For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆహ్లాదరకరమైన వాతావరణంలో గార్డెన్ పార్టీ సెలబ్రేట్ చేసుకోండిలా...

|

ఓ చల్లని సాయంత్రం మరియు ఓ ఆహ్లాదకరమైన వాతావరణంలో గార్డెన్ లో పార్టీ చేసుకొంటే ఎలా ఉంటుంది? వారాంతమూ ఆఫీసులు, ఉద్యోగాలతో, పిల్లలు కాలేజీ, స్కూల్ లతో అలసిసొలసినప్పుడు వీకెండ్ లో ఓ గార్డెన్ పార్టీని ఆరేంజ్ చేసుకొని ఫ్రెండ్స్ ని పిలుచుకొని పార్టీని సెలబ్రేట్ చేసుకొంటే వారమంతటి కష్టం ఒక్క రోజులో బలాదూర్ అవుతుంది. పార్టీ ఏర్పాటు చేయడానికి బయటకు వెళ్ళాల్సిన పనిలేదు. మన ఇంటి ఆవరణంలోనే పార్టీ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. అందుకోసం పెద్ద పెద్ద లాన్స్ లేదా బ్యాక్ యార్డ్ అవసరం లేకుండానే గార్డెన్ పార్టీని ఎలా అరేంజ్ చేయాలో అందుకు తీసుకోవలసిన జాగ్రత్తలేంటో చూద్దాం...

Tips to Organize A Garden Party...

టేబుల్: ఏ పార్టీ అయినా సరే ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చేది ఫుడ్ కే. కాబట్టి పుడ్ ను అరేంజ్ చేయడానికి ఓ మంచి రౌండ్ టేబుల్ లేదా చెక్క బల్ల టేబుల్ ను అమర్చుకోవాల్సి ఉంటుంది. అదికూడా ఎంత మంది పార్టీకి హాజర్ అవుతారో తెలుసుకొని మరీ ఏర్పాట్లు చేసుకోవాలి. లేదంటే పార్టీ మద్యలో అరేంజ్ మెంట్లు పెట్టుకొంటే, మీ, అక్కడి వచ్చిన ఇతరులకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. రౌండ్ టేబుల్ కి చుట్టూ కుర్చీలను అమర్చుకోవాలి. తర్వాత టేబుల్ మీద బ్రైట్ కలర్ టేబుల్ కవర్ ను పరిస్తే పార్టీ లుక్ ఏర్పడుతుంది. మనం అమర్చే టేబుల్, కుర్చీలే అన్ని రకాలైన గార్డెన్ పార్టీలకు ఆకర్షణీయంగా వచ్చిన అతిథులను ఆకట్టుకోగలుగుతాయి.

పువ్వులు: ఏ పార్టీ అయినా సరే పువ్వుల డెకరేషన్ లేకపోతే ఆ డెకరేషన్ పూర్తిగా వదా అయిపోతుంది. కాబట్టి గార్డెన్ పార్టీకైనా సరే పువ్వుల అరేంజ్ మెంట్స్ ఉండాల్సిందే. కాబట్టి టేబుల్ మధ్యలో లేదా టేబుల్ మూలల్లో ఫ్లవర్ వాజ్ స్టాండులను అలంకరించుకోవాలి. ఆ స్టాండులో రంగురంగుల పువ్వులతో అలంకరించుకోవాలి. మరియు కొన్ని ఫ్లవర్ పాట్స్ ను టేబుల్ మీద అమర్చుకోవచ్చు. ఈ ఫ్లవర్ అరేంజ్ మెంట్స్ కూడా పార్టీని హిట్ చేయడానికి ఒక ముఖ్యమైన కారణం.

లైట్స్ : ముఖ్యంగా పార్టీ ఎంత సేపు జరుగుతుంది. పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్ ఎంత సమయం గడుపుతారు అనే తెలియదు కాబట్టి లైట్స్ తప్పని సరిగా అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. గార్డెన్ లో లైట్స్ ను అరేంజ్ చేసేటప్పుడు ఒక ప్రక్కగా అమర్చుకోవాలి. పార్టీ అరేంజ్ చేసే ముందుగానే ఎలక్ట్రీషియన్ ను పిలిపించుకొని లైట్స్ ను బుషెస్ కు లేదా చెట్టుకు అమర్చుకోవాలి. తర్వాత క్యాండిల్ లైట్స్ ను టేబుల్ మీద అక్కడక్కడు అమర్చి మీకు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు వెలిగించుకోవచ్చు.

షెడెడ్ కానోపీస్: దీన్ని అరేంజ్ చేసుకోవడం కూడా గార్డెన్ పార్టీకి ఓ కళే. ఇలా చేయడం వల్ల చాలా ప్రశాంత వాతవరణంను తలపిస్తుంది. ఇటు ఫ్రెండ్స్, అటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సంతోష పడుతారు.

బెంచెస్: పార్టీకి వచ్చే వారు ఫ్రేండ్స్ ముచ్చట్లు చెప్పుకుంటూ కొంత సమయం కాలక్షేపం చేస్తుంటారు. కాబట్టి వారికోసం బెంచెస్ ను అరేంజ్ చేయడం చాలా ఉత్తమమైన పని. కాబట్టి పార్టీ టేబుల్ పక్కను లేదా కొంచె దూరంలో ఉడెన్ బెంచెస్ ను అమర్చి దాని మీద కలర్ ఫుల్ కుషన్స్ ను అమర్చితే ఇక వచ్చిన ఫ్రెండ్స్ అక్కడ నుండి లేవరనుకోండి. కాబట్టి ఈ చిన్ని చిన్న మెలుకువలను పాటించి పార్టీ విజయవంతం చేసుకోవడంతో మీ ఫ్రెండ్స్, అతిథులు మీ దగ్గరకు మళ్ళీ మళ్ళీ రావాలను కోరిక, ప్రేమను కలిగి ఉంటారు.

English summary

Tips to Organize A Garden Party... | గార్డెన్ పార్టీ అదిరిపోవాలంటే...

A cool evening and a nice weather, what else can be a better excuse for throwing a nice garden party? Work on some garden party ideas to make your hangout with friends a huge success. There is nothing like a celebration in the premises of your own household. You do not necessarily need a huge lawn or backyard for working out your garden party ideas. A small patio or a backyard is also enough for a garden party. Check out some of these creative party ideas for a celebration in your garden.
Story first published: Tuesday, July 31, 2012, 12:05 [IST]
Desktop Bottom Promotion