Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
వేసవిలో మీరు మెచ్చేలా ఇంటి అలంకరణ
వేసవి సీజన్లో.. ఇంటికి పిల్లల స్నేహితులు, బంధువులు, అతిథులు వస్తుండటం సహజమే. ఇలా ఇంటికి అతిథులు వచ్చినప్పుడల్లా ఇంటిని సర్దుకుంటూ ఉండాలంటే బోలెడంత సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అలాకాకుండా, వీలు చూసుకుని ఇంట్లో దుమ్ముధూళి దులిపేసి అలంకరణలో కొద్దిపాటి మార్పులు చేసినట్లయితే, ఈ వేసవి సెలవుల కాలంలో ఇల్లు అప్పుడే అలంకరించినట్లుగా కనిపిస్తుంది.
ఇందుకోసం చేయాల్సిందల్లా... అన్ని గదుల్లో కాటన్ కర్టెన్లు వేసినా కూడా అందరూ కూర్చునే చోట మాత్రం కొంచెం వైవిధ్యం చూపిస్తే సరిపోతుంది. అంతగా వాడని బెనారస్ చీరలు, మెరిసే చున్నీలను కర్టెన్లపైన అదనపు అలంకరణలుగా చేర్చి చూడండి, తేడా ఇట్టే తెలిసిపోతుంది.

వేసవిలో ఇంటిని అందంగా ఆహ్లాదంగా ఉంచుకోవాలంటే.. ఇంట్లో చల్లదనం కోసం ఎయిర్‌కండీషన్ పెట్టుకోగానే సరిపోదు. వెంటిలేషన్ సరిగ్గా ఉందోలేదో చూసుకోవడం చాలా అవసరం. ఇంట్లో ఏసీ ఉందికదా అని తలుపులు కిటీకీలు మూతపెట్టడం లాభం లేదు. వాటిని తెరిచి ఉంచాలి.
మంచాలు, బెడ్ ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తే వాటిని తొలగించి నేలమీద పడుకోవడమే బెటర్. చెయిర్స్, టేబుల్స్ ని వీలైనంతవరకు తగ్గించుకోవాలి. ప్రాణవాయువు కోసం పూలకుండీలను గది మధ్యలో వుంచితే మంచిది.
అలాగే... గది గోడలమీద ఇప్పటివరకూ ఫొటోలున్నట్లయితే... ఇప్పుడు వాటి స్థానంలో సరికొత్త వాల్‌పోస్టర్లను అతికించాలి. లేదంటే, ఏవైనా చక్కటి కళాకృతులను అమర్చాలి. ఇప్పటిదాకా అలాంటిదే ఉన్నట్లయితే, మీ పాపాయిల అందమైన ఫొటోలను తగిలించేయండి.
వేసవిలో ప్రతిరోజూ ఇంటిముందు రెండుపూటలా నీళ్లు చల్లుతూ ఉండాలి. వేసవిలో గదిని చల్లగావుంచడం కోసం ఎయిర్ కూలర్ ని తెచ్చి పెట్టుకోవడం మంచిది. టేబుల్ ఫ్యాన్ కి బదులు సీలింగ్ ఫ్యాన్ బిగించుకోవడం ఉత్తమం. అధిక స్పీడ్ లో ఫ్యాన్ ని తిరగనివ్వరాదు.
గదిలో బల్బ్ ని తొలగించి ట్యూబ్ లను బిగించుకోవాలి. కిటికీ కర్టెన్ ని డోర్ కర్టెన్లని ఎప్పుడూ మూతఉంచకుండా సగంకతెరచి ఉండటం మంచిది. వాటిని అప్పుడప్పుడు నీటితో తడుపుతుండడంవల్ల గదిలో చల్లదనం చోటుచేసుకుంటుంది. వేసవిలో గదులలోపలి గోడలకి ముదురురంగు వాల్ పెయింట్ ని వేయించడం మంచిది.
బంధువులు వచ్చారంటే ఫ్యామిలీ ఆల్బమ్ చూడటం పరిపాటే. చాలామంది సమయం సరిపోక వివిధ సందర్భాల్లో తీసిన ఫొటోలన్నీ కవర్లలో అలాగే కట్టలు కట్టలుగా ఉంచుతుంటారు. వాటిని కాస్తంత పద్ధతిగా ఆల్బమ్‌లలో సర్ది అందుబాటులో ఉంచినట్లయితే వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా బంధువులకు చూపించవచ్చు.
చాలామంది బంధువులు వచ్చారని హాల్లో ఎక్కువగా కుర్చీలు వేస్తే, గది ఇరుకుగా కనిపిస్తుంది. అలా కాకుండా, ఓ గోడవైపు పెద్ద పరుపు వేసి, మంచి దుప్పటి పరచి, ఐదారు కుషన్లు అక్కడక్కడా ఉంచితే సరిపోతుంది. ఇలాగయితే అందరూ ఒకేచోట కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు. హాల్ చూసేందుకు విశాలంగా కూడా ఉంటుంది.



Click it and Unblock the Notifications