Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
అవసరంలేదని పడేసే ప్లాస్టిక్ డబ్బాలూ పనికొస్తాయ్...
షాంపు అయిపోయింది..ఇక డబ్బాను ఏం చేసుకుంటాం..అంటూ దాన్ని ఓ మూలకు విసిరేస్తున్నారా! ఒక్క క్షణం ఆగండి మనం పనికిరావంటూ పడేసే షాంపూ, కండీషనర్ పౌడర్, వాటర్ బాటిల్స్, క్రీమ్ డబ్బాలతోఉపయోగపడే వస్తువులు ఎన్నో తయారుచేసుకోవచ్చంటే నమ్ముతారా?నమ్మలేరా? అయితే చూడండి. మీకు అవసరం లేని డబ్బాలను కొంత సమయం వెచ్చించి ఎలా అలంకరణ వస్తువులుగా మార్చొచ్చో..తెలుసుకోండి.
పారదర్శకంగా ఉండే షాంపూ డబ్బాలైతే ఇంటిని అలంకరించుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతాయి. వాటి పైభాగాన్ని తీసేయండి. అందులో మార్కెట్లో దొరికే రంగురాళ్ళు, గవ్వల్ని తెచ్చి..సగం దాకా నింపండి. తర్వాత దాన్నిండానీళ్ళు పోసి కిటికీ, టీపాయ్ లేదా టేబుల్ మీద అమరిస్తే ఆ అందమే వేరు .
కొంచెం పెద్ద సైజు డబ్బాలైతే అందులో నీళ్ళు పోసి నాలుగైదు పువ్వులను అందులో వేశారనుకోండి. ముచ్చటైన ఫ్లవర్ వాజు మీకోసం సిద్దంగా ఉంటుంది. మీకు నచ్చిన ప్రదేశంలో దాన్ని అలంకరించుకోవచ్చు. ఇంకా అందంగా కనిపించాలంటే, నీళ్లల్లో మీకు నచ్చిన రంగు నాలుగైదు చుక్కులు వేయండి. అప్పుడు చక్కగా రంగురంగులుగా ఉండే ఫ్లవర్ వాజ్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. డబ్బాలో నీళ్లకు బదులు తడి ఇసుక నింపినా బాగుంటుంది.

డబ్బా ఎలాంటివైనా... మనకు నచ్చిన రంగుతో పెయింట్ వేసి, సరికొత్త డిజైన్ ఆవిష్కరించి కాఫీటేబుల్ పై ఉంచితే చూడముచ్చటగా ఉంటుంది. దీన్ని ఖాళీగా ఉంచుకోకుండా అందులో కావాలంటే స్పూన్లు, ఫోర్కలు లాంటివి వేసుకోవచ్చు.
కొంత మంది మహిళలకు చీరలకు ఎంబ్రాయిడరీ చేయడమంటే చాలా ఇష్టం. ఇలా చేసేటప్పుడు చీరకలు కుట్టే పూసలు, బీడ్స్, కుందన్లు మొదలైనవన్నీ కలిసిపోకుండా ఉండాలంటే చిన్న చిన్న షాంపూ డబ్బాల్లో విడివిడిగా వేస్తే సరి. తర్వాత వాటన్నింటినీ కలిపి ట్రేలో సర్ధి ఓ షెల్ఫ్ లో ఉంచుకోండి. మీకు అందుబాటులో ఉండి సులభంగా వాడుకోవడానికి వీలుగా ఉంటుంది.
అలాగే ఇలాంటి ఖాళీ డబ్బాలకు చక్కగా పెయింట్ చేసి పెన్నులు, పెన్సిళ్ళు వేస్తే చక్కని పెన్ స్టాండ్ రెడీ అవుతుంది. దీన్ని పిల్లల రీడింగ్ టేబుల్ మీద పెడితే సరిపోతుంది.
మీకు స్వెట్టర్లు అల్లడం వస్తే ఆ డబ్బా సైజును బట్టి దానికి ఒక ఉన్ని తొడుగును అల్లి, తొడగండి...దీన్ని మీ బాత్రూంలో ఉంచితే మీ బ్రష్ లు, పేస్టుల లాంటివి వేసుకోవడానికి ఓ అందమైన స్టాండ్ సిద్దంగా ఉంటుంది. సింక్ పక్కన తగిలించుకోవాలనుకుంటే దానికి తగిన విధంగా అల్లుకుంటే సరి.
కొంచెం పెద్దడబ్బాలైతే వంటగదిలో అన్ని రకాల కత్తులు, చెంచాలు, కత్తెరలు వేసుకోవచ్చు. చిన్న చిన్న డబ్బాల్లో పిన్నులు, సూదులు, ఇనుప బోల్టులు, స్ర్కూలు లాంటి చిన్న చిన్న వస్తువులను దేనికదే విడివిడిగా వేసుకోవడానికి వీలుగా ఉంచుకోవచ్చు. వీటిని దాచెకోవడానికి ప్రత్యేకంగా డబ్బాలు కొనాల్సిన అవసరమూ లేదు.
ప్రతి ఒక్కరూ చేసే పనినే మనమూ చేస్తే వాళ్లకు మనకూ తేడా ఏక్కడుంటుంది? అందుకే షాంపూ , కండీషనర్, పౌడర్ ఫేస్ క్రీమ్ డబ్బాలను అందరిలా పడేయకుండా ఇంటికి పనికొచ్చే అలంకరణ వస్తువులను వినూత్నంగా తయారు చేసుకుంటే మన ప్రత్యేకత అందరికీ తెలుస్తుంది. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు చాలా అందంగా ఉన్నాయి. ఇవెక్కడ కొన్నావు?అనడిగితే నేనే చేశానంటూ గర్బంగా చెప్పుకోవచ్చు. మరి మీరేమంటారు.



Click it and Unblock the Notifications