మీ అభిరుచులకు తగినట్లుగా ఎంచుకుని రూంలలో వాడటం మంచిది.



Click it and Unblock the Notifications