Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ ఇంటి లోగిలికే వన్నె తెచ్చే అలంకరణ: చిట్కాలు
అందంగా నిర్మించుకున్న మీ ఆశల సౌధం లోపలి అలంకరణ అనేది చాలా ముఖ్యం. ఆ అలంకరణే మీ ఇంటికి వన్నె తెస్తుంది. డ్రాయింగ్ రూం, లివింగ్ రూం, డ్రెస్సింగ్ రూం, డైనింగ్ హాల్, కిచెన్, పిల్లల గది..... అన్నింటినీ కళాత్మంగా సర్దినప్పుడే వాటి అందం రెట్టింపు అవుతుంది. ప్రతీ వస్తువు అత్యంత కళాత్మకంగా ఉండాలి. గదులు వేరైనప్పటికీ, వాటి అలంకరణలో తేడా ఉన్నప్పటికీ, వాటి మధ్య సారూప్యం ఉంటే ఇంకా బాగుంటుంది.
ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే... మీ ఇంటికి మీరు చేసే ప్రతి పని అందాన్ని పెంచేవిధంగా వుండాలి. చూసిన వారు మెచ్చుకునేలా వుండాలి. వారిని సమ్మోహితుల్ని చేసేలా వుండాలి. మీ ఇంటి అలంకరణ, ప్రత్యేకించి మీ గదుల్లో ఏ ప్రాంతం ముఖ్యమయిందో గమనించండి. అక్కడ ఏవిధంగా అలంకరిస్తే బావుంటుందో ఆలోచించండి. అప్పుడు మీరే ఒక గొప్ప 'ఇంటీరియర్ డెకరేటర్' అవుతారు.

1. మీ డ్రాయంగ్ రూమ్‌లో కళాకాంతులు తెచ్చే ఇత్తడి ఫర్నిచర్, ఉడ్ ఫర్నిచర్‌ను అమర్చండి. సోఫాలు, మంచి కళాత్మకమైన పెయింటింగ్స్, చక్కటి క్రోటన్ మొక్కలు, ప్లవర్ వాజ్‌లు ఏవిధంగా ఉంటే మీ పక్కింటివారికి అసూయ కలుగుతుందో అలా అమర్చండి.
2. మీ హాలులో ఏవిధమైన సిటింగ్ ఏర్పాట్లు ఉంటే బావుంటుందో చూపండి. ఏ మ్యూజిక్ సిస్టం, టివి., వాల్ హ్యాంగింగ్స్, లైటింగ్ సిస్టం, సోఫాల దగ్గర నేలమీద సుతిమెత్తని తివాచీలు ఎలా ఏర్పాటుచేస్తే అందంగా ఉంటుందో చూడండి.
3. మీ ఇంటికి వచ్చిన అతిధులకు మీరు గోడలకు అమర్చిన పెయింటింగ్స్ చూసి విస్మయపడేలా ఉండాలి. వాటిని ఎక్కడ కొన్నారు అని అడిగి, మాకు కూడా ఇటువంటివి కొనిపెట్టండి అనేలా ఉండాలి.
4. ఇంట్లో రూముల గురించే కాకుండా పోర్టికో, ఇంటి ముందు వుండే ప్రదేశంలో, ఇంటి వెనుక పెంచే మొక్కలు, ఊయలకు గురించి కూడా కొంచెం శ్రద్ధ తీసుకోండి.
5. మీ ఇంటి వరండాలోనూ, ఇంటిముందువున్న ఖాళీ ప్రదేశంలోనూ పెంపుడు జంతువుల కొరకు కేజ్‌లు ఏర్పాటుచేయండి. వాటిలో రంగు రంగుల పక్షులు, చిలకలు, లవ్‌బర్డ్స్, మైనాలు లాంటివి తెచ్చి పెట్టండి.
6 . తాబేళ్ళు, కుక్కలు, కుందేలులాంటి జంతువులు కూడా మీ ఇంటి అందాన్ని పెంచుతాయి. సమాజంలో మీకు, మీ ఇంటికి ప్రత్యేకమైన గుర్తింపునిస్తాయి.
7. మీ ఇల్లు ప్రశాంత నిలయంగా ఉండేలా తీర్చిదిద్దడానికి మీ ఇంట్లోని ప్రతి గది కొలతలు మీకు క్షుణ్ణంగా తెలిసివుండాలి. అప్పుడే ఇంటి అలంకరణ విషయంలో స్పష్టమయిన అవగాహన కలిగివుంటారు.
8. మీ ఇంట్లోని ప్రతి గదిలో ఏదో ఒక ప్రాంతం ఫోకస్ పాయింట్‌లా వుండాలి. అందుకు ప్రతి గదిలోనూ ఒక ప్రదేశంలో మీ అభిరుచికి తగినట్టు ప్రత్యేకమైన శిల్పాలు, చిన్నపిల్లల బొమ్మలు, లైటింగ్ టేబుల్స్, షాండ్లియర్, ప్లవర్ పాట్స్‌లాంటివి అమర్చండి. చూసిన వెంటనే ఆకట్టుకునే విధంగా అలంకరించండి.
9. మీరు గదిలో అమర్చిన లైటింగ్ ఆ గది అందాన్ని మరింత ఇనుమడింపచేస్తుంది. మీ గది రంగును రిప్లెక్ట్ చేసే విధంగా బల్బులను అమర్చండి. మీరు అమర్చిన లైటు కింద చక్కటి రౌండ్ టేబుల్ వేసి దానిపై ఫ్లవర్ బేసిన్‌ను పెట్టండి. రంగురంగుల డిజైన్‌లో వుండే బేసిన్‌లో నీళ్ళు పోసి, దానిపై రంగురంగుల అందమైన పూలను అమర్చండి.
10. మీ ఇంటికి మీరు చేసే ప్రతి పని అందాన్ని పెంచేవిధంగా వుండాలి. చూసిన వారు మెచ్చుకునేలా వుండాలి. వారిని సమ్మోహితుల్ని చేసేలా వుండాలి.
మీ ఇంటి అలంకరణ, ప్రత్యేకించి మీ గదుల్లో ఏ ప్రాంతం ముఖ్యమయిందో గమనించండి. అక్కడ ఏవిధంగా అలంకరిస్తే బావుంటుందో ఆలోచించండి. అప్పుడు మీరే ఒక గొప్ప ' ఇంటీరియర్ డెకరేటర్ ' అవుతారు.



Click it and Unblock the Notifications