For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రశాతంగా నిద్రించడానికి ఈ 7 సౌకర్యాలు తప్పనిసరిగా అవసరం

|

ప్రస్తుతం ఇంటి అలంకరణలో ఎన్నో మార్పులు సంతరించుకొంటున్నాయి. మనిషికి సంబంధించిన ఏకైక ఏకాంత ప్రదేశం పడకగది. బెడ్‌ రూమును కూడా సరిగా పెట్టుకుంటేనే దానికి అందం, పొందిక ఏర్పడతాయి. బెడ్‌ రూమ్‌ అనేది నానా వస్తువులను కలిపి ఉంచే స్టోర్‌ రూమ్‌ కాదని గుర్తు పెట్టుకుంటే దాన్ని ఎలా ఉంచాలో అర్థమవుతుంది.

పనులతో అలసిపోయి రాత్రికి బెడ్‌రూమ్‌లోకి అడుగుపెడతాం. పడకగది మన బడలిక తీర్చి తర్వాతి రోజుకు సరిపడా శక్తిని పుంజుకునేలా చేయాలి. అలాకాకుండా ఆ గదిలో ఆదమరిచి నిద్రపోలేకపోతే అక్కడేదో లోపమున్నట్టే! సేద తీరటానికి అడ్డుపడే అంశాలేవో తెలుసుకుని వాటి స్థానంలో మనసుకు ఆహ్లాదం కలిగించే వస్తువులను అలంకరించాలి.

7 Ways To Make Your Bedroom Sleep Friendly

1. రంగుల ఎంపిక ఎంతో ముఖ్యం
బెడ్‌రూమ్‌ కోసం న్యూట్రల్‌, వార్మ్‌, ఎర్త్‌, పేస్టెల్‌ కలర్స్‌ను మాత్రమే ఎంచుకోవాలి. గోడలు, సీలింగ్‌, ఫర్నిచర్‌ అన్నీ ఈ రంగుల్లోనే ఉండాలి. బెడ్‌రూమ్‌ను ముదురు రంగులతో నింపేస్తే నిద్ర పట్టదు. కాబట్టి లేత రంగులనే ఎంచుకోవాలి. కర్టెన్లు, దుప్పట్లు కూడా లేత రంగులవే ఉండాలి. లేత గులాబీ, మిల్కీ వైట్‌, పేల్‌ ఎల్లో కలర్స్‌ బెడ్‌రూమ్‌లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. మనసుకు సాంత్వన చేకూర్చి విశ్రాంతిని అందిస్తాయి.

2. సౌకర్యవంతమైన పడక
బెడ్‌రూమ్‌ అంతటిలో పడకే ఫోకల్‌ పాయింట్‌. కాబట్టి బెడ్‌ను జాగ్రత్తగా ఎంచుకోవాలి. చిన్న సైజు బెడ్‌రూమ్‌లో విశాలమైన మంచం ఉంటే గది ఇరుకుగా తోస్తుంది. అలాగని మరీ చిన్న సైజు మంచాన్ని ఎంచుకుంటే గది బోసిపోతుంది. కాబట్టి బెడ్‌రూమ్‌ వైశాల్యాన్ని బట్టి మంచాన్ని ఎంచుకోవాలి. అలాగే దానికి తగిన సౌకర్యవంతమైన బెడ్‌ ఉండాలి.

3. వాల్‌ డెకార్‌ ఎంపిక
బెడ్‌రూమ్‌ గోడల అలంకరణ కోసం వాల్‌ పేపర్‌ వాడొచ్చు. లేదా ప్రత్యేకమైన టెక్స్‌చర్‌తో పెయింట్‌ చేయొచ్చు. ఈ రెండిట్లో దేన్నెంచుకున్నా అది లేత రంగులో ఉండాలి. అందంగా ఫ్రేమ్‌ చేసిన ఫోటోలు, పెయింటిగ్‌లు ఎలివేట్‌ అయ్యేలా ఉండాలి. కళాత్మకత ఉట్టిపడే ఆయిల్‌ పెయింటింగ్‌లకు బెడ్‌రూమ్‌ సరైన ప్రదేశం. వీటిని గోడలకు అలంకరిస్తే మనసు తేలికవటంతోపాటు గదిలో ప్రశాంతత నెలకొంటుంది.

4. సూటయ్యే ఫ్లోరింగ్‌ మెటీరియల్‌
మిగతా గదుల్లో ఎలాంటి ఫ్లోరింగ్‌ ఉన్నా బెడ్‌రూమ్‌లో మాత్రం సిరామిక్‌, గ్రానైట్‌, పాలరాతి ఫ్లోరింగ్‌ ఉండకూడదు. వీటికి బదులుగా లామినేటెడ్‌, వుడ్‌, కార్పెట్‌ ఫ్లోరింగ్‌ ను ఎంచుకోవాలి. పడక మీద నుంచి లేచి కాలు కిందపెట్టటానికి భయపడేలా ఫ్లోరింగ్‌ చల్లగా ఉండకూడదు. కాబట్టి సెరామిక్‌, గ్రానైట్‌, పాలరాతి ఫ్లోరింగ్‌ బెడ్‌రూమ్‌లో పనికిరాదు. వుడ్‌, ల్యామినేట్‌, కార్పెట్‌ ఫ్లోరింగ్‌ల వల్ల నేలతోపాటు గది కూడా వెచ్చగా ఉంటుంది. ఒకవేళ ఇప్పటికే చల్లని ఫ్లోరింగ్‌ బెడ్‌రూమ్‌లో ఉండి ఉంటే కనీసం పడక దిగే ప్రదేశంలోనైనా కార్పెట్‌ పరుచుకోవాలి.

5. ట్రాఫిక్‌ ఉండకూడదు
బెడ్‌రూమ్‌లో అమర్చిన వస్తువుల మధ్య కనీసం 24 అంగుళాల దూరం పాటించాలి. బెడ్‌రూమ్‌ ఫర్నిచర్‌ పొందికగా ఉండాలి. బాత్‌రూమ్‌కు వెళ్లే దారి నేరుగా ఉండాలి. ఫర్నిచర్‌ను తప్పించుకుని నడిచి బాత్‌రూమ్‌కు వెళ్లే పరిస్థితి ఉండకూడదు. ఇలా ఉంటే అర్ధరాత్రి బాత్‌రూమ్‌ కోసం లేచినప్పుడు వస్తువులు కాళ్లకు అడ్డుపడి పడిపోయే ప్రమాదం ఉంటుంది.

6. లైటింగ్‌ కూడా ముఖ్యమే
బెడ్‌రూమ్‌ మధ్యలో లైటింగ్‌ ఏర్పాటు పాత ఫ్యాషన్‌. పైగా ఈ ఏర్పాటు వల్ల కళ్ల మీద నేరుగా వెలుగు పడి నిద్రపట్టదు. దీని బదులుగా ల్యాంప్‌ షేడ్స్‌, అప్‌లైట్స్‌, పిన్‌లైట్స్‌ ఉపయోగించాలి. లేతగా, తక్కువ తీవ్రతతో ఉండే ఈ రకమైన లైట్లు నిద్రకు అనుకూలమైనవి.

7. గాలి, వెలుతురు అవసరం
బెడ్‌రూమ్‌ మన ప్రైవేట్‌ ప్లేసే అయినా గాలి, వెలుతురూ ప్రసరించే ఏర్పాట్లు ఉండి తీరాలి. తలుపులు, కిటికీలు ఎప్పుడూ మూసే ఉంచితే గదిలో దుర్గంధం పేరుకునే అవకాశం ఉంటుంది. పైగా అటాచ్డ్‌ బాత్‌రూమ్‌ కూడా ఉంటుంది కాబట్టి తేమ తయారవుతూ ఉంటుంది. ఈ వాసనలు వదిలించాలంటే గదిలోకి తాజా వెలుతురు, గాలి చొరబడేలా పగటివేళ కొద్దిసేపైనా కిటికీలు తెరుస్తూ ఉండాలి.

English summary

7 Ways To Make Your Bedroom Sleep Friendly


 A good night's sleep is perhaps the most essential requisite for a healthy body. Other than energising the brain and giving it enough fuel to remain thoroughly active, sleep helps in maintaining the metabolism rate and charging the immune system.
Story first published: Saturday, August 2, 2014, 15:22 [IST]
Desktop Bottom Promotion