Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
మీ ఇల్లును విశాలంగా మార్చుకోవడం ఎలా
ఒక చిన్న చదరపు అడుగుల వైశాల్యం గల ఇల్లును పరిమాణం మరియు స్థలం ప్రకారం పెద్దదిగా తయారు చేయవచ్చు. అదేవిధంగా ఒక పెద్ద చదరపు అడుగుల ఇల్లును పరిమాణం మరియు స్థలంలో చిన్నదిగా చేయవచ్చు. ఈ స్థలం మరియు ప్రాంతం మీరు అలంకరించేందుకు మరియు ఇల్లు సదుపాయం మీద ఆధారపడి ఉంటుంది. ఒక ఇల్లు చిన్నదిగా లేదా పెద్దదిగా కనిపించటం అనేది ఆ స్థలం యొక్క భ్రమ అని చెప్పవచ్చు.
మీ ఇల్లు పెద్దదిగా మరియు విశాలంగా చేయడానికి గృహ మెరుగుదల పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులలో గదిలో ముఖ్యంగా గది ఆకృతి,పెయింట్,ఫర్నిచర్ మరియు ఫర్నీచర్ యొక్క అమరిక వంటి అనేక చిన్న విషయాలు కూడా ఉంటాయి. మీ ఇల్లు విశాలంగా చేయడానికి మీరు ఆశ్చర్యపడే విధంగా క్రింద కొన్ని చిట్కాలు ఉన్నాయి.

1. లైట్స్
ప్రకాశవంతమైన మరియు పంపిణీ లైటింగ్ వ్యవస్థ ఉపయోగించడం వలన ఇల్లు పెద్దదిగా కనపడటానికి సహాయపడుతుంది. ఇది గది పెద్దది అనే ఒక భ్రాంతిని కలిగించడానికి సహాయపడుతుంది. ప్రకాశవంతమైన కాంతి మొత్తం స్థలంను ఆక్రమించి గది యొక్క ప్రతి భాగంను హైలైట్ చేస్తుంది. గది నిస్తేజంగా మరియు చిన్నగా కనిపించాలంటే కాస్త తక్కువ కాంతి గల దీపాలను ఉపయోగించాలి.

2. పెయింటింగ్
ఇంట్లో తేలికపాటి రంగులు మరియు అటువంటి షేడ్స్ ఉపయోగిస్తే ఇల్లు విశాలంగా కనపడుతుంది. తెలుపు,లేత గోధుమరంగు మరియు ఇతర వెచ్చని రంగులు ఉపయోగించుట వలన ఇల్లు పెద్దదిగా కనిపిస్తుంది. మీ ఇల్లు మంచి లుక్ మరియు విశాలంగా కనపడటానికి ఇది ఒక మంచి టెక్నిక్ అని చెప్పవచ్చు. మీ ఇల్లును విశాలంగా చూడాలంటే ఇంటికి పెయింట్ వేయటానికి తేలికపాటి షేడ్స్ ను ఉపయోగించండి. అదే రంగు గల వివిధ రకాల షేడ్స్ ను ఉపయోగించి కూడా మీ ఇంటిని విశాలం చేయవచ్చు.

3. ఫర్నిచర్
మీ ఇంటి అలంకరణ కొరకు తక్కువ మరియు సాధారణ ఫర్నిచర్ ఉపయోగిస్తే మీ ఇల్లు విశాలం చేయుటలో సహాయపడుతుంది. చేతి కుర్చీలు,ఫ్లోర్ సీటర్,సోఫా కమ్ బెడ్,మడత కుర్చీలు మరియు మడత డిన్నర్ టేబుల్లను ఉపయోగించి స్థలంను చాలా ఆదాచేయడానికి మరియు స్థలం పెద్దదిగా కనపడేలాగా మాయ చేయవచ్చు. పెద్ద ఫర్నిచర్ స్థానంలో సౌకర్యవంతమైన మరియు చిన్న ఫర్నిచర్ ను భర్తీ చేయాలి. ఇది మీ ఇంటిని విశాలం చేయటానికి ఒక మంచి మెరుగుదల పద్ధతి అని చెప్పవచ్చు.

4. అవసరం లేని వస్తువులు
మీరు ఫర్నీచర్ మరియు ఉపయోగం లేని వస్తువులను ఎప్పటికప్పుడు తిసివేస్తూ ఉండాలి. ఇంట్లో అదనపు స్థలాన్ని ఆక్రమించే అవసరంలేని మరియు పాత ఫర్నీచర్ ముక్కలు,బట్టలు మరియు ఇతర గృహోపకరణాలను తొలగించాలి. మీరు ఇంటి నుండి అవసరం లేని వస్తువులను తప్పనిసరిగా తొలగించాలి.

5. అద్దాలు
ఈ పాత ఇంటి ఆకృతి మార్చి అలంకరించేందుకు మరియు విశాలం చేయటానికి మెరుగైన సాంకేతికతను ఉపయోగించాలి. అద్దాలు ఒక పాత కాలం నాటి అంతర్గత అలంకరణలో భాగంగా ఉన్నాయి. ప్రతి అద్దం ఇతర కోణాల్లో ఉంచితే ఇల్లు విశాలంగా ఉందనే భ్రమ కలుగుతుంది. అద్దాలు మీ ఇంటికి విశాలంగాను మరియు 70 తరానికి చెందిన లుక్ తో నిరాడంబరత మరియు గాంభీర్యంను చూపిస్తుంది.

6. వీటితోపాటుగా కొన్ని చిన్న గృహ మెరుగుదల చిట్కాలు
వీటితోపాటుగా కొన్ని చిన్న గృహ మెరుగుదల చిట్కాలు మరియు కొన్ని ఇతర చిన్న మార్పులు మీ ఇంటిని విశాలంగా కనిపించేలా చేస్తాయి. అటువంటి చిన్న ఇంటి మెరుగుదల సూచన ఏమిటంటే పై కప్పుకు ప్రకాశవంతంగా రంగులు ఉపయోగించాలి. ఇతర చిట్కా ఏమిటంటే ఇంటి కొరకు తక్కువ అలంకరణ మరియు తేలికపాటి వస్తువులను ఉపయోగించాలి. విండో కర్టెన్లను తెరిచి ఉంచటం వలన ఇల్లు పెద్దదిగా మరియు విశాలంగా కనపడుతుంది.
ఈ కొన్ని చిట్కాలను ఇంటి మెరుగుదల కోసం ఉపయోగించవచ్చు. వాటిని ఉపయోగించటం వలన మీ తక్కువ చదరపు అడుగుల ప్రాంతంలో ఎక్కువ విశాలంగా ఊహించిన దాని కన్నా ఎక్కువగా కనపడటానికి సహాయం చేస్తుంది. మీరు ఈ కొన్ని చిన్న చిట్కాల నుండి సహాయం పొంది మీ ఇంటిని మరింత అందమైన మరియు విశాలంగా చేసుకోండి.



Click it and Unblock the Notifications