Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
గార్డెన్ లో ఆహ్లాదం... ఆనందం... సౌకర్యవంతం...!
సాధారణంగా ఇంటీరియర్ డెకరేషన్ లో ఇంటికి వేసే రంగులు, ఇంట్లో వినియోగించే ఫర్నీచర్, కర్టెన్లు, ఎంత ప్రాదాన్యతను ఇస్తాయో, ఇంటి బయట కూడా అంతే అందంగా అలంకరించుకొంటేనే ఆ ఇంటికి మరింత అందం చేకూరుతుంది. ఇంటి బయట అందమైన మొక్కలను పెంచడంతో పాటు లాన్ ఏర్పాటు చేసుకోవడం. రంగు రంగుల పూల మొక్కలను పెంచుకోవడంతో పాటు మొక్క గార్డెన్ లో మనం వినియోగించే ఫర్నీచర్ కూడా ప్రధాన ఆకర్షనే. ఇంటిలోపల ఫర్నీచర్ ఇంటికి ఎంత అందం ఇస్తుందో.. ఇంటి బయట గార్డెన్ లో వేసే ఫర్నీచర్ ఇంటి బయట దాంతో పాటు ఇంటికి అందం... ఆకర్షణ... ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిస్తుంది. ఇంటికి అందాన్నిచ్చే గార్డెన్ వల్ల ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుంది. మనస్సుకు ప్రశాంతతను చేకూర్చుతుంది.

చాలా మంది రోజంతా తమతమ దినచర్యలు ముగించుకొని ఇంటికి అలసి సొలసి ఇంటికి రాగానే కాసేపు సేదా తీరలానుకొంటారు. అందుకు ప్రశాంతమైన వాతావరణం కావాలి. అటువంటప్పుడు చిన్న గార్డెన్ అయినా సరే అందులో గార్డెన్ కు సరిపడే ఫర్నీచర్ తో డెకరేట్ చేసుకొంటే ఆ ఆహ్లాదాన్ని మీరు క్షణాల్లో పొందవచ్చు. ఇంట్లో వినియోగించే ఫర్నీచర్ కంటే అవుట్ డోర్ లో గార్డెన్ కు ఉపయోగించే ఫర్నీచర్ తక్కువ ఖర్చుతో కూడకొన్నటువంటిది. అందుకోసం వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. మీ స్తోమతను బట్టి మీ గార్డెన్ కు ఎటువంటి ఫర్నీచర్ నప్పుతుందో చూసుకొని, వాటి అవసంర మీకు ఎంత మరకూ ఉందో తెలుసుకొని తర్వాత గార్డెన్ ఫర్నీచర్ కొనుగోలు చేయాలి. గార్డెన్ లో ఎటువంటి ఫర్నీచర్ అందంగా, సౌకర్యవంతంగా, సేఫ్ గా ఉంటుందో చూద్దాం...
కేన్ ఫర్నీచర్: ఇంటి బయట గార్డెన్ లో వినియోగించవల్సిన ఫర్నీచర్ లో ఈ కేన్ ఫర్నీచర్ కూడా ఒకటి. కేను ఫర్నీచర్ చాలా ఏళ్ళ నుండి బాగా ప్రసిద్ది చెందినటువంటి ఫర్నీచర్ అందుబాటులో ఉన్నాయి. కేన్ ఫర్నీచర్ అవుట్ డోర్ వాతావరణానికి బాగా నప్పుతుంది. చిన్నగా ఉన్న మీ అవుట్ డోర్ గార్డెన్ కి రెండు అందమైన కుర్చీలు, ఒక రౌండ్ కాఫీ టేబుల్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా అదనంగా వేసుకోవాలనుకొంటే ఒక అందుమైనటువంటి స్టూల్ ని అరేంజ్ చేసుకోవచ్చు. ఈ కేన్ ఫర్నీచర్ కొంచెం ఖరీదు ఎక్కువైనా మన్నిక కలిగినవి. ఎక్కువ రోజులపాటు ఒద్దికగా మీ గార్డెన్ లో అమిరిపోతాయి.
స్టోన్ ఫర్నీచర్: స్టోన్ ఫర్నీచర్ అంటే ఒక రకంగా రాయిలో ఫర్నీచర్ షేప్ ను చెక్కడం. రాయిని ఎక్కువగా భవన నిర్మాణంలో వినియోగిస్తుంటారు. స్టోన్ తో నిర్మించినటువంటి ఇల్లు కొన్ని తరాల పాటు నిలిచి ఉంటాయి. మరి అటువంటి స్టోన్ తో ఫర్నీచర్ చేయించుకోన్నా మీ తదుపరి తరాలా వారి వరకూ కూడా అవి స్థిరంగా వుంటాయి. ఈ స్టోన్ ఫర్నీచర్ కు గ్రానైట్ లేదా ఇసుక రాయి బాగా నప్పుతాయి. సాధారణాంగా పార్కుల్లో, బీచుల్లో మీరు గమనించే ఉంటారు ఇలాంటి ఫర్నీచర్ ను. వీటి విలువ కూడా తక్కువగానే ఉంటుంది. స్వచ్చమైనటువంటి స్టోన్ తో కుర్చీలుగా కూడా మలుచుకోవచ్చు. ఇది ఏప్పుడూ చల్లగా ఉంటుంది.
ఐరన్ ఫర్నీచర్: అవుట్ డోర్ లో ఎక్కువ కర్చు ఎందుకు అనే ఆలోచనలు ఉన్నవారు. అతి తక్కువ ఖరీదుతో ఈ ఐరన్ ఫర్నీచర్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ఐరన్ ఫర్నీచార్ కూడా చాలా రోజుల వరకూ మన్నికగా ఉంటాయి. ఐరన్ ఫర్నీచర్ మీకు వివిధ ఆకృతుల్లో లభ్యం అవుతాయి. అయితే ఈ ఫర్నిచర్ అన్ని సీజన్లోను సౌకర్య వంతంగా ఉండదు. మరియు బీచ్ ప్రదేశాలలో నివసించే ప్రజలు ఈ రాట్ ఐరన్ ఫర్నీచర్ ను ఉపయోగించకపోవడమే మంచిది.
ఉడెన్ ఫర్నీచర్: ఉడెన్ ఫర్నీచర్ చెక్కతో తయారు చేయబడినటువంటి ఫర్నీచర్. ఉడెన్ ఫర్నీచర్ అంటే టేక్ తో తయారు చేసినవే గార్డెన్ లో ఉపయోగించాలనే రూల్ ఏమీ లేదు. ఎందుకంటే చెక్కతో తయారు చేసే ఫర్నీచర్ పై వాతావరణ ప్రభావం ఉంటుంది. వాతావరంలోని వేడి మరియు తేమ వల్ల అవి త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. మీరు ఉడెన్ ఫర్నీచర్ ను గార్డెన్ లో వినియోగించుకో దలుచుకొన్నప్పుడు అందుకు తక్కువ దరలో లభించే మన్నికైన ప్లైవుడ్ తో తయారు చేసినటువంటి
ఫర్నీచరు కుర్చీలు, టేబుల్ వంటివి అమర్చుకోవచ్చు. ఇవి తక్కువ ఖర్చు అయినా మీ జీవిత కాలం పాటు ఉంటాయి.
కాబట్టి అవుట్ డోర్ గార్డెన్ ఫర్నీచర్ కొనే ముందు కొన్ని సూచనలు పాటించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బయట వేసే ఫర్నీచర్ ఎండ, వేడి, గాలి, తేమ ఇలా అన్నిరకాలుగా ఆ ఫర్నీచర్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి తక్కువ ఖర్చుతో లభించే మన్నికైన ఫర్నీచర్ ను ఎంపిక చేసుకొంటే సరిపోతుంది. దాంతో మీ గార్డెన్ లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆశ్వాదించి ఆనందించవచ్చు.



Click it and Unblock the Notifications











