Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే!
ఇంట్లో అన్నివిధాల అనుకూలంగా ఉండేందుకు వివిధ మార్గాలు..!
ఈ కాలంలోని సంక్లిష్టమైన పరిస్థితులలో ఆరోగ్యం, భాగ్యం, బంధాల్లో వైఫల్యాలను విశ్లేషించుకోవడానికి మనకి సమయం దొరకడమే లేదు. వీటిలో చాలా వరకు సమస్యలు వాస్తు, ఫెంగ్ షుయ్ లోపాలకు సంబంధించినవే. ఇంట్లో అనుకూలతలను పెంచుకోవడానికి ఇక్కడ కొన్ని విధులు చెప్పబడ్డాయి. ఆనందమయ జీవనం కోసం వాస్తు, ఫెంగ్ షుయ్ నిపునునుడు ఇచ్చే కొన్ని ఉపాయాలు ఇవిగో :

మీ ఇంటి దిక్కులు కనుక్కోవడానికి ఎప్పుడూ మీ ఇంటి మధ్యలో కంపాస్ పట్టుకుని నిలబడండి. ఇంట్లోకి శక్తి ప్రవేశించే ముఖ ద్వారం ప్రధాన ద్వారమే. నైరుతి ముఖం గల ఇంట్లో ఉండకండి ఎందుకంటే అక్కడి నుంచి రాక్షస శక్తి ప్రవేశిస్తుంది, సంఘర్షణలను, దురదృష్టాన్ని తీసుకు వస్తుంది. మీ ఇంటికి ఇప్పటికే అలాంటి ప్రవేశద్వారం వుంటే గుమ్మం బయట రెండు హనుమంతుడి బొమ్మ వున టైల్స్ పెట్టి తేడా చూడ౦డి.

మందిరం లేదా పూజ గది వాస్తు నియమాలన్నిటి లోకి రాజు లాంటిది - దాన్ని ఈశాన్యంలో వుంచండి - అన్నీ దారికోస్తాయి. అలాగే ప్రార్ధన చేసేటప్పుడు తూర్పుకు అభిముఖంగా వుండండి.

వంటగది సౌభాగ్యానికి ప్రతీక, అందువల్ల ఆగ్నేయంలో వుండాలి. ఉత్తరం లేదా ఈశాన్యంలో వంట గది వుంటే ఆర్ధిక, ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇలా వుంటే పై కప్పు మీద మూడు కంచు గిన్నెలను తలక్రిందులుగా వుంచండి, కానీ పొయ్యి మీదికి రాకుండా చూసుకోండి.

యాజమాని పడక గది స్థిరత్వానికి ప్రవేశ ద్వారం కనుక నైరుతిలో వుండాలి. తల దక్షిణం లేదా పడమటికి వుంచి పడుకోవాలి. అయితే కుటుంబ యజమాని మాత్రం ఎప్పుడూ ఈశాన్యానికి తల పెట్టి పడకూడదు.

నరకంలోని శక్తి గల స్నానపు శాలలు, మరుగు దొడ్లు పడమటి వైపు గాని లేదా దక్షిణానికి గానీ వుండాలి. అయితే ఉత్తరం లేక ఈశాన్యంలో ఎప్పటికీ వుండకూడదు - ఎందుకంటే అలా వుంటే ఆర్ధిక, ఆరోగ్య, విద్యా సంబంధ సమస్యలు వస్తాయి.

మీ ఇల్లు శ్వాస పీల్చుకునే నాసిక లాంటిది గర్భగృహం. ఇది పరిశుభ్రంగా, విశాలంగా వుండాలి. ఇక్కడ గోడ వుంటే ఉదర సంబంధ, ఆర్ధిక సమస్యలు వుంటాయి కనుక ఈ గోడ మీద ఒక జీరో వాట్ బల్బ్ వుంచి 24x7 దాన్ని వెలిగించే వుంచండి.

ఏ దిక్కులోనైనా కోతలుంటే ఆ ఇల్లు కుంటుపడుతుంది - ముఖ్యంగా నైరుతి, ఉత్తరం, ఈశాన్యం, ఆగ్నేయంలలో ఇలాంటి కోతలుంటే తీవ్రమైన సమస్యలుంటాయి. ఈ కోతలకు, వాటి విరుగుడులకు సంబంధించిన చాలా రహస్యాలు వున్నాయి.

ఎరుపు, నీలం లాంటి ముదురు రంగులను ఇంటికి వేయకండి లేదంటే అవి మీ ఇంట్లో అనారోగ్యకర శక్తిని పె౦పొ౦దిస్తాయి.

మీ పడక గదిలో నీరు లేదా ఫౌంటెయిన్ బొమ్మలు ఉంచకండి. అవి మిమ్మల్ని దుష్ప్రభావాలకు గురి చేయవచ్చు.

మందిరాలు లేదా పూజ గది బీములు లేదా అలమరాల క్రింద ఉంచితే మీరు కూడా ఎప్పుడూ వత్తిడిలో వుంటారు.

ఉత్తరం లేదా ఈశాన్యంలో బరువైన వస్తువులు ఉంచకండి - అలా చేస్తే మీ ఆర్ధిక వనరులు నిరోధించబడతాయి.

వారానికి రెండు సార్లు సముద్రపు ఉప్పు నీటితో మీ ఇంటిని తుడుస్తుంటే మీ ఇంట్లోని దుష్ట శక్తులు దూరమౌతాయి.

మీ ఇంట్లో వాద ప్రతివాదాలు ఎక్కువగా వుంటే ఒక సంగీతం CD ని రోజుకు నాలుగైదు సార్లు విని ప్రశాంతతను పొందండి. తెల్లటి టీ వల్ల స్టాఫ్, స్ట్రెప్టోకోకస్ బాక్టీరియా, న్యుమోనియా, దంత క్షయం లాంటి ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.



Click it and Unblock the Notifications