Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇంటి సౌందర్యానికి ట్రెడిషనల్ డెకరేషన్...!

హాల్, డ్రాయింగ్ రూముల్లో గోడలకు యాంటిక్ ఫొటోలు, పెద్ద పెయింటింగ్‌లు బాగుంటాయి. కుటుంబ సభ్యులు, ఆత్మీయుల ఫొటోలను బెడ్‌రూముల్లో పెట్టాలి.
యాంటిక్ ఫొటోలు, పెయింటింగ్‌లకు కాంబినేషన్‌గా యాంటిక్ ఉడ్ వర్క్ చేసిన సోఫా సెట్, షెల్ప్‌లు, టీపాయ్‌లు బాగుంటాయి. ఫొటో ఫ్రేమ్స్ కూడా ఉడెన్‌వి అయితేనే లుక్ వస్తుంది. తంజావూర్ పెయింటింగ్‌లు ట్రెడిషనల్ లుక్‌ని ఇస్తాయి. అతిథులు కూడా సాదరంగా ఆహ్వానిస్తున్న భావనకు లోనవుతారు.
సోఫాసెట్ మోడరన్‌గా ఉన్నట్లయితే డ్రాయింగ్ రూమ్‌లో గ్లాస్ పెయింటింగ్స్, గ్లాస్ షోకేస్‌లు బాగుంటాయి. షోకేస్‌లో స్వరోవ్‌స్కీ టాయ్స్ అలంకరించాలి. వాటి లాలిత్యం కంటికి హాయిని, ఇంటికి ఫ్యాన్సీ లుక్‌నిస్తాయి. కలర్ కాంబినేషన్ గురించి చెప్పాలంటే... గోడ, ఇతర ఫర్నిచర్ లైట్ కలర్‌లో ఉంటే షో పీస్‌లు బ్రైట్‌గా ఉండాలి. అప్పుడే చూపరుల దృష్టి వాటి మీద కేంద్రీకృతమవుతుంది.
ఫ్లవర్ అరేంజ్‌మెంట్: ఫ్లవర్ అరేంజ్‌మెంట్‌కోసం ప్రత్యేకంగా పూలను కొని అలంకరిస్తేనే ఇంటికి అందం వస్తుందనుకుంటే మాత్రం పొరపాటే. మన ఇంట్లో పూసిన ఏ పువ్వునైనా ఒక ఆకుతో కలిపి అలంకరిస్తే చాలు. అది గది అందాన్ని పెంచి తీరుతుంది. డైనింగ్ టేబుల్, సెంటర్ టేబుల్ మీద పెట్టే పాట్‌లలో ఫ్లవర్ అరేంజ్‌మెంట్ లోలెవల్‌లో ఉండాలి. టీవీ, కార్నర్ టేబుల్ మీద, కార్నర్ స్టాండ్ కోసం హైలెవెల్ ఫ్లవర్ అరేంజ్‌మెంట్ చేయాలి. బెడ్‌రూముల్లో ఫ్లవర్ వాజ్‌లు పెట్టవచ్చు కానీ పాట్‌లో నీటిని పోస్తే దోమలు వస్తాయి. కాబట్టి నీరు లేకుండా పూలను అమర్చుకోవచ్చు. బెడ్‌రూముల్లో పూలు సువాసన భరితంగా ఉంటే ఆహ్లాదంగా ఉంటుంది.
ఇండోర్ ప్లాంట్స్: డ్రాయింగ్‌రూమ్ కార్నర్, మెట్ల పక్కన ఇండోర్ ప్లాంట్ పెడితే బాగుంటుంది. అలాగే బాత్‌రూముల్లో చిన్న బాటిల్‌లో మనీప్లాంట్ పెడితే గదిలోని తేమను పీల్చుకుని బాత్‌రూమ్‌ను తాజాగా ఉంచుతుంది. బెడ్‌రూముల్లో మాత్రం పెట్టకూడదు.



Click it and Unblock the Notifications