For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్తగా పెళ్ళైన వారి కోసం గృహ అలంకరణ చిట్కాలు

|

వివాహం సీజన్ దగ్గరలోనే ఉంది. అందువలన మీ కొత్త జీవితం అర్థం చేసుకోవడానికి,ఇంట్లో స్థిరపడేందుకు ఉత్సాహం,అలాగే కొంత భయము ఉంటుంది. మీకు వివాహం అయ్యి మీ కొత్త ఇంటిలోకి మారినప్పుడు నడవటానికి ఎక్కువ ఖాళీలు ఉంటాయి. కాబట్టి వెంటనే ఖాళీలు కనపడకుండా భర్తీ చేయటం అవసరం.

నేడు అనేకమంది ఆధునిక జంటలు పూర్తిగా అమర్చిన గృహాలకు వెళ్ళుతున్నారు. అందువలన కొనుగోలు చేయటం కూడా సులభంగా అవుతుంది. అమర్చిన ఇళ్ళు అయితే నిమిషంలో మెటిరియల్ మరియు ఇంటి అందంను పెంచవలసిన అవసరం ఉండదు. అందువలన కొత్తగా వివాహం అయిన జంటలు ఈ గృహాలంకరణ సలహాలను మరియు మెళుకువలను తెలుసుకోవలసిన అవసరం ఉంది.

కొత్తగా వివాహం అయిన జంటలు వారి ఇంటిని ఆనందమయం చేయటానికి సులభమయిన గృహాలంకరణ చిట్కాలు కొన్ని ఈ కింద ఇవ్వబడ్డాయి. కొత్తగా వివాహం అయిన జంటలు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఇల్లు మీ సొంతం కానప్పుడు మీ ఇంటి కోసం ఎక్కువ వస్తువులను కొనుగోలు చేయకూడదు. మీరు ఒక అద్దె అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నప్పుడు ఖాళీలను పూరించడానికి తక్కువ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలి.

కొత్తగా వివాహం అయిన జంటలు ఈ గృహాలంకరణ చిట్కాలు మీ నూతన స్వర్గం రూపొందించడంలో మీకు గందరగోళం లేకుండా సహాయం చేస్తాయి. మీ కొత్త స్వర్గపు నివాసంలోకి వెచ్చదనం మరియు ప్రేమను తీసుకురావడానికి ఈ గృహాలంకరణ చిట్కాలు చాలా ఆసక్తిగా ఉంటాయి.

లివింగ్ రూమ్

లివింగ్ రూమ్

చిన్నగా సిద్దం చేసిన ఇంటిలో ఒక చిన్న సోఫాను అమర్చండి. కాబట్టి మీకు ఒక మంచి సోఫా సెట్ ఉన్నట్లయితే మీ గదిలో ఒక చిన్న కాఫీ టేబుల్ ను జోడించవచ్చు.

బెడ్ రూమ్

బెడ్ రూమ్

పట్టు కర్టన్లు మరియు మ్యాచింగ్ బెడ్ షీట్స్ వేస్తె మీ బెడ్ రూమ్ కు రొమాంటిక్ లుక్ వస్తుంది. మంచి లుక్ కొరకు మీ బెడ్ పక్కన ఒక ల్యాంప్ షేడ్ ఉంచండి.

బాత్రూమ్

బాత్రూమ్

బాత్రూమ్ క్యాబినెట్లు మీ బాత్రూమ్ లో ఉంచవలసిన అవసరం ఉంది. అంతేకాక టాయిలెట్ అమర్చడం, ఒక చెత్త డబ్బా, షవర్ కర్టన్లు మరియు అల్మారాలు వంటి ఉపకరణాలు ఉండవలసిన అవసరం ఉంది.

వరండా

వరండా

మీ వరండాను మొక్కలు మరియు లతలతో అందంగా అలంకరణ చేయవచ్చు. మీరు బాగా అలసినప్పుడు ఇక్కడ కొంత సమయం విశ్రాంతి తీసుకోవచ్చు. కొత్తగా వివాహం అయిన జంటలు కూడా శుభం మరియు ఆనందం కోసం ఒక చిన్న నమ్మకంతో తమ జీవితాన్ని కలిసి ప్రారంభించవచ్చు. గాలి వీచినప్పుడు గంటల సవ్వడి కొరకు మీ వరండా లో ఒక గోల్డెన్ టోడ్ ను ఉంచండి.

పూజ గది

పూజ గది

మీ ఇంటిలో పూజ గదిని ప్రధాన గదులలో ఒకటిగా చెప్పవచ్చు. మీరు ఎల్లప్పుడూ పూజ గదిని శుభ్రంగా మరియు చక్కగా ఉంచాలని గుర్తుంచుకోండి.

వంటగది

వంటగది

మీకు మీ వంటగది నిర్వహించడానికి వీలుగా చిన్న వంటగది ఉండటం ఉత్తమంగా ఉంటుంది. మీ వంటగదికి ముదురు రంగులు వేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మీ భర్త కోసం సిద్ధం చేసే ఆహారంలో అనుకూలత బయటకు తీసుకురావడానికి సహాయపడుతుంది.

భోజనాల గది

భోజనాల గది

కొత్తగా వివాహం అయిన జంటలు ఉత్తమ గృహాలంకరణను అనుసరించడానికి భోజనాల గది విషయానికి వచ్చేసరికి టేబుల్ అమరికకు ఒక ప్రకాశవంతమైన రంగు గల టేబుల్ వస్త్రంను ఉపయోగించవచ్చు. డైనింగ్ టేబుల్ పై గాజు గ్లాస్ లను అందంగా బోర్లించాలి.

ప్రైవేటు గదులు కోసం

ప్రైవేటు గదులు కోసం

చాలా జంటలు ఎక్కువగా ఒక ప్రైవేట్ గదిని ఒక 'డెన్' అని పిలుస్తారు. భాగస్వాములు వారు చేయాలనుకునే ప్రతిభను కలిగి ఉన్నప్పుడు ఈ ప్రైవేట్ గదిని ఉపయోగిస్తారు. ఉదాహరణకు కొత్తగా వివాహం అయిన జంటలలో కొంతమంది ఒక ఆర్ట్ గది లేదా బిలియర్డ్స్ గదులుగా ఉపయోగిస్తారు. అంతేకాక అక్కడ వారు కేవలం హ్యాంగ్ ఔట్ మరియు విశ్రాంతి తీసుకోవచ్చు.

English summary

Home Decor For The Newly Married

The marriage season is near and so we understand the excitement as well as nervousness to settle your new life and house. When you get married and shift into your new home you will walk into spaces which are empty and need to be filled up immediately so that it looks complete.
Desktop Bottom Promotion