Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
డార్క్ కలర్స్ తో ట్రెండింగ్ బెడ్ రూమ్ వాల్ పెయిట్స్
బాహ్య ప్రపంచంతో విడిపోయిన, పూర్తిగా తనదైన లోకమే పడకగది. మనసు సేదతీరడానికి, వినోదభరితంగా ఉండడానికి పడక గదిని మించిన చోటు మరొకటి లేదు. ప్రత్యేకించి వ్యక్తిగతమైన ఆశలన్నీ నెరవేరే ఒక అందమైన ప్రదేశం.
పడకగది గోడలకు వేసే కొన్ని ప్రత్యేక రంగులు, గోడలకు వేలాడదీసే పెయింటింగ్స్, గదిని శోభాయమానం చేయడమే కాకుండా దంపతులిరువురిలోనూ పరస్పరం ప్రేమ జనింపచేసే ఒక మనోహరమైన వేదిక. తన్మయత్వానికీ, ప్రేమభావనకూ మనసు ప్రణయ దృష్టిని పొందడానికి గదిలోపల నాలుగు భాగాలకూ కళ్లను కట్టిపడేసే రంగులు వేయడం చాలా అవసరం. సహజంగా జీవితంలో మూడోవంతు సమయం గడిచిపోయే పడకగదిని అలంకరణకు సంబంధించి కొన్ని వివరాలు ఇవిగో మీ ముందు ఉన్నాయి.....
రమ్యంగా అనిపించడానికి....
భావోద్వేగాన్నీ, మనోహర భావాన్నీ కలిగించడానికి వజ్రవర్ణానికి సంబంధించిన గాఢమైన రంగులు వేయడం మేలు.

లేత వర్ణాలకన్నా పడకగది అలంకరణలో చిక్కని రంగులు వేయడం వల్ల ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది. ఆధునిక యుగంలో హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. కాకపోతే గాఽఢమైన వర్ణాలు విశాలమైన ఖాళీలు ఉన్నచోటే బావుంటాయి. గ్రే, బ్రౌన్ రంగులు ఆధునికులు ఇష్టపడే వర్ణ మిశ్రమానికి అదనపు ఆకర్షణగా ఉంటాయి.
గాఢమైన ఏ రంగులైనా తెలుపు రంగుతో ఇట్టే మ్యాచ్ అవుతాయి. ప్రత్యేకించి పింక్, మెరూన్, గోల్డ్ రంగులు బాగా ఒదుగుతాయి.
స్పూర్తిదాయక దృష్టికి
ఎరుపు, పసుపు వంటి బ్రైట్ కలర్స్‌ను కాస్తంత ఆరెంజ్ రంగును మేళవించిన రంగులు ఉదయం వేళ మేలుకునే సమయంలో ఇవి ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తాయి.
పసుపు, ఆరెంజ్ వంటి రంగుల కలయికలో కాస్తంత బ్రౌన్ రంగు కూడా కలిస్తే అది కొంత వైవిధ్యంగా ఉంటుంది.
ఎరుపు, పసుపు, నీలం, ఆరెంజ్ లో బ్రైట్ కలర్స్‌ను తెలుపుతో కలపితే అది మనలో ఒక శక్తిని, స్ఫూర్తినీ నింపుతుంది.
మనసు శాంతపరిచేవి....
నీలి, ఆకుపచ్చ, కట్లపూవు వర్ణాలు మనసును బాగా శాంతపరుస్తాయి. అదే సమయంలో మనసును అలజడికి గురిచేసే వర్ణాలకు దూరంగా ఉంచాలి.
నీలి, ఆకుపచ్చ వర్ణాలు పడకగదికి ఒక మృదువైన భావాన్ని కలిగిస్తాయి. ఇవి చిన్నగదుల్ని కూడా విశాలంగా అనిపించేలా చేస్తాయి.



Click it and Unblock the Notifications