మీ ఇంటికి హృదయం వంటింది ఇంటీరియర్ డిజైన్

ఇల్లు చూసి ఇల్లాలిని చూడండి అనడం ఒకప్పటిమాట. ఇల్లు చూసి ఇంటీరియర్‌ డిజైనర్ని చూడమనటం నేటి ఫ్యాషన్‌. భవన నిర్మాణంలో ఇండిపెండెంట్‌ ఇండ్లు, విల్లాలు, డుప్లెక్స్, రో హౌజెస్‌ -పేరేదైనా రూపేదైనా అందరికీ అనుకూలంగా అమర్చే మానవ బ్రహ్మలే ఇంటీరియర్‌ డిజైనర్లు. లివింగ్‌ రూమ్‌, బెడ్‌రూమ్‌, కిచెన్‌, పూజ, డైనింగ్‌, బాత్రూం, ఇవికాక పిల్లలకో గది, అతిథులకో రూము. ఆర్కిటెక్ట్, ఇంజనీరు ఎలివేషన్‌, నిర్మాణం పర్యవేక్షిస్తారు.

పూర్తయిన ఇంటి నిర్మాణాన్ని చూస్తే ఇంకా ఏదో మిగిలే వుందనిపిస్తుంది. ఆ శూన్యమే -లోపించిన ఇంటీరియర్‌ డిజైన్‌! మనిషి చలనానికి, మనిషి మనుగడకు గుండె ఎంత ముఖ్యమో -ఆధునిక కాలంలో ఇంటికి ఇంటీరియర్‌ అంత ముఖ్యం. నాలుగ్గోడల మధ్యనున్న శూన్యాన్ని నింపి ఇంటికి హృదయాన్ని అమర్చేదే ఇంటీరియర్‌ డిజైనింగ్‌. ఇల్లు కట్టేటపుడు కేవలం ఇంటి యజమాని మాత్రమే అధిక శాతం పాలుపంచుకుంటాడు. అయితే ఇంటీరియర్‌ విషయంలో మాత్రం ఇంటిల్లిపాదీ సమావేశమవుతారు.

Simple Ideas for interior designing

ఇంటి ఇల్లాలు వంటగదిపై ఆసక్తి చూపిస్తుంది. లివింగ్‌, డైనింగ్‌ తన స్నేహితులను పిలిచినపుడు చక్కగా వుండాలనుకుంటాడు గౄఎహస్థు. తమ బెడ్రూం జంగిల్‌ థీమ్‌ లేదా కార్టూన్‌ థీమ్‌ కావాలంటారు పిల్లలు. నాయనా, పూజగది బాగుండాలి, ప్రశాంతంగా కాసేపు కూర్చుంటాను అంటుంది ఏ బామ్మో, నానమ్మో!

Simple Ideas for interior designing

పదిమంది వచ్చే చోటు డ్రాయింగ్‌ రూం బాగాలేకపోతే ఎలాగని మరోమారు తన మాటను బలంగా చెప్తాడు ఇంటి యజమాని. వీళ్లందరి అభిప్రాయాలను సమన్వయపరచి ఇంటిలోని వారందరికీ నచ్చే విధంగా, ఇంటికి వచ్చినవారు మెచ్చే విధంగా ఇంటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దగల వ్యక్తి ఇంటీరియర్‌ డిజైనర్‌. అటువంటి ఇంట్లో మరికాసేపు వుందామనిపించాలి! అటువంటి ఇంటిని ధరాభారం కాకుండా, ధనాభావం రాకుండా సామాన్యులు కూడా అందుకోవాలంటే కష్టం కదా అన్న ప్రశ్నకు -మరీ అంత కాదులెండి అంటున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు. మార్కెట్లోని వివిధ ఉత్పత్తులమధ్య ధరల తేడాలను వివరించడమే కాకుండా, తక్కువ బడ్జెట్లోనే నాణ్యతను ఎలా కాపాడుకోవాలో సూక్ష్మమార్గాలను వివరిస్తున్నారు.

Simple Ideas for interior designing

ఇంటీరియర్‌ డిజైనర్లు చెప్తున్న ముఖ్య విషయాల్లో -తూకం తక్కువుండి నిడివి పెద్దవైనా అటువంటి హ్యాం డిల్‌‌స వాడకూడదన్నది మొదటి పాయంట్‌. వాటికన్నా క్వాలిటీ బాగున్న చిన్నసైజువే మేలని వివరిస్తున్నారు. అలాగే గ్లాస్‌ వినియోగించాల్సి వచ్చినపుడు గాఢమైన డిజైన్లు చేయించి అధిక ధర వెచ్చించే కన్నా గ్లాస్‌ మీద చక్కటి స్టికర్‌ అంటించి కొత్త అందాలను సౄఎష్టించవచ్చని సూచిస్తున్నారు.

Simple Ideas for interior designing

చిన్న చిన్న చిట్కాలే పర్సును కాపాడుతాయి. ఒక్కోసారి మనం ఎంచుకునే రంగులలో కూడా ధరల తేడాలుంటే, గమనించి తదనుగుణంగా మనం ఎంపిక చేసుకోవాలి. ఇలా కొత్తగా మార్కెట్‌కు వస్తున్న ఇంటీరియర్‌ డిజైన్లను క్షుణ్ణంగా గమనిస్తూ బడ్జెట్లో సమతూకం సాధించొ చ్చన్నది డిజైనర్ల సూచన. ఇల్లు కడితేనే సరిపోదు, దానికి పదిలమైన హౄఎదయంలాంటి ఇంటీరియర్‌ డిజైన్‌ను ఏర్పాటు చేసుకుంటేనే ఇంటికి జీవం. ఇంటీరియర్‌ డిజైనింగ్‌కు కూడా వాస్తు సలహాలు పాటించడం మంచిదని వాస్తు నిపుణులు అంటున్నారు. ఇంటి నిర్మాణంలోనే కాదు ఇంటీరియర్‌ డిజైనింగ్‌ లో కూడా వాస్తును పాటించడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించేలా చేసుకోవచ్చు.

Simple Ideas for interior designing

సాధారణంగా కొత్త ఇల్లు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఇంటి డిజైనింగ్‌. ఇంటికి వేయాల్సిన రంగులే. చాలామంది తమకు ఇష్టమున్నా లేకపోయినా ఏదో ఒక రంగును వేస్తుంటారు. ఎంతో శ్రమించి, వెచ్చించి నిర్మించుకున్న ఇంటికి సరైన రంగులు వేయకుంటే ఆ ఇంటికి అందం ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే అందమైన డిజైనింగ్‌తో రూపొందిన ఇల్లు కూడా తన ఆహ్లాదాన్ని కోల్పోతుంది.

Simple Ideas for interior designing

అలాకాక ఇంటికి మనకు నచ్చిన రంగులు వేసుకుంటే అందంగా ఉంటాయంటున్నారు ఇంటీరియర్‌ డిజైనింగ్‌ నిపుణులు. పెయింటింగ్‌ విషయంలో వాస్తు పెయింటింగ్‌ ను వేసుకోడం వల్ల ఇంట్లో ఆహ్లాదకరమైన, పవిత్రమైన వాతావరణంలో ఒక శక్తి ఉంటుందని భావిస్తున్నారు. వాస్తు పెయింటింగ్‌‌స ను గమనిస్తే, అవి అందమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణంను అందిస్తాయి. ఇంటికి వాస్తు ప్రకారం పెయింటింగ్‌‌స ను వేసుకోవడం వల్ల ఇంట్లో వారి మానసిక స్థితి, ఆరోగ్యం మరియు ఆనందం మీద గొప్ప ప్రభావం కలిగి ఉంటుంది.

Story first published: Saturday, June 27, 2015, 19:34 [IST]
Desktop Bottom Promotion