For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బడ్జెట్ ను బట్టి ఫర్నీచర్ ఎంపిక చేసుకోవాలి?

|

Tips To Select Basic Furniture For New Home
సాదారణంగా మహిళలైన, మగవారైనా చదువు పూర్తి అయిన వెంటనే ఉద్యోగాల వేటలో పడుతుంటారు. తమ కొత్త జీవితాన్ని ప్రారింభిస్తారు. అయితే వారు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి కొన్ని ‘బేసిక్స్’ తెలుసుండాలి. అలాగే వారు చేరే ఉద్యోగంలో ‘బేసిక్’ సాలరీ ప్రధానం. ఇక్కడ ఎక్కువగా ‘బేసిక్’ అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. సమాజంలో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి కొత్త ఇంటికి కొన్ని బేసిక్ ఫర్నీచర్ తో కావాల్సి ఉంటుంది. కొత్త జీవితాన్ని మొదలు పెట్టి స్వతంత్రంగా బ్రతకాలనుకొన్నప్పుడు మొదట్లో ఖర్చును అంచనా వేసుకొని, ఇంటి ఏది అవసరమో అదే కొని తెచ్చుకోవాలి. ఎదైతే ఖచ్చితంగా ఇంట్లో ఉండాలనుకొంటామో అది మాత్రమే తెచ్చుకొంటే అనవసరమై ఖర్చు చేయాల్సిన పనుండదు. ముఖ్యంగా ఇంట్లో ఉండాల్సి సోఫా అని మీరు భావిస్తుంటే..ఇంకా ఏమైనా కావాలా ...?ఖచ్చితంగా మరొకటేదో కొనాలనిపిస్తుంది. ఏ రిఫ్రిజరేటరో..అలాంటప్పుడు మీకు అవసరమైన ఫర్నీచర్ ఏదో తెలుసుకొనేందుకు కొన్ని చిట్కాలు మీ కోసం..

లివింగ్ రూమ్: మీరు ఇప్పుడిప్పుడే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. అపార్ట్ మెంట్ లో నివసించాలనుకొంటున్నారు. అప్పుడు అపార్ట్ మెంట్ లో కామన్ డ్రాయింగ్ రూమ్ - డైనింగ్ రూం రెండు ఒకే ప్రదేశం కలిగి ఉంటుంది. అందుకు ముందుగా ఆ ప్రదేశంలో ఏం కావాలో ఆలోచించాలి. తర్వాత అక్కడికావాల్సిన ఫర్నీచర్ ను అతి తక్కువ ఖర్చుతో కూడినటువంటి ఫర్నీచర్ ఎంపిక చేసుకోవాలి. లివింగ్ రూంలో ముఖ్యంగా ఉండాల్సింది, కావాల్సింది సోఫా అయితే వెంటనే కొనకపోవడమే ఉత్తమం. ఎక్కువ ఖర్చుతో కూడుకొన్న ఫర్నీచర్ కొనకున్నా మొదట సౌకర్యవంతంగా ఉన్న కుషన్స్ అరేంజ్ చేసుకోవచ్చు. లేదా తక్కువ ధరలో సింపుల్ గా ఉన్న సోఫాను తెచ్చుకోవచ్చు. సోపా దగ్గ బేసిక్ ఫర్నీచర్ టేబుల్ అవసరం ఉంటుంది. దాని ప్లేస్ లో ఒక మంచి సాలిడ్ సెంటర్ టేబుల్ అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. చెప్పులు పెట్టుకోవడానికి షూర్యాక్స్ బయట దొరుకుతాయి. ఇది అవసరమే. అయితే మీ అవసరంమేరకు తెచ్చుకోవచ్చు.

డైనింగ్ (భోజన)ప్రదేశం: ప్రతి ఇంట్లో అందరూ కలిసే చోటు భోజనాల గదిలోనే. ఒక్కటిగా కలిసి భోంచేస్తారు కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఒక డైనింగ్ టేబుల్, కావాల్సిన కుర్చీలు ఆ ప్రదేశానికి అందంతో పాటు, సౌకర్యవంతంగా ఉంటుంది. కాబట్టి ఒంటరిగా మీ కొత్త జీవితానికి, కొత్త ఇంటికి ఏది అవసరమో వాటికి మాత్రమే ప్రాధాన్యతనివ్వండి. వెదురు, టేకు ఇలాంటి ఎక్కువ ఖరీదైనవి కాబట్టి టేబుల్ టాప్స్ కి తక్కువ ఖర్చుతో కూడిన గ్లాస్ టాప్స్ ఎంపిక చేసుకోవడం మంచిది. వంటగదిలో ఒక చిన్న టేబుల్ కావాలనిపిస్తే అందుకు ప్లాస్టిక్ టేబుల్ సరిపోతుంది. అప్పుడు డైనింగ్ టేబుల్ ను లివింగ్ రూంకు మార్చుకోవచ్చు.

పడకగది: ఎక్కువ సౌకర్యవంతంగా ఉండే ప్రదేశం, ఎక్కువ విశ్రాంతి తీసుకొనే ప్రదేశం పడకగదే కాబట్టి, అక్కడి ఇతరులు ఎవ్వరు ప్రవేసించరు కాబట్టి కొత్త జీవితాన్ని మొదలు పెట్టేటప్పుడు బెడ్ లేకపోయినా సరిపోతుంది. అందుకు బదులుగా ఫ్లోర్ పైన పరచుకొనే మంచి మన్నికైనటువంటి మాట్రస్ ను ఎంపిక చేసుకోవాలి. ఇది ప్రత్యేకంగా క్రింద ఉడ్ తో అమర్చి, ఒక్క బెడ్ కు మాత్రమే పరమితం చేయబడి ఉంటుంది. ముఖ్యంగా పడకగదిలో మీకు ఏం కావాలనుకుంటున్నారో వాటిని ఖచ్చితంగా తక్కువ ఖర్చులో నైనా తెచ్చి అమర్చుకోవాల్సి ఉంటుంది. వాటి ఎంపిక వుడ్ కాకపోయినా, మెటల్ లో దొరుకుతాయి. బెడ్ కు సైడ్ టేబుల్, నైట్ లాంప్ ఇటువంటి బెడ్ రూంలో తప్పనిసరిగా ఉండాల్సినవి. ఇలాంటి చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకొన్నట్లతే మీ కొత్త జీవితాన్ని అతి తక్కువ ఖర్చు ప్రారంభించి సుఖవంతంగా గడపొచ్చు. కాబట్టి మీకు ఎది అవరసరమో...ఏది అనవసరం బేసిక్ గా తెలుసుకొని కొత్త జీవితాన్ని ఆరంభించండి.....

English summary

Tips To Select Basic Furniture For New Home...! | కొత్తజీవితానికి కావాలి ‘బేసిక్స్’

We all start out lives with a basic salary that is strictly speaking 'basic'. So basic furniture is all we can afford at the beginning of a new life. To manage your finances well you have to choose the furniture for your new home in such a way that you buy only what is absolutely necessary. And how would you come to that conclusion? The key is to prioritize your purchases. For example, if you say you need a sofa, is there anything else you need more? Yes, a refrigerator.
Story first published:Thursday, May 17, 2012, 11:13 [IST]
Desktop Bottom Promotion