Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మనస్సును ఆహ్లాదపరిచే ఫ్లోటింగ్ ఫ్లవర్స్

ఈ మధ్యకాలంలో అక్కడక్కడా ఫంక్షన్లలో పెళ్లిళ్లలో, పెద్ద పెద్ద ధనవంతుల ఇల్లలో ఎక్కువగా ఇలా పూలను అలంకరించిన పెద్ద పెద్ద ఫైబర్, ఇత్తడి, రాగి, ప్లాస్టిక్ తొట్టెలు చూస్తుంటాం. మరి మన నిత్య జీవితంలో మన ఇల్లలో కూడా ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఇళ్లలో అంత పెద్దగా పెట్టుకోవడం సాద్యం కాదు కనుక చిన్నె గిన్నెల్లో, రాగి, ఇత్తడి పల్లెంలో అలాగే అందంగా అలంకరించుకోవచ్చు.
ఫైబర్, గాజు, ఇత్తడి, రాగి బౌల్స్, లేదా కంట్లం ఉన్న తట్టలు నిండా నీటిని నింపి దాన్లో తాజా పూలనుంచి హాల్లో మద్యలో టీపాయ్ మీద లేదా ఇంట్లో ఓ కార్నర్ లోనో, లేదా పూజగది ముందరో ఉంచడం వల్ల ఆ ప్రదేశానికి అందం వస్తుంది. అయితే ఇక్కడ ఓ చిన్న చిక్కు వుంది. అదేంటంటే రోజు తాజా పువ్వులను అలంకరించి తీసేస్తే సరి లేదంటే అవి అప్పటికప్పుడు మంచి సువాసనలు వెదజల్లుతూ అందంగా అనిపించినా తర్వాత కొన్ని గంటల్లోనే వాడిపోతాయి.
అలా కాకుండా ఉండాలంటే కృత్రిమమైన తేలియాడే పువ్వులను పెట్టుకొంటే సరి. హాలు మధ్యలో నీటిలో తేలియాడుతున్న ఈ పూలను చూస్తే కంటికి, మనసుకూ ఆహ్లాదం చేకూరుతుంది. మనస్సు బాగో లేనప్పుడు ఇలాంటి సహజమైనటు వంటి మార్పులతో మనస్సు కుదుట పడటమే కాకుండా కొంత సేపు ప్రశాంతత చేకూరుతుంది. అందుకు కారణం పూలకూ, స్త్రీలకూ వున్న గాఢమైన అనుబంధం. కృత్రిమంగా దొరికే పువ్వుల రకరకాలుగా చూడముచ్చటైన రంగుల్లో... అంతకంటే అందమైన ఆకృతుల్లో లభ్యమవుతున్నాయి. ఇందులో గులాబీలు, తామరపువ్వులు, ముద్ద మందారం, గన్నేరు పువ్వులు ఇలా .. ఎంపిక చేసుకోవాలేగానీ మీ అభిరుచికి తగ్గట్లు మీ ఇల్లును బృందావనం చేసుకోవడమే. ఇలాంటి వాటిని బర్త్ డే, పెళ్ళికి, ప్రేమికుల రోజుకి బహుమతిగా కూడా ఇవ్వవచ్చు...



Click it and Unblock the Notifications