For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రొమాంటిక్ బెడ్ రూమ్ డెకరేషన్ ఐడియాస్: వాలెంటైన్ స్పెషల్

|

వాలెంటైన్ డే కు ఇక ఒక రోజే ఉంది. ప్రపంచంలో చాలా మంది ఈ రోజుకోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటే. వారిలో ప్రేమను తెలపడానికి, ఇతరుల నుండి ప్రేమను పొందడానికి చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు. ప్రేమికులు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, అలాగే గ్రీటింగ్ కాడ్స్ పంపుకోవడం మరియు ఒకరికోసం ఒకరు సమయం గడపడం కోసం ఇప్పటి నుండే ప్లాన్ చేసుకుంటుంటారు.

ఈ ఒక్కరోజుకోసం ఎన్నో ప్లాన్స్, ఆనందంగా, ఒంటరిగా గడపడానికి బోలెడు ప్లాన్స్ చేసుకుంటరు. సంవత్సరంలో ఈ ఆనందమైన క్షణాలు అన్ని రోజులు గడపాలనుకోరు?కానీ, ఈ ఒక్కరోజు ప్రేమకోసం హార్డ్ వర్క్, త్యాగం మరియు బాధ్యతలు చాలా వస్తాయి. ఒక్క రోజు ప్రేమకోసం మరియు ఆనందించడం కోసం మరియు ప్రేమలో మునిగిపోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాము. దీన్ని మనం వాలెంటైన్ డే వేడుకలు జరుపుకోవడంలో ఒక అంతిమ కారణంగా పరిగణించవచ్చు.

కాబట్టి, మీరు ఇప్పటికే వాలెంటటైన్ డే ను ప్రత్యేకంగా ఎలా జరుపుకోవాలి మరియు ఆ మధుర క్షణాలను చిరస్మరణీయంగా చేయడానికి ప్రయత్నిస్తుంటారు. మీ పాట్నర్ ను మరింత సర్ ప్రైజ్ చేయడానికి, రొమాంటిక్ వాతావరణం కల్పించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందులో బెడ్ రూమ్ డెకరేషన్ కూడా ఒకటి. సౌకర్యవంతమైనదిగా ఆహ్లాదకరంగా మార్చుకోవడం చాలా అవసరం.

ఈ స్పెషల్ రోజున మీ ప్రేమను మరియు మీ భావాలను పంచుకోవడానికి పడక గదికంటే మరింత సౌకర్యవంతమైన ప్రదేశం మరొకటి ఉండదు. అందుకోసం వాలెంటైన్ డే స్పెషల్ గా జరుపుకోవడం కోసం కొన్ని బెడ్ రూమ్ డెకరేషన్ ఐడియాలు మీకోసం...

1.బాల్కనీ

1.బాల్కనీ

బెడ్ రూమ్ కు ఆనుకొని ఉన్నబాల్కనీ ఉత్సహాంగా ఉండటం కోసం ఒక చక్కటి ఆహ్లాదపరిచే వాతావరణాన్ని ఏర్పరుచుకోవాలి. అందుకు అక్కడ పూల మొక్కలు, మంచి లైటింగ్, ఎటువంటి శబ్దలు లేకుండా చేసుకోవాలి. బాల్కనీ డోర్స్ తెరిచి ఉంచడం వల్ల చల్లని, పిల్ల గాలులు మీ మూడ్ ను మార్చేస్తాయి.

2.వైన్

2.వైన్

మీ పాట్నర్ తో మాట్లాడటానికి ఎక్కువ సమయం గడపడానికి ఒక హెల్తీ వైన్ ఉంటే రొమాంటిక్ మూడ్ కలిగిస్తుంది. కాబట్టి, మీ బెడ్ పక్కన మీకు నచ్చిన వైన్, గ్లాస్ తో అమర్చి పెట్టుకోండి. అలాగే మరింత ఆకర్షణీయంగా కనబడుటకు క్యాండిల్స్ ను వెలిగించి పెట్టుకోవాలి.

3.మ్యూజిక్

3.మ్యూజిక్

చాలా అందంగా బ్యాక్ గ్రౌడ్ మ్యూజిక్ ను అరేంజ్ చేసుకొన్నప్పుడు మనస్సును ప్రశాత పరిచి మీ మూడ్ మార్చుతుంది. మీకు నచ్చిన రొమాంటిక్ సాంగ్స్ ను అరేంజ్ చేసుకోవచ్చు.

4.క్యానోపి

4.క్యానోపి

మీరు వాలెంటైన్ డే డెకర్ ఐడియాస్ లో పడకగది అలంకరణ ఎంపిక చేసుకొన్నప్పుడు, బెడ్ అద్భుతంగా ఉండేలా అమర్చుకోవాలి. పోస్టర్ బెడ్స్ మరింత రొమాంటిక్ గా కనబడుతాయి.

5. కలర్స్

5. కలర్స్

బెడ్ రూమ్ లో కలర్స్ మీకు నచ్చిన రొమాంటిక్ కలర్స్ తో అమర్చుకోవడం వల్ల, మరింత ఆహ్లాదంగా ఉంటుంది. అందుకు డార్క్ షేడ్స్ ఉన్న రెడ్ లేదా బ్లూ లేదా లైట్ గోల్డ్ లేద క్రీమ్ కలర్స్ ను ఎంపిక చేసుకోవాలి.

6.బెడ్

6.బెడ్

వాలెంటైన్ డే రోజున, మీ పడకగదిని అరేంజ్ చేసుకోవడానికి ముఖ్యంగా సిల్క్ అండ్ సాటిన్ మెటీరియల్స్ ను ఎంపిక చేసుకోండి. సాటిన్ మెటీరియల్స్ చాలా లక్సరీగా ఉంటాయి మరియు వీటి ఖరీదు కూడా తక్కువే.

7.కర్టెన్స్

7.కర్టెన్స్

కర్టెన్స్ లైట్ కలర్స్ లో ఉండేలా ఎంపిక చేసుకోవాలి. తెలుపు, లేదా క్రీమ్ కలర్ ఫ్లోర్ లెగ్త్ కర్టెన్స్ ను అమర్చుకోవడం వల్ల వాలెంటైన్ డేను మరింత ఉత్సహాయంగా, ఆహ్లాదంగా మార్చుతుంది.

8.ఫ్లవర్స్

8.ఫ్లవర్స్

వాలెంటైన్ రోజును పువ్వులు మరో ముఖ్య పాత్రను పోషిస్తాయి. ముఖ్యంగా రెడ్ రోజ్ ను ఎక్కువగా ఫ్రివర్ చేస్తారు. అయితే మీకు నచ్చిన పువ్వులను ఎంపిక చేసుకొని వాటితో మీ పడకు అలంకరించుకోచ్చు.

9.క్యాండిల్స్

9.క్యాండిల్స్

వాలెంటైన్ డేను మరింత ఆహ్లాదభరితంగా మార్చుకోవడానికి మీ బెడ్ రూమ్ ను క్యాండిల్స్ తో అక్కడక్కడ వెలిగించుకోవండి. వాటికోసం కరెక్ట్ ప్లేస్ ను ఎంపిక చేసుకోండి.

10.లైటింగ్

10.లైటింగ్

వాలెంటైన్ డే న మీ బెడ్ రూమ్ డెకరేట్ చేయడానికి మీ ప్లాన్స్ చేసేప్పుడు మీ పడక గదిలో లైంటింగ్ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకు గోల్డెన్ లైట్స్ ఎంపిక చేసుకోవాలి. అలాగే కొద్దిగా డిమ్ లైట్స్ , సరిపడా వెలుతు పడే లైట్స్ ఎంపిక చేసుకుంటే సరిపోతుంది.

English summary

Valentine's Day Special: Bedroom Decoration Ideas

Valentine’s day is around the corner and love is in the air. It’s time for people all over the world to celebrate their love for each other. Lovers will exchange gifts, send each other greeting cards or spend their time together.
Story first published: Wednesday, February 12, 2014, 17:42 [IST]
Desktop Bottom Promotion