For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ..కలర్ ఫుల్ ముగ్గులతో కళకళలాడాల్సిందే...

|

రంగోలి అంటే ముగ్గులు వేయడం. కలర్ ఫుల్ గా ముగ్గులు వేయడం అనేది కూడా ఓ మంచి కళ. ఇంటి ముంగిళ్ళలో వివిధ రాకలుగా ముగ్గులు వేస్తేరు. చుక్కలు పెట్టి, చక్కలు పెట్టకుండా..డ్రాయింగ్ లా, గీతలు గీయడం ఇలా పలు రకాలు ఉన్నాయి. ముగ్గులు పెట్టాలంటే క్రియశీలకమైన సజనాత్మకత కలిగి ఉండాలి. రంగోలిని బియ్యం పిండితో వేస్తారు. ఆ ముగ్గులు మరింత కలర్ ఫుల్ గా బ్రైట్ గా కనబడాలంటే వాటికి వివిధ రకాల రంగులు కలుపుకొని షేడ్ చేస్తారు.

మరి సంక్రాంతి సంబరాలు దగ్గరలో రానున్నాయి కాబట్టి ప్రతి ఇంటి ముందు కలర్ ఫుల్ ముగ్గులతో ప్రతి ఇల్లు కళకళలాడాల్సిందే . సంక్రాంతి అనగానే ముందుగా మనకి గుర్తు వచ్చేవి ముగ్గులు. రంగుల హరివిల్లుముత్యాల ముగ్గులు..రత్నాల గొబ్బెమ్మలు..మహిళల కళాదృష్టికి చిహ్నంగా ముంగిళ్ళ ముగ్గులు పెడతారు. ధనుర్మాసం నెల పెట్టింది మొదలు సంక్రాంతి పండుగ దాకా ప్రతి ఇంటి లోగిలి రకరకాల ముగ్గులతో కళకళలాడుతాయి. సంక్రాంతి పండుగ రోజున ఆడపిల్లలు ముగ్గుల మధ్యన అందంగా గొబ్బిళ్లను తీర్చి దిద్ది, వివిధ రకాల పువ్వులతోటి గొబ్బెమ్మలను అందంగా, ఆకర్షణీయంగా అలంకరిస్తారు.

ధనుర్మాసం ఆరంభం నుండే - ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను రంగవల్లులు, గొబ్బెమ్మ లతో అలంకరిస్తారు. ముగ్గులు వేయటానికి ప్రత్యేకంగా బియ్యపు పిండిని వాడతారు. పేడ కళ్లాపి ముంగిలిలో తోచిన ముగ్గును ముచ్చటగా తీర్చిదిద్దితే! ఎలా కుదిరినా వర్ణశోభితమే! ఎందుకంటే, అది మనం స్వయంగా 'ముగ్గు' ఓడ్చి తీర్చిదిద్దిన వర్ణచిత్రం! నేలమ్మ నుదుట తిలకంలా శోభిల్లే రంగవల్లికలు మనసుకు పంచే ఆహ్లాదం చెప్పతరం కాదు. అనుభవంతో తెలుసుకోవాల్సిందే! మరి అలాంటి ముగ్గులు కొన్ని తిలకిద్దామా....

పువ్వులు-క్యాండిల్స్ తో రంగరించిన రంగోలి: ఈ కలర్ ఫుల్ ముగ్గు పువ్వులతో అలకరించినది. ముఖ్యంగా పింక్, రెడ్ మరియు ఎల్లో కలర్ ఈ ముగ్గుకు ప్రత్యేక ఆకర్షణ. మిగిలిన కలర్స్, గ్రీన్, బ్లూ,ఆరెం, ఎల్లో వంటివి కలర్స్ ను బియ్యం పిండితో కలిపి ముగ్గులా గీచి వాటిలో షేడ్ చేసినవి. ఈ కలర్ ఫుల్ ముగ్గు చుట్టూ క్యాండిల్స్ ఈ ముగ్గును మరింతో ఆకర్షణీయంగా కనబడటానికి ఉపయోగపడుతుంది.

ఫ్లవర్ రంగోలి: ఇది మరో అందమైన రంగోలి డిజైన్. సంక్రాంతి సెలబ్రేషన్ ను ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఈ ముగ్గును పూర్తిగా తాజా పువ్వుల రేకులతో అలంకరించబడినది. కలర్స్ ను మిక్స్ చేసి ముగ్గులను షేడ్ చేయడం కంటే ఈ ఫ్లవర్ స్ప్రెడ్ రంగోలి చాలా అద్భుతంగా సువాసన భరితంగా చూడముచ్చటగా ఉంటుంది.

తామర మెరుపులు: ఈ సంక్రాంతికి ఇలా ఓ తామర పువ్వు ఆకారం కలిగి ముగ్గును ఇంటి ముందు తీర్చిదిద్ది ఇలా డార్క్ కలర్స్ షేడ్స్ చేయడం వల్ల మరింత లుక్ ను ఇస్తుంది. ఈ ముగ్గులో డార్క్ బ్లయూ డార్క్ రెడ్, డార్డ్ ఎల్లో, డార్క్ పింక్ కలర్స్ ఉపయోగించడం వల్ల చాలా అద్భుతంగా కనబడుతోంది.

సితార ముగ్గు: ఇది చూడటానికి చాలా సింపుల్ గా ఉన్న డిజైన్. ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ కు మీకు సమయం కుదరనప్పుడు ఇటువంటి చిన్న ముగ్గులను కలర్ ఫుల్స్ గా వేసుకోవచ్చు.

క్రియేటివ్ ఆర్ట్: ఇది మోడ్రన్ స్టైల్ రంగోలి. సంక్రాంతిలో గాలిపటాల ఆటలు తప్పనిసరిగా ఉంటాయి. కాబట్టి గాలిపటాలను పోలిన ఈ రంగోలి కలర్ ఫుల్ గా కనబడుతోంది.

కలర్ ఫుల్ స్టోన్స్ రంగోలి: ఈ సంక్రాంతి సంబరాలకు ఏదైనా కొత్తదనం కోరుకొనే వారు ఇలాంటి రంగోలిని ఎంపిక చేసుకోవచ్చు. ఈ రంగోలిని కలర్ ఫుల్ స్టోన్స్, మరియు ఉప్పుకు వివిధ రంగులు అద్ది ముగ్గుకు షేడ్ చేయబడినది.

సర్కిల్ ముగ్గు: ముగ్గులు వేయడానికి క్రియేటివిటి ఉండాలన్నాం కదా. క్రియేటివిటి అనేది ఇలా ఉండాలి. ఈ ముగ్గును ఎంత పెద్దగా అన్నా వేసుకోవచ్చు. ఇటువంటి ముగ్గులను ఇంటి ముఖద్వారం వద్ద మరియు పూజగది ముందర వేసుకోవచ్చు . ఈ ముగ్గులో డార్క్ గ్రీన్ షేడ్ చాలా అద్భుతంగా కనబడుతోంది. అలాగే మద్యలో కుంకుమపువ్వు కలర్, తెలుపు, బ్లూ కూడా ఎక్స్ ట్రాగా కనబడుతున్నాయి.

మార్బల్ మరియు స్టోన్ రంగోలి: సంక్రాంతి సంబరాలను కొంచెం స్టైలిష్ గా మార్చుకోవచ్చు. ఇలాంటి ముగ్గులు ఈ మోడ్రన్ యుగానికి చాలా బాగా నప్పుతాయి. ఈ ముగ్గుకు వైట్ మార్బల్ పీసులు, మరియు కలర్ ఫుల్ స్టోన్స్ తో అలంకరించి అద్భుతంగా ఆకట్టుకొనేలా చేస్తున్నాయి.

English summary

Rangoli Designs: Pongal Decorations.. | సంక్రాంతి శోభను తెచ్చే రంగవల్లులు...

Rangoli is a fine art that is commonly practiced in many Indian states. The colourful art is considered spiritual. That is why every occasion like Diwali or Pongal is incomplete without rangoli decorations.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more