Latest Updates
-
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే!
వింటర్ లో వెచ్చవెచ్చగా మన ఇంటి అలంకరణకు చిట్కాలు
వింటర్(శీతాకాలంలో ఇంటిని డెకొరేట్ చేయడం చాలా ముఖ్యం . ఈ సీజన్ లో మనం ఎక్కువగా ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతుంటాం. శీతాకాలంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల చలి, చల్లగాలులు మన శరీరం మీద ప్రభావాన్ని చూపెండుతుంది. కాబట్టి, ఒక వెచ్చని వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకోవడం మనకు చాలా ఇష్టం మరియు ఎక్సైటింగ్ గా కూడా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో లేదా వర్షాకాలంలో కంటే వింటర్ సీజన్ లో ఇంటి అలంకరణ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
ఉదాహరణకు, వేసవి కాలంలో చాలా పల్చగా ఉండే కాటన్ కర్టెన్స్, ట్రాన్స్ పరెంట్ కర్టెన్స్ ను మీరు వేసవికాలంలో ఉపయోగించి ఉంటారు. అదేవిధంగా, శీతాకాలంలో మన ఇంటి ముఖ ద్వారం నుండి వచ్చే చల్లని గాలిని, చలి నుండి మన శరీరాన్ని కాపాడుకోవాలంటే చాలా మందంగా ఉండే కర్టెన్లను ఉపయోగించాలి. ఇలా మందంగా ఉండే కర్టెన్స్ ను ఉపయోగించడం వల్ల గది వెచ్చగా ఉంటుంది.
అదేవిధంగా, వేసవిలో చాలా బ్రైట్ కలర్స్ మరియు చూడటానికి అందంగా కనిబడే వాటిని, ఇంటి డెకరేషన్ కు ఎంపిక చేసుకుంటాం. అయితే శీతాకాలంలో, మీరు డార్క్ పెయింట్స్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా, వింటర్ సీజన్ లో తెలుపు లేదా గ్రే కలర్స్ చాలా క్లాసీ టచ్ ను అంధిస్తాయి. కాబట్టి మీరు మీ ఇంటిని శీతాకాలంలో మీకు అనుకూలంగా, గదులు వెచ్చగా ఉండేట్లు డెకెరేట్ చేసుకోవాలి.
వింటర్ సీజన్ లో మీరు ఎక్కువ ఇండోర్ లోనే గడపదల్చుకొన్నప్పుడు, సీజన్ బట్టి మీ ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి ప్రయత్నించండి. ఉదా: వేసవిలో మీ ఫ్లోర్ ను సాధాగా ఉంచేస్తుంటారు, అయితే వింటర్ లో మీ ఇంట్లో రంగ్ మ్యాట్స్ లేదా కార్పెట్స్ చాలా అవసరం అవుతాయి. మీ ఇంట్లోని చల్లని టైల్స్ లేదా, ఫ్లోర్ నుండి మీ పాదానలు రక్షించుకోవడానికి ఇలా చేసుకోవడం మంచది. వింటర్ సీజన్ లో మీ ఇంటిని మరింత వెచ్చగా మార్చుకోవడానికి మరికొన్ని చిట్కాలు మీకోసం ఇక్కడ అంధిస్తున్నాం....

1. ఫైర్ ప్లేస్:
శీతాకాలంలో, మీ ఇంట్లో కొంచెం వెచ్చని వాతావరణాన్ని కల్పించాలి. ఫైర్ ప్లేస్ లో కూర్చొని రిలాక్స్ అవ్వడం ఒక్కటే సరిపోదు. మీరు కూర్చొని కాఫీ త్రాగడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి, చదువుకొనే ప్రదేశం కూడా వెచ్చగా మార్చుకోవాలి.

2. రగ్గ్ మ్యాట్:
శీతాకాంలో మీ ఇంట్లో ఫ్లోర్ కూడా చాలా చల్లగా మారవచ్చు. కాబట్టి, మీ ఇంట్లో ఫ్లోర్ ను మందపాటి రగ్గ్ మ్యాట్ ను ప్లోర్ మీద పరవాలి. ఈ రగ్గ్ మ్యాట్ మీద మీరు కూర్చోవచ్చుకూడా..ఈ రగ్గ్ మ్యాట్ ను మీ లివింగ్ రూమ్ లో కూడా అరేంజ్ చేసుకోవచ్చు.

3. వైట్ థీమ్:
శీతాకాలంలో వైట్ కలర్ పెయింట్ థీమ్ చాలా అద్భుతమైన ఆలోచన. వైట్ సోఫో, వైట్ వాల్స్ మరియు వైట్ పేపర్ లాంథర్స్, వంటివి చాలా అద్భుతమైన డెకరేషన్ ఐడియా.

4. అవుట్ డోర్ డెకొరేషన్:
వింటర్ సీజన్ లో, ఉదయం పడే సూర్యకిరణాల్లో కూర్చొని సేదతీరాలనుకుంటారు . కాబట్టి మీ బాల్కనీలో కూర్చోవడానికి, కొన్నా చేర్లు, సోఫా వంటివి అరేంజ్ చేసుకోండి .

5. లాంథర్స్:
మీ ఇంట్లో ఇక వింటేజ్ చార్మ్ చాలా బాగుంటుంది. కాబట్టి ఈ డెకెర్ ఐడియాను ప్రయత్నించండి . బాల్కనీలో లాంథర్స్ ను అరేంజ్ చేయండి. అలాగే స్టడీ రూమ్ లో కూడా ల్యాంథర్స్ అరేంజ్ చేసుకంటే అందంగా , వెచ్చగా ఉంటుంది.

6. మందంగా ఉన్న కర్టెన్స్:
శీతాకాలంలో, ఇల్లు సాధ్యమైనంత వరకూ వెచ్చగా ఉంచుకోవాలి., అందుకు విండో, డోర్ కర్టెన్స్ ను మందంగా ఉన్నవాటిని ఎంపిక చేసుకోవాలి. అవి చూడటానికి అందంగాను మరియు చలినుండి మనల్ని రక్షించే విధంగాను ఉంటాయి.

8. చాండీలియర్:
ఇంట్లో మరింత వెలుగు నింపడానికి, ఇల్లు మరింత అందంగా కనబడేలా చేయాలి. ముఖ్యంగా, వింటర్ లో లైటింగ్ చాలా అందగా కనబడుతుంది. వింటర్ సీజన్ లో ఈ క్యాండీలర్స్ లైట్ల కంటే మరొకటి అందంగా అలంకరించలేరు.

9. బ్లాంకెట్లు(దుప్పట్లు):
శీతాకాలంలో, మీకు మందపాటి కర్టెన్స్ అరేంజ్ చేసుకోవడం వల్ల మీరు వెచ్చగా చాలా దగ్గరగా నిద్రపోవచ్చు. అలాగే ఉన్నితో తయారుచేసి దుప్పట్లు ఉన్నప్పుడు మరింతో స్టైలిష్ గా ఉన్నవి ఎంపిక చేసుకోండి.

10. పాట్ పొర్రీ:
ఒక అద్భుతమైన సువాసన ఇంట్లో వస్తుంటే మనస్సుకు ఇక అంతకంటే ఆహ్లదకరమైన వాతావరణం మరేముంటుంది. . కాబట్టి పాట్ పురి ఇట్లో మొత్తం ఒక అద్భుత సువాసనను వెదజల్లుతుంది.



Click it and Unblock the Notifications