Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
గృహశోభ కోసం ఇంటీరియర్ లైటింగ్ డిజైనర్ ఐడియాస్
వెలుగులతో విరాజిల్లే ఇంట్లో దిగులుకు చోటే ఉండదు. ఎల్లవేళలా ఆ ఇల్లు సంతోషానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆఫీస్ నుంచి స్ట్రెస్ తో ఇంటికి రాగానే వెలుగులతో అందంగా అలంకరింపబడ్డ ఇల్లు ఒత్తిడిని నిర్ములించి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మరి దీనిని స్ట్రెస్ బస్టర్ అని ఎందుకనకూడదు? మనలో చాలా మంది వివిధ లైటింగ్స్ తో ఇంటిని అలంకరించి కాంతివంతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించరు.
ఒక్కసారి ఇంటీరియర్ లైటింగ్ గొప్పదనాన్ని తెలుసుకోండి. మీ ఇంటికి సూట్ అయ్యే లైటింగ్ ను ఎంచుకోండి. ఆయా గదుల అవసరాన్ని బట్టి లైటింగ్ ను చక్కగా వాడుకుంటే ఇల్లు స్వర్గంలా కనిపిస్తుంది.
ఈ ఆర్టికల్ లో ఇంటిని లైట్లతో వైవిధ్యంగా చక్కదిద్దుకునే తీరు వివరంగా తెలియజేయబడింది
లివింగ్ రూం/హాల్ : గెస్ట్ లు వచ్చినప్పుడు వారి దృష్టిని మొదటగా ఆకర్షించేది హాల్ అనే విషయాన్ని మీరు విస్మరించకూడదు. మీ ఇంటిపై వారు ఒక అభిప్రాయానికి రావడానికి హాల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఫ్యామిలీతో సమయం గడపడానికి, ఫ్రెండ్స్ తో అతిథులతో ఎక్కువ సమయాన్ని గడిపే ప్రదేశమిది. హాల్ లో లైటింగ్ పై ప్రత్యేక శ్రద్ద కనబరచాలి. మూడు లేదా నాలుగు కార్నర్స్ నుంచి లైటింగ్ పడే విధంగా ఎరేంజ్మెంట్స్ చేసుకోవాలి. డెకరేటివ్ ఐటెం ని హైలైట్ చేసే విధంగా లైటింగ్ ఉండాలి. సాయంత్రం రిలాక్స్ అవడానికి డిమ్ గా ఉండే లైట్లను ను ఏర్పాటు చేసుకోవాలి.

బెడ్ రూం : రిలాక్సేషన్ కు మొట్టమొదటిగా అందరూ ప్రెఫరెన్స్ ఇచ్చే గది బెడ్ రూం. అందుకు తగ్గట్టే బెడ్ రూం లో రిలాక్సేషన్ ను కలిగించే బెడ్ సైడ్ లాంప్స్ కి ప్రెఫరెన్స్ ఇవ్వండి. లైట్స్ ప్రశాంతంగా ఉన్నవి ఎంచుకోండి. బెడ్ సైడ్ లాంప్స్ దొరకకపొతే ఫ్లోర్ లాంప్స్ కి ప్రెఫరెన్స్ ఇవ్వండి. మీ బెడ్ ను ఫేస్ చేసి ఉన్న ఫ్రంట్ వాల్ పై కూడా దృష్టి పెట్టండి. ఆ వాల్ పై కూడా లైటింగ్ చక్కగా పడేలా ఏర్పాట్లు చేస్తే బెడ్ రూం కి అందమైన లుక్ వస్తుంది.

కిచెన్ : కిచెన్ లో వెలుతురు చక్కగా ఉండడం ఎంతో అవసరం. ఆహారాన్ని సిద్ధం చేసేటప్పుడు సరైన పదార్థాలను వాడుతున్నారా లేదా అని తెలుసుకోవడానికి వెలుతురు అవసరం. డిమ్మెర్ ఉన్న ఓవర్ హెడ్ లైటింగ్ కు ప్రాధాన్యతనివ్వండి. అండర్ కేబినేట్ లైట్స్ ను కూడా వాడవచ్చు. కిచెన్ కార్నర్స్ కి అలాగే సింక్ కి వెలుతురు సరిగ్గా చేరడానికి అమిత ప్రాధాన్యతనివ్వండి.

డైనింగ్ హాల్ : ఫ్యామిలీ గ్యాథెరింగ్స్ జరిగే ప్లేస్ డైనింగ్ హాల్ కాబట్టి ఇక్కడ సరైన వెలుతురు ఉండడం ముఖ్యం. అందమైన జ్ఞాపకాలకు డైనింగ్ హాల్ నెలవుగా మారుతుంది. అందరూ కలిసి చక్కాగా ముచ్చటించుకుంటూ భోజనం చేస్తారిక్కడ. గ్రాండ్ లుక్ కోసం డైనింగ్ టేబుల్ పైన షాన్డిలియర్ ని ఏర్పాటు చేసుకోండి.

బాత్ రూం : మిర్రర్ కి పైన మంచి లైటింగ్ ని ఏర్పాటు చేయండి. రిలాక్సింగ్ షవర్స్ కోసం బాత్ రూం లో సరైన వెలుతురు అవసరం. ప్రకాశవంతమైన వెలుతురు కోసం ఓవర్ హెడ్ లైట్ ను బాత్ రూంలో ఏర్పాటు చేసుకోండి.




Click it and Unblock the Notifications