Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వేసవిలో మదిని మైమరిపించే పూల అమరికలు...!

వేసవి మొదలైంది. ఎప్పుడూ చల్లదనంకోసమే పరుగెడుతుంది మనసు. ముఖ్యంగా పూలఅమరికలు మదిని మైమరిపిస్తాయి. అలసటను దూరం చేసి స్వాంతననిస్తాయి. అలాగని వీటికోసం బోలెడంత ఖరీదుతో పూవుల కొనాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉన్న పూలతోనే ఆహ్లాదకరమైన అమరికలు ఎలా చేసుకోవచ్చునో తెలుసుకుందామా!
పుష్పాలంకరణ అంటేనే... కేవలం కొన్ని పువ్వులు, ఆకులు, కొమ్మలను హడావిడిగా పిన్ హోల్డర్లకు గుచ్చేసి ఓ మూల అమర్చటం కాదు. ఎంత సాధారణంగా చేసినప్పటికీ, పువ్వుల అమరికకు ఓ ప్రత్యేకమైన డిజైను ఉండాలి. రంగు, సమతూకం, రిథమ్, దిశ లాంటివన్నీ తప్పనిసరిగా గమనించాలి. అప్పుడే అది అసలైన అలంకరణ అనిపించుకుంటుంది.
పువ్వుల అమరికలో పండ్లు వాడేటట్లయితే.. అవి కిందికి ఒంగి ఉండే కొమ్మలనే ఎంచుకోవాలి. మొక్కకు సంబంధించిన జీవప్రక్రియ మొత్తం కనిపించేలా.. కొమ్మలు, ఆకులు, పువ్వులు మాత్రమే కాదు... సంబంధిత మొక్కకు చెందిన మొగ్గల్ని సైతం వినియోగించాలి.
ఫ్లవర్ వాజుల్లో అమర్చిన నీటిని ప్రతిరోజూ మార్చినట్లయితే, పువ్వులు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. ముఖ్యంగా అలంకరణ చేస్తున్నప్పుడు హడావుడి పడకూడదు. నిదానంగా చేయాలి. లేదంటే మీ శ్రమ అంతా వృధా అవుతుంది.
గదిలో ఓ మూల ఓ టేబుల్‌పై చక్కని ఫ్లవర్‌వాజును ఉంచి అందులో మీ పెరట్లో ఆరోజు పూసిన పూవులతో పాటు, కాస్త అందంగా ఉండే ఆకుల్ని అమర్చండి. ఇప్పుడు ఎక్కడ చూసినా తంగేడు పూవులు కనువిందు చేస్తున్నాయి. గుత్తుల్లా పూసిన వాటి అందం వర్ణించడం అసాధ్యం. దానికి మ్యాచ్ అయ్యేలా మందారాలు, గన్నేరు లాంటి ఎరుపు రంగు పువ్వులు, ఆకులు, వాటికి సపోర్టింగ్‌గా, వెడల్పుగా ఉండే ఆకులను అమర్చండి చాలు. చాలా అందంగా కనబడుతుంది.
డ్రాయింగ్ రూంలో కాఫీ టేబుల్‌పై వెడల్పాటి పాత్రను ఉంచాలి. ముందు అందులో నీళ్లు పోయాలి. చుట్టూ డ్రెసీనా, లిమోన్నియం ఆకులు, వాటి పక్కన కార్నేషన్ పువ్వులు అమర్చాలి. మధ్యలో పసుపురంగు పువ్వులు అక్కడక్కడా ఆకర్షణీయంగా ఉంటుంది. అందరికీ ఇలాంటి పువ్వులు ఆకులు అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి రంగుమేళవింపును గమనించుకుని ఆ మేరకు మీకు అందుబాటులో ఉన్న పుష్పాలు, ఆకులు అమరిస్తే సరిపోతుంది. దీన్ని రేడియల్ అరేంజ్‌మెంట్ అంటాం. ఈ అలంకరణ గదిలో ఏ వైపు కూర్చున్నా కనిపించాలనేది గుర్తుంచుకోవాల్సిన అంశం.
పుష్పాలంకరణలో జాగ్రత్తలు:
1. మీరు చేసే పుష్పాలంకరణలో భాగంగా పువ్వుల్ని, ఆకుల్ని కొద్దిగా మెలితిప్పాల్సి వచ్చినా కూడా ఆ అలంకరణ మాత్రం పైకి చూస్తున్నట్లే ఉండాలి.
2. ఫ్లవర్‌వాజుల్లో అమర్చిన నీటిని రోజూ మారిస్తే పువ్వులు ఎక్కువరోజులు తాజాగా ఉంటాయి.
3. పుష్పాలంకరణ అనగానే కేవలం కొన్ని పువ్వులు, ఆకులు, కొమ్మలను హడావిడిగా పిన్‌హోల్డర్లకు గుచ్చేసి ఓ మూల అమర్చేయడం కానేకాదు. ఎంత సాధారణంగా చేసినప్పటికీ మీ పూవుల అమరికకు ఓ ప్రత్యేకమైన డిజైనుండాలి. రంగు సమతూకం, రిథమ్, దిశ లాంటివన్నీ తప్పనిసరి. అప్పుడే అది అసలైన అలంకరణ అనిపించుకుంటుంది.
4. మీరు చేసే పూవుల అమరికలో భాగంగా పండ్లు వాడుతున్నట్లయితే అవి కిందికి ఒంగి ఉండే కొమ్మల్నే ఎంచుకోవాలి.
5. మీ అలంకరణలో ఓ మొక్కకు సంబంధించిన జీవప్రక్రియ మొత్తం కనిపించాలి. అంటే కొమ్మలు, ఆకులు, పువ్వులు మాత్రమే కాదు, సంబంధిత మొక్కకు చెందిన మొగ్గల్ని సైతం అలంకరణలో వినియోగించడం తప్పనిసరి.
6. అలంకరణ చేస్తున్నప్పుడు హడావుడి పడకూడదు. నిదానంగా చేయాలి. లేదంటే మీరుపడిన శ్రమ మొత్తం వృధా అవుతుంది.



Click it and Unblock the Notifications