For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెడ్ రూమ్ ఆకర్షణీయంగా కనబడేందుకు 6 బెస్ట్ టిప్స్

|

మీ ఇల్లును తరచుగా చూస్తుండటం వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత పాతగా కనబడటం మొదలవుతుంది. అదే గోడ రంగు, అదే పాత కర్టెన్లు, కొన్ని సార్లు మీ మానసిక స్థితి మీద ప్రభావం చూపవచ్చు. మరి, అయితే మీ ఇల్లును కొన్ని మార్పులు, చేర్పులు చేయవలసిన సమయం ఆసన్నం అయినదని గుర్తించాలి. బహుశా మీ బెడ్ రూమ్ మరింత హాయిగా మరియు సౌకర్యవంతంగా కనిపించేలా మార్చుకోవాలి. ప్రశాంతమైన నిద్రకు ఒంటి తాజాదనం ఎంత ముఖ్యమో.. పడకగది సౌలభ్యము అంతే ముఖ్యం.. పడకగది అలంకరణలో ఇష్టాయిష్టాలకు అభిరుచులకు ప్రాధాన్యత ఇవ్వటంకంటే మానసకి ఉపశమనానికి ప్రాధాన్యం ఇచ్చేలా ఉండాలి. పడక గదికి సంబంధించి గోడల రంగులు, తులపులకు వేసే కర్టెన్లు, కిటికీలకు వేసే కర్టెన్లు లాంటివి కంటికి భారంగా కనిపించకుండా.. గదిలోకి వెళ్లగానే మనసుకు విశ్రాంతి కలిగించేలా అమర్చుకోవాలి.

అనుబంధాలతో అందంగా అల్లుకున్న పొదరిల్లు... అనే మాట స్థానంలో చక్కని ఇంటీరియర్ డిజైనింగ్ అనే మాట చేరింది. అందంగా, అధునాతనంగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఏ ఇంటిని ప్రస్తావించినా అందులో ఇంటీరియర్ డిజైనర్ శ్రమ, సృజనాత్మకత ప్రతిబింబిస్తుంటాయి. ఇట్లో అక్కడివి ఇక్కడ మరియు ఇక్కడి అక్కడ మార్పులు చేయడం వల్ల కొన్ని అద్భుతాలను చూడవచ్చు. గోడలకు డిఫరెంట్ కలర్స్ ను స్ప్లాష్ చేయడం , కర్టెన్లు, కుషన్లు, voila వంటివి మార్చుకోవడం వల్ల మీ పడక గది పూర్తిగా డిఫరెంట్ గా కనబడుతుంది. మీ బెడ్ రూమ్ డిఫరెంట్ గా కనబడాలంటే ఈ క్రింది చిట్కాలను పరిశీలించండి..

బ్రైట్ అండ్ కలర్డ్ కర్టెన్స్:

అలాగే గోడల రంగులకు సరిపోయేలా డోర్ కర్టెన్లు, విండో కర్టెన్లు అమర్చుకోవాలి. అయితే అన్ని కర్టెన్లు కూడా ఒకే రంగులో ఉంటే చూసేందుకు

బాగుండదు. కొన్ని రంగులకయితే వాటికి సరిపోయే రకం కర్టెన్లనే ఉపయోగించాలి. కర్టెన్లు ఎప్పుడూ బ్రైట్ గా ఉండేవి ఎంపిక చేసుకోవడం వల్ల ఈ గది ఫీల్ ఫ్రెష్ గా అనిపించవచ్చు.

ఫర్నీచర్:

రూమ్ పెద్దగా కనబడేలా ఫర్నీచర్ ను అరేంజ్ చేసుకోవాలి. బెడ్ రూమ్ లో కొన్ని స్టాటజిక్ ప్రదేశాల్లో అద్దాలను అమర్చుకోవడం ద్వారా ఆ గది మరింత పెద్దదిగా కనబడుతుంది. సోఫా కలర్, వాల్ కలర్, అలంకరణ వస్తువులు అన్నీ ఒకే రంగులో ఉండవు, కానీ ఏదో ఒక యూనిఫార్మిటీ ఉంటుంది. ఫర్నిచర్ అరేంజ్‌మెంట్, గోడలకు పెయింటింగ్ కలర్ సెలెక్షన్, కర్టెన్ సెలక్షన్, ఫ్లోరింగ్ కలర్ డిజైన్ సెలక్షన్‌వంటివి ప్రధానంగా ఉంటాయి. తర్వాత ఆర్ట్ ఎఫెక్ట్, డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి. వీటన్నింటినీ ఒక థీమ్‌తో అరేంజ్ చేయడమే ఇందులో నైపుణ్యం.

వాల్ అండ్ బెడ్స్:

గోడలకు ప్రకాశవంతమైనగానే ఉండాలి కానీ లైట్ కలర్సై ఉండాలి. అటువంటి కలర్స్ ను ఎంపిక చేసుకొని మార్చుకోవాలి . బెడ్ షీట్లు బోల్డ్ కలర్స్ లో ఉంటే ఆకర్షణీయంగా కనబడుతుంది. కాటన్ బెడ్ షీట్స్ ఎటువంటి ఎంబ్రాయిడరీ లేనటువంటి వాటిని ఎంపిక చేసుకోవడం వల్ల నిద్రించడానికి బెడ్ సౌకర్యవంతంగా ఉంటుంది.

ఫ్లవర్ అండ్ లాంప్స్:

తెల్లని తాజా పువ్వులతో అలంకరించిన గ్లాస్ వాజ్ చాలా ఆహ్లాదకరమైన మరియు మృదువైన లుక్ ను తీసుకొస్తుంది. టేబుల్ లాంప్స్ లేదా తల దగ్గర లాంప్స్ కు బదులు, బెడ్ లాండ్స్ ను ఫ్లోర్ మీద పెట్టుకోవాలి. ఫ్లోర్ లాంప్స్ చాలా అధునాతనంగా మరియు ఆకర్షణీయంగా కనబడుతాయి.

గాలి గంటలను లేదా కాలేజ్ ఫోటో:

విండోలకు గాలి గంటలు వేలాడదీయాలి. మీ ఇల్లు మరింత ఆహ్లాదకరంగా మరియు వ్యక్తిగతమైనదిగా మరియు సామాన్యమైన భావన ఇవ్వాలనుకుంటే మీ కాలేజ్ పోటోను ఫ్రేమ్ ను విండో గోడకు ఫిక్స్ చేయండి.

ఉడెన్ క్యాబినెట్ మరియు ఒక రగ్:

విశ్రాంతి లేదా విరామ సమయంలో మీరు చదివే బుక్స్ అరేంజ్ మెంట్స్ కోసం గ్లాస్ డోర్ అమర్చిన ఒక ఉడెన్ క్యాబినేట్ అమర్చుకోవాలి. అలాగే రూమ్ లో ఒక పెద్ద తివాచీని పరచడం వల్ల మరి ఆకర్షణీయంగా కనబడుతుంది.

ముగింపు:

మీ పడక గదిని అందంగా అలంకరించుకోవడానికి ఈ 6 ఉత్తమ పద్దతులు.

English summary

6 Ways To Revamp Your Bedroom | పడకగది ఆకర్షణగా ఉండేందుకు 6 బెస్ట్ టిప్స్

The look of your room often starts seeming old and mundane after a few years. The same wall colour and those same old curtains can sometimes weigh on your mood. Well, if that is the case then you perhaps need to make a few changes at home to make your bedroom look more cosy and comfortable.This means its time to revamp your bedroom.
Desktop Bottom Promotion