For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అసాధారణ గృహాలంకరణ చిట్కాలు

|

కొంతమంది ఇల్లు అందంగా ఉంచాలి అనుకుంటారు, కొంతమంది ఇంటిని అలంకరించడం వారి ప్రధాన అభిరుచిగా అనుకుంటారు.

గృహాలను అలంకరించాలి అనే ప్రేరణ కొన్ని అసాధారణ సమయాలలో వస్తుంది, కాబట్టి ముఖ్యంగా దానిని మీరు బైట వైపు మాత్రమే ఖచ్చితంగా చూడలేరు. ఈ ఆలోచనలు అసాధారణమైన, సరదాతో చేసేవి కావచ్చు. మీరు మీ ప్రయత్నాలు చేసి మీ సృజనాత్మకతను వెలికి తీయండి. కొన్ని కొత్త ఆలోచనలు రావచ్చు. మీరు వాటిని ప్రారంభించడానికి ఇక్కడ కొన్ని ఉపాయాలు ఇవ్వబడ్డాయి.

రూపురేఖల విషయం
రూపురేఖలతో కూడిన గోడ మీ ఇల్లు అసాధారణ దృష్టి పొందడానికి సులువైన మార్గాలలో ఒకటని ఇంటీరియర్ డిజైనర్ కేట్కి పస్సి భావించారు. "మీరు ప్రయత్నం చేసి, స్వంతంగా రూపు రేఖలు గల గోడను తయారుచేయవచ్చు - కేవలం హాండ్ పెయింట్ చేసి" అని ఆమె చెప్పారు.

అందమైన కాంక్రీటు
మీరు పూలకుండీ కోసం కాంక్రీటు పైపు భాగాన్ని ఉపయోగించవచ్చు. మీరు దాన్ని ఇంట్లో లేదా కిటికీ సిల్ వద్ద ఉంచవచ్చు. ఈ అసాధారణ పూల కుండీ ఒక అందమైన అంశంగా జోడించ బడుతుంది. "బోన్సాయి మొక్కలు మీ గదుల మూలాలను నింపుతాయి, వాటిని గుమ్మం వద్ద ఉంచితే ఇంట్లో తాజా పచ్చదనాన్ని పొందవచ్చు" అని కేట్కి చెప్పారు.

ఇప్పుడు దానిని షెల్ తో చేయండి
మీరు వేసవిలో బీచ్ వద్దకు వెళ్ళినప్పుడు కాండిల్ హోల్డర్స్ కోసం మీరు సేకరించిన షెల్ల్స్ ని ఉపయోగించండి. లోహపు పరికరంలో షెల్ లోపల మేకును గుచ్చండి. కరిగిన కాండిల్ వాక్స్ తో షెల్ నింపండి. మేకును సరిచేయండి. సెట్ చేసిన చోట, మీ వేసవి జ్ఞాపకాలను ఉల్లాసంగా గడిపేటట్లు అనుమతిస్తాయి. "అన్ని రకాల పరిమళాలను, రంగులను, కాండిల్ ఆకారాలను పొందవచ్చు" అని ఇంటీరియర్ డిజైనర్ మోహిత్ జి. నిషార్ చెప్పారు.

దాన్ని కాంతివంతం చేయండి
మీ డైనింగ్ టేబుల్ పైన కుడివైపు ఒక పెద్ద షాండిలియర్ వేలాడతీయండి. ఇది డిన్నర్ సమయంలో మీ అతిధులకు పరిమితమైన కాంతిని అందించడానికి మాత్రమే కాకుండా ఇది నేరుగా వచ్చే అనవసరమైన కాంతిని చక్కగా తొలగిస్తుంది. ఇది మీ భోజనాల గది టేబుల్ కి అసాధారణ చక్కదనాన్ని కూడా ఇస్తుంది.

బాగా ఉంచడం
ఆహార పదార్ధాలు టేబుల్ వద్దకు వచ్చేముందు ఆ ప్రదేశాన్ని చక్కగా ఉంచండి, ఆ ప్రదేశం వద్ద సువాసనతో కూడిన తీపి వస్తువులను చిన్న బౌల్స్ లో సర్దండి.

అన్నీ గ్లాసుతో కూడినవి
బైటి నుండి వచ్చే కాంతి లోపల ఉన్న అందాన్ని చూపించే సమయంలో కిటికీ సిల్ల్స్ పై ఉన్న పురాతన గాజు బాటిల్స్ మీ సేకరణను ప్రదర్శిస్తాయి. ఇది తటస్థంగా-పెయింట్ చేసిన గది రంగును ఆశక్తికరంగా జతచేస్తుంది.

టేబుల్ ఫ్రేమ్స్
చిన్న ఫ్రేములను ఫాన్సీ విందుకు ఆ స్థానంలో కార్డ్ హోల్డర్ లుగా ఉపయోగించవచ్చు. "ఆశక్తికర ఫ్రేములు పెట్టినపుడు వివిధ ఆకరాల అద్దాలను కూడా గొప్ప అలంకరణ వస్తువులుగా ఉపయోగించవచ్చని" మోహిత్ జతచేసాడు.

గోడపై నిచ్చెన
బాత్రూమ్ గోడకు ఎదురుగా చెక్క నిచ్చెనను ఆంచండి, దాని మెట్లపై తువాలును ఉంచండి. ఇది సాంప్రదాయ టవల్ రాక్ కు బదులుగా ఆ గదికి అదనపు ఆశక్తికరంగా ఉంటుంది.

ట్రంక్ కాల్
ఆ పాత సూట్కేస్ లేదా ఆ పెద్ద పాత ట్రంక్ ను ఒక కాఫీ బల్లలా ఉపయోగించుకోవచ్చు. సరే పదండి, సరదాగా అలంకరించబడి ఉంది!

English summary

Unusual home decoration Ideas


 There are some people who like doing up their homes and then there are some for whom decorating their homes is a major passion.
Story first published: Sunday, November 3, 2013, 9:40 [IST]