For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాత్రూమ్ ను రొమాంటిక్ లుక్ తో కనబడేలా చేయటం ఎలా

By Lakshmi Perumalla
|

మీ భాగస్వామితో కలిసి ఒక శృంగారభరిత స్నానం చేస్తే మీకు అత్యంత సన్నిహిత మరియు ఉద్వేగభరిత సమయంగా ఉంటుంది. ఇది ఒక వెచ్చని వేసవి సాయంత్రం లేదా చల్లని శీతాకాలం రాత్రిలో ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటుంది. సరైన వాతావరణంలో ఒక అద్భుత సాహసము గల స్నానంను సృష్టించవచ్చు. ఈ రోమాంటిక్ స్నానం ఇంట్లో లేదా ఒక హోటల్ వద్ద ఉండవచ్చు.దీనిని మీరు పూల్ వైపు లేదా మీ ఇంటి పెరటిలో ఏర్పాటు చేయవచ్చు. ఇది మీరు మరియు మీ భాగస్వామి యొక్క సౌకర్యవంతము మీద ఆధారపడి ఉంటుంది. దీని కోసం ఉపయోగించటానికి శృంగార మరియు ఉద్రేక ఆలోచనలు ఉండాలి.

ఒక రొమాంటిక్ స్నానం కోసం అలంకరణ కొరకు కొన్ని సాధారణ సలహాలుగా ఎరుపు గులాబీలు, కొవ్వొత్తులు మరియు లైట్లు ఉన్నాయి. మీకు ఒక రొమాంటిక్ మూడ్ అభివృద్ధి మరియు మీ స్నానం ఇంద్రియ సంబంధముగా చేయటానికి అలంకరణ వ్యాసాలను ఉపయోగించాలి. ఈ మొత్తం సెటప్ అంతా మీరు సన్నిహిత మరియు సౌకర్యంగా చేయాలి. బాత్రూమ్ లో ప్రతి భాగంను ఉపయోగించి ఒక డ్రీం బాత్ ప్రదేశంగా మార్చండి. స్నానం అనేది రిలాక్స్ మరియు అందము రెండు రకాలుగాను ఉండాలి.

మరికొన్ని టిప్స్ తెలుసుకోవాలంటే: స్నానాల గది సౌందర్యం చూడతరమా...

మీరు ఒక హాట్ టబ్ స్నానం మీ భాగస్వామితో కలిసి చేయటానికి మరియు కొన్ని ప్రత్యేక వేడుకల సందర్భంలో ఉపయోగించటానికి కొన్ని అసాధారణ ఆలోచనలు క్రింద చర్చించబడ్డాయి: -

How to make your bathroom look romantic


1. రెడ్ లవ్ రోజ్

ఎరుపు రంగు మరియు గులాభి పుష్పం అనేవి ఎల్లప్పుడూ ప్రేమ మరియు శృంగారమునకు కనెక్ట్ చేయబడి ఉన్నాయి. మీరు మీ బాత్రూమ్ లో ఎరుపు రంగు కొవ్వొత్తులను ఉపయోగించవచ్చు. ఒక రొమాంటిక్ వాతావరణం ఏర్పాటు మరియు ప్రేమ చిహ్నం కొరకు ఉపయోగపడుతుంది. మీరు బాత్రూమ్ యొక్క ప్రవేశద్వారం వద్ద గులాబీ రేకులు ఉంచి సెంటర్ లో ఒక కొవ్వొత్తి ఉంచవచ్చు.మీరు ఒక స్నానపు తొట్టెలో నీరు ఉంచి ఎసెన్స్ కలపండి. అంతేకాక నీటిలో తెలుపు మరియు ఎరుపు రంగు రేకులను ఉపయోగించవచ్చు.ఒక రొమాంటిక్ బాత్ కొరకు మీ స్నానాల గదిని సిద్ధంగా చేయడానికి చాలా అందమైన మార్గాలలో ఒకటి.

2. లావెండర్ పాషన్

లావెండర్ ఒక కామోద్దీపన చేయగల మరియు ఉద్వేగభరిత భావాలు పెంచే ఒక పదార్దంగా పరిగణించబడుతుంది.నీటిలో రొమాంటిక్ మరియు ప్రశాంతమైన బాత్ వాతావరణం కొరకు లావెండర్ ఎసెన్స్ కలపండి. మీరు చాలా కొవ్వొత్తులను కూడా ఉపయోగించవచ్చు. లేకపోతె బాత్రూంలో డిమ్ పసుపు దీపాలను ఉపయోగించవచ్చు. లావెండర్ థీమ్ తో వెళ్ళి కుండీలపై ఆర్చిడ్ కర్రలు ఉపయోగించి బాత్రూమ్ అద్దం లేదా గది ప్రాంతంలో వాటిని ఉంచవచ్చు. లావెందర్ ఎక్కువగా ఉపయోగించడం మానుకోండి. ఎందుకంటే ఇది చాలా శక్తివంతముగా ఉంటుంది.

3. పెరటి స్నానం

మీ ఇంటికి భద్రత మరియు కవరింగ్ బాగా ఉంటే మీరు పెరటి ఓపెన్ లో మీ భాగస్వామితో కలిసి విశ్రాంతి మరియు ప్రశాంతమైన బాత్ చేసి ఆనందించవచ్చు. పెరటిలో ఒక స్నానపు తొట్టె కోసం ఏర్పాట్లు చేయవచ్చు. సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఇటువంటి రొమాంటిక్ ఆలోచనలు ఉత్తమంగా ఉంటాయి. స్నానపు తొట్టె సమీప ప్రాంతం శుభ్రం చేసి కొవ్వొత్తులు మరియు పువ్వులతో అలంకరించండి. మీరు స్నానపు తొట్టె పక్కన ఒక చిన్న టేబుల్ మీద ఒక షాంపైన్ బాటిల్ మరియు రెండు గ్లాస్ లను ఉంచవచ్చు.

4. స్విమ్మింగ్ పూల్

మీ ఇంటి లోపల ఒక ఈత కొలను కలిగి ఉంటే అద్భుతముగా ఉంటుంది. మీరు ఒక రొమాంటిక్ బాత్ చేయడానికి పూల్ వైపు మొత్తం అలంకరించవచ్చు.అనేక రంగులు,గుండె ఆకారంలో బుడగలు,రకరకాల ఆకారాలు మరియు పరిమాణం గల కొవ్వొత్తులను ఎక్కువగా ఉపయోగించండి. అంతేకాక కొంత నైస్ సంగీతం పెట్టండి. మీరు ఇక్కడ షాంపైన్ లేదా వైన్ ను ఉపయోగించవచ్చు.అనేక జంటలు కావాలని కోరుకొనే ఒక రొమాంటిక్ స్నానంగా ఉంటుంది.

5. సాధారణ సంగీతం

ఒక మంచి రొమాంటిక్ ఆలోచనగా సంగీతంను ఉపయోగిస్తారు.ఏ అలంకరణలు లేకుండా పరస్పరం ఒకరిని ఒకరు చూసుకోవటానికి తగినంత కాంతి కొరకు ఒకే ఒక కొవ్వొత్తిని ఉపయోగించండి. తక్కువ ప్రకాశము మరియు వినసొంపుగా ఉండే సంగీతం అనేవి అత్యంత శృంగారభరిత విషయం అని చెప్పవచ్చు. స్నానపు తొట్టెలో,ఒకే ఒక కొవ్వొత్తిని మరియు అందమైన సంగీతం - ఎక్కువ విశ్రాంతి మరియు రొమాంటిక్ గా ఉంటుంది.

Story first published: Thursday, January 9, 2014, 10:54 [IST]
Desktop Bottom Promotion