For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పడకగదిని మరింత రొమాంటిక్ గా మార్చండి..

By Super
|

బహుశా ఇంటిమొత్తంలో అత్యంత శృంగారం ఉండే గది ఇదే, పోద్దునపూట విశ్రాంతి తీసుకుని, రాత్రిపూట ఎక్కువ సమయం గడిపే ప్రదేశం. ఒక చిన్న సృజనాత్మకత, చాతుర్యం, వాయిద్యం - అద్భుతమైన ప్రేమ శైలికి ఉదాహరణగా ఒక కాఫీ-బల్ల పుస్తకాన్ని అనువదించడానికి ఒక ప్రాపంచిక స్థలంగా చేయవచ్చు.

వ్యక్తిగత ప్రదేశం

వ్యక్తిగత ప్రదేశం

గుహలాగా శ్రద్ధ తీసుకునే పడకగదిగా తయారుచేసుకున్న మీ వ్యక్తిగత ప్రదేశాన్ని అలసిపోయిన మీ శరీరానికి తిరిగి శక్తి తెచ్చుకోవడానికి మిమ్మల్ని మీరు చికిత్స చేసుకోవడానికి బాటరీలు లాంటి ప్రేమ, సౌకర్యం, కోరికలు ప్రియమైన, రక్షణ అనే అసమాన భావనలు కలిగిఉంటాయి.

 పడుకోవడానికి పెద్ద, వత్తయిన పరుపు

పడుకోవడానికి పెద్ద, వత్తయిన పరుపు

మీ దైనందిన ఒత్తిడికి దూరంగా హాయిగా విశ్రమించాలంటే మీ పడక గదిలో అడుగున్నర మ౦దం ఉండే పరుపుతో కూడిన విశాలమైన పెద్ద మంచం లేదా చూపరుల దృష్టిని కట్టిపడేసే నాలుగు బొమ్మలున్న పాత మంచం కానీ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఒత్తైన పరుపుల మీద పడుకోవడంలోనే ఒకలాంటి శృంగారం ఉంది.

మెత్తటి తలగడలు

మెత్తటి తలగడలు

నూతనంగా, కళాత్మకంగా, సృజనాత్మకంగా, అసాధారణంగా ఉండే తలగడల ఆకారాలు ఎంతో ఉపయోగపడే ఈ ప్రాంతాన్ని ఒక ప్రణయ పూర్వక వాతావరణంలోకి మార్చేస్తాయి.

హాయిగా ఉండే గది

హాయిగా ఉండే గది

సాధారణంగా లివింగ్ రూమ్ లో ఉండే ఫర్నిచర్ తో ఒక మూలను హాయిగా ఉండే అంతఃపురంలా మార్చుకోండి.

కిటికీ దగ్గర కుర్చీ

కిటికీ దగ్గర కుర్చీ

ఓ చిన్న కిటికీ లేకపోతే కింద బ్రాకెట్ల ఆధారంతో నాపరాయి లోనించి మలిచిన చిన్న అరుగును చేయిస్తే అది ఓ కిటికీ కుర్చీలా కానీ లేకపోతే పెట్టి కిటికీ లాగానీ తయారయి మీరు కులాసాగా సేద తీరడానికి లేక పుస్తకాలూ చదువుకోవడానికి పనికొస్తుంది.

మీకిష్టమైన రెస్టారెంట్

మీకిష్టమైన రెస్టారెంట్

30 అంగుళాల వ్యాసంతో గుండ్రంగా ఉండే బ్రేక్ఫాస్ట్ టేబుల్, రెండు కుర్చీలు ఉంటే మీ ఇంట్లో మిగతావారి నుండి దూరంగా ఏకాంతంగా మాట్లాడుకుంటూ భోజనం చేయడానికి బాగుంటుంది. మీ ఎదురుగా మీ ప్రియురాలితో ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగితే ఆక్షణం రోజంతా మిమ్మల్ని నడిపిస్తుంది.

సాగి పోవడం :

సాగి పోవడం :

గాజు, పింగాణీ వస్తువులతో అలంకరించిన డ్రెస్సింగ్ టేబుల్ మరింత ఆకర్షణీయంగా వుంటుంది, మంద్రమైన లైటింగ్, డిఫ్యూసర్ లోని సుగంధ తైలాలు గుబాళిస్తుండగా బెడ్ ట్రేలు కూడా పక్క మీదే విలాసంగా అల్పాహారం చేయడానికి వీలు కల్పిస్తాయి.

కియారోస్కురో లైటింగ్ :

కియారోస్కురో లైటింగ్ :

మంద్రమైన లైటింగ్, కొవ్వొత్తులు, డిఫ్యూసర్ లోని సుగంధ తైలాలు, దట్టమైన రంగులు కలిసి మీ గదిలో ప్రణయ సన్నివేశాన్ని సృష్టిస్తాయి. కిత్కీలకు కప్పే ముదురు రంగు తెరలు కూడా మీ నరాలు విశ్రాంతి పొందేలా చేసి మీ ప్రాణానికి హాయిగా ఉండేలా చేస్తాయి, దాంతో మీరు ప్రణయానికి మరింత సిద్ధంగా వుంటారు.

ఆర్ట్ గాలరీ :

ఆర్ట్ గాలరీ :

ప్రేమ సన్నివేశాలు, అందమైన జ్ఞాపకాలు ఇచ్చే ప్రదేశాల ఫోటోలు చుట్టూ ఉంచుకోండి - మీ లోని ప్రణయం బయటకు వస్తుంది, మిమ్మల్ని ఒక హాయిగొలిపే వాతావరణంలోకి తీసుకు వెళ్తాయి.

మీ అరణ్యానికి సరిపోయే రంగులు :

మీ అరణ్యానికి సరిపోయే రంగులు :

గులాబీ, ఎరుపు, ముదురు ఆకుపచ్చ, ముదురు నీలం, పింక్, నీలాకాశ వర్ణం, సముద్రపు పచ్చ, వంకాయ రంగు లాంటివి ప్రణయకారక రంగులు. ముదురు రంగుల పక్కనే లేత రంగులు కూడా ఉంచితే రిలాక్స్ అవడానికి, ప్రణయం కొనసాగించడానికి బాగుంటుంది.

అధ్యయనం :

అధ్యయనం :

ఒక పాత కాలపు రాత బల్ల, ఒక సౌకర్యవంతమైన కుర్చీ కలిస్తే పాత కాలంలో లాగా ఒక మూలకు చేరి ప్రేమలేఖ రాసుకోవడానికి బాగుంటుంది.

చిన్న బార్:

చిన్న బార్:

షాంపేన్ లేదా వైన్ చల్లబరచు కోవడానికి ఒక చిన్న ఫ్రిజ్ లో ఉంచుకు౦టే మీరు నిరంతరాయంగా పడక గదిలో సమయం గడపడానికి బాగుంటుంది.

వినోదం, విలాసం :

వినోదం, విలాసం :

ఒక టీవీ కూడా వుంటే మీకిష్టమైన షోలు, సినిమాలు కూడా చూడవచ్చు.

సరైసరైన దీపాలు వెలిగించండి :

సరైసరైన దీపాలు వెలిగించండి :

మెరిసే గాజు షాండిలియర్లు ఎడారిలో ఒయాసిస్సు చూసిన భావన కలిగిస్తాయి. దీపాలతో అలంకరించిన ఉష్ణ మండల చెట్లు, మొక్కలు ఒక ప్రత్యెక ప్రణయ సన్నివేశాన్ని కల్పిస్తాయి.

అద్దాలు

అద్దాలు

డ్రస్సర్ ల పైనా, టేబుళ్ళకు పక్కనా లాంటి అసాధారణమైన ప్రాంతాల్లో అద్దాలు వాడండి, నాట్యమాడే కొవ్వొత్తుల వెలుగు దాంట్లో ప్రతిఫలిస్తుంది.

షెల్వింగ్ :

షెల్వింగ్ :

చక్కటి అరలతో ఫాషన్ గా వుండే షెల్ఫ్ లు, స్మార్ట్ గా వుండే డ్రాయర్లు స్టేషనరీ, మొబైల్ ఫోన్ లు, వాటి చార్జర్లు దాచుకోవడానికి పనికి వస్తాయి.

చోటు మాక్సిమైజ్ చేసి, చెత్త తీసి వేయండి, కలలు కనండి.

చోటు మాక్సిమైజ్ చేసి, చెత్త తీసి వేయండి, కలలు కనండి.

హాయిగా విలాసంగా సేద తీరేందుకు సిద్ధంగా ఉండాల్సిన మీ ప్రణయ మందిరం తేలిగ్గా చేరుకునేలా, ఇరుగ్గా లేకుండా వుండాలి. చెత్త తీసివేసి చక్కగా సర్దుకొండి.

English summary

Add romance to your bedroom

This is perhaps the most romantic space in the house, where you spend the maximum time at night and lounge during the day.
Desktop Bottom Promotion